భోజన సేవ | food service to poor peoples | Sakshi
Sakshi News home page

భోజన సేవ

Published Sat, Sep 6 2014 3:35 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

భోజన సేవ - Sakshi

భోజన సేవ

ఇడ్లీ తినాలంటే ఇరవై... కాసిన్ని టీ నీళ్లు తాగాలంటే పది. అంతోఇంతో డబ్బున్నవారి మాట సరే... రి అడ్డా కూలీలు... రిక్షావాలాల వంటి పేదల పరిస్థితి..! రోజంతా కాయుకష్టం చేసినా... నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని దుస్థితి. కడుపు నింపని పని. వారి ఆకలి బాధను అర్థం చేసుకుందో కుటుంబం. తరాలుగా పది రూపాయులకే భోజనం పెడుతోంది. బయుట ధరలు వుండుతున్నా... సాల నషాలానికి అంటుతున్నా... వీరి మెనూలో ‘షార్టేజ్’ కనిపించదు. రేటులో వూర్పూ ఉండదు.
 
‘చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాం. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నిరుపేదలకు కడుపు నిండాలి. మేం చల్లగా ఉండాలి’... ఇదీ గిన్నె బాలకృష్ణ మాట. ఆయున ఉండేది మేడ్చెల్ మండలం కోనాపల్లి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈయన ఇప్పుడు పది రూపాయులకే భోజనం పెడుతున్నారు. ఆయున తాత దాదాపు 70 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చారు. ఆయున మోండా మార్కెట్ సమీపంలో ఎడ్ల బండిపై హోటల్ పెట్టి భోజనం అమ్మేవారు. అప్పట్లో దీని రేటు 25 పైసలు. ఆ తర్వాత బాలకృష్ణ తండ్రి, చిన్నాన్న పెదనాన్నలు కూడా దీన్ని వృత్తిగా మలుచుకున్నారు.
 
వారిని అనుసరిస్తూ... 30 ఏళ్ల కిందట బాలకృష్ణా, ఆయున సోదరులు శ్రీను, చిట్టిబాబు కూడా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పుట్‌పాత్ పై తాత్కాలిక హోటళ్లు ఏర్పాటు చేసుకుని రూ. 10లకే భోజనాన్ని అందిస్తున్నారు. బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తుండడంతో క్రమంగా రూ. 3 నుంచి ఇటీవలే రూ. 10కి పెంచారు. దినసరి కూలీలు, కార్మికులే వీరి కస్టమర్లు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కూలీలకు అందుబాటులో ఉంటున్నారు.
 
పప్పు, చారు, చెట్నీ..
కిలో బియ్యం రూ.40 పైవూటే. కూరల ధరలు ఆకాశంలో ఉన్నారుు. పప్పుల వూట వింటేనే వుంట. ఇలాంటి పరిస్థితుల్లో రూ.10కే భోజనం పెట్టడం సావూన్యమైన విషయుం కాదు. ఏదో మొక్కుబడిగా కాకుండా... పప్పు, చారు, చెట్నీ మెనూలో ఉంటారుు. కూరలు కూడా పెట్టిందే పెట్టకుండా రోజుకొక వెరైటీ వడ్డిస్తారు. గ్యాస్‌పై కాకుండా... పూర్తిగా కట్టెల పొరుు్యమీదే వంట. వీళ్లు వాడే బియ్యుం ఖరీదు కిలో రూ.35. అయినా చికెన్ రైస్ కూడా రూ.20కే అందిస్తున్నారు. బోటి రైస్ రూ. 25. వీరి చలవతో తక్కువ ధరలో రుచికరమైన భోజనంతో కడుపు నింపుకుంటున్నారు దినసరి కూలీలు.
 - మహి
 
అదే పదివేలు..
గరీబోళ్ల పొట్ట నిండి... వారు ఆనందంగా ఉంటే అదే పదివేలు. వాళ్లిచ్చే రూ.10లో మాకు కొంత మిగిలినా చాలు. మాకు పుణ్యం కూడా దక్కుతుంది. దీని మీద వచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే నా ముగ్గురు ఆడపిల్లల్ని, ఒక బాబుని చదివిస్తున్నా. ఇంతకన్నా ఏం కావాలి. నేను ఒక్కడినే కాదు.. మా అన్నదమ్ములు కూడా ప్యారడైజ్, మహబూబ్ కాలేజ్, జైల్‌కానా దగ్గర హోటళ్లు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ల వద్ద కూడా రూ.10కే భోజనం దొరుకుతుంది.
 - బాలకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement