medchal mandal
-
యథేచ్ఛగా ఇటుక బట్టీలు
మేడ్చల్ : రైతుల బలహీనతలు, ఆర్థిక సంపాదనలు అంతంత మాత్రంగా ఉండటంతో వాటిని ఆసరా చేసుకున్న ఇటుక బట్టీల వ్యాపారులు మేడ్చల్ డివిజన్లోని మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మేడ్చల్ శివారు మండలం కుత్బుల్లాపూర్ మండలాల్లో వివిధ గ్రామాల్లో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పంట సాగుకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీకి ఉచిత విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నారు. డివిజన్ మండలాల్లో ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతున్నా రెవెన్యూ, ట్రాన్స్‌కో శాఖ అధికారులు మామూళ్ల మాయలో కళ్లకు గంతలు కట్టుకున్నారు. ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. వంద ఎకరాల అసైన్డ్ భూముల్లో.... మేడ్చల్ మండలంలోని గౌడవెళ్లి, శ్రీరంగవరం, బండమాదారం, రాయిలాపూర్, గుండ్లపోచంపల్లి, నియోజకవర్గంలోని కీసరతో పాటు యాద్గార్పల్లి, తిమ్మాయిపల్లి, కరీంగూడ,భోగారం, శామీర్‌పేట మండలం ఉద్దెమర్రి, అలియాబాద్, జవహర్‌నగర్, కుత్బుల్లాపూర్ మండలం నాగులూర్, దుండిగల్ గ్రామాల పరిధిలో దాదాపు 300 ఎకరాల భూములను ఇటుక బట్టీల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 100 ఎకరాల వరకు అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణ రంగం పెరగడంతో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, కీసర, శామీర్‌పేట్ మండలాల్లో ఇటుకల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ప్రైవేట్, ప్రభుత్వ అసైన్డ్ పొలాల్లో బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. దుర్వినియోగం అవుతున్న ఉచిత విద్యుత్ ఇటుక బట్టీల నిర్వాహకులు వ్యవసాయ బోర్ల నీటినే వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ దుర్వినియోగమవుతుంది. డివిజన్లో సుమారు 300 వరకు ఇలా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇటుకల తయారీకి పొలాల్లో ఉండే బోర్ల నుంచి బట్టీల వరకు పైప్లైన్ల వేసుకుంటున్నారు. కొందరైతే బట్టీల వద్ద ఎకంగా కాలువలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండీ కొడుతున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు వ్యవహరించడం గమనార్హం. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఇటుక బట్టీల వ్యాపారంలో అక్రమార్కులకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులకు ఏవి అసైన్డ్ భూములో ఏవి పట్టా భూములో ఖచ్చితంగా తెలుసు. కానీ అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నా పట్టించుకోరు. గ్రామాల రెవెన్యూ అధికారులు బట్టీల వ్యాపారులతో నెలకు కొంత అమౌంట్ ఇవ్వాలని వ్యాపారం ప్రారంభంకాక ముందే మాట్లాడుకుంటున్నారని పలువురు బహీరంగంగానే అంటున్నారు. ట్రాన్స్‌కో వారికి కాసుల పంట ఇటుక బట్టీల వ్యాపారం ట్రాన్స్‌కో అధికారులకు కాసుల పంటగా మారింది. గ్రామాల్లో ఉచిత కరెంట్ బోరు నుంచి నీరు అందెలా చూసేది కరెంటోళ్లే. పేరుకు ఒక చోట కమర్షియల్ మీటర్ పెట్టి మిగతాదంతా ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. విద్యుత్ సిబ్బందికి అన్ని తెలిసినా వారికి ముట్టాల్సింది ముట్టడంతో అక్రమ వ్యాపారులకు అండగా నిలబడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు. తాము ఉన్నామని చెప్పుకునేందుకు అప్పుడప్పుడు విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు చేసి నామమాత్రపు అపరాధ రుసుములు విధిస్తున్నారు. -
హీటర్ పెడుతుండగా..
సాక్షి, మేడ్చల్: వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతుండగా ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మేడ్చల్ మండలంలోని ఘనపూర్ గ్రామంలో జరిగింది. బీఎన్ఆర్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కురకుల మోహన్(12) నీళ్లు వేడి చేసుకోవడానికి హీటర్ పెడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అతను మృతిచెందాడు. -
భోజన సేవ
ఇడ్లీ తినాలంటే ఇరవై... కాసిన్ని టీ నీళ్లు తాగాలంటే పది. అంతోఇంతో డబ్బున్నవారి మాట సరే... మరి అడ్డా కూలీలు... రిక్షావాలాల వంటి పేదల పరిస్థితి..! రోజంతా కాయుకష్టం చేసినా... నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని దుస్థితి. కడుపు నింపని పని. వారి ఆకలి బాధను అర్థం చేసుకుందో కుటుంబం. తరాలుగా పది రూపాయులకే భోజనం పెడుతోంది. బయుట ధరలు వుండుతున్నా... మసాల నషాలానికి అంటుతున్నా... వీరి మెనూలో ‘షార్టేజ్’ కనిపించదు. రేటులో వూర్పూ ఉండదు. ‘చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాం. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నిరుపేదలకు కడుపు నిండాలి. మేం చల్లగా ఉండాలి’... ఇదీ గిన్నె బాలకృష్ణ మాట. ఆయున ఉండేది మేడ్చెల్ మండలం కోనాపల్లి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈయన ఇప్పుడు పది రూపాయులకే భోజనం పెడుతున్నారు. ఆయున తాత దాదాపు 70 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చారు. ఆయున మోండా మార్కెట్ సమీపంలో ఎడ్ల బండిపై హోటల్ పెట్టి భోజనం అమ్మేవారు. అప్పట్లో దీని రేటు 25 పైసలు. ఆ తర్వాత బాలకృష్ణ తండ్రి, చిన్నాన్న పెదనాన్నలు కూడా దీన్ని వృత్తిగా మలుచుకున్నారు. వారిని అనుసరిస్తూ... 30 ఏళ్ల కిందట బాలకృష్ణా, ఆయున సోదరులు శ్రీను, చిట్టిబాబు కూడా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పుట్‌పాత్ పై తాత్కాలిక హోటళ్లు ఏర్పాటు చేసుకుని రూ. 10లకే భోజనాన్ని అందిస్తున్నారు. బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తుండడంతో క్రమంగా రూ. 3 నుంచి ఇటీవలే రూ. 10కి పెంచారు. దినసరి కూలీలు, కార్మికులే వీరి కస్టమర్లు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కూలీలకు అందుబాటులో ఉంటున్నారు. పప్పు, చారు, చెట్నీ.. కిలో బియ్యం రూ.40 పైవూటే. కూరల ధరలు ఆకాశంలో ఉన్నారుు. పప్పుల వూట వింటేనే వుంట. ఇలాంటి పరిస్థితుల్లో రూ.10కే భోజనం పెట్టడం సావూన్యమైన విషయుం కాదు. ఏదో మొక్కుబడిగా కాకుండా... పప్పు, చారు, చెట్నీ మెనూలో ఉంటారుు. కూరలు కూడా పెట్టిందే పెట్టకుండా రోజుకొక వెరైటీ వడ్డిస్తారు. గ్యాస్‌పై కాకుండా... పూర్తిగా కట్టెల పొరుు్యమీదే వంట. వీళ్లు వాడే బియ్యుం ఖరీదు కిలో రూ.35. అయినా చికెన్ రైస్ కూడా రూ.20కే అందిస్తున్నారు. బోటి రైస్ రూ. 25. వీరి చలవతో తక్కువ ధరలో రుచికరమైన భోజనంతో కడుపు నింపుకుంటున్నారు దినసరి కూలీలు. - మహి అదే పదివేలు.. గరీబోళ్ల పొట్ట నిండి... వారు ఆనందంగా ఉంటే అదే పదివేలు. వాళ్లిచ్చే రూ.10లో మాకు కొంత మిగిలినా చాలు. మాకు పుణ్యం కూడా దక్కుతుంది. దీని మీద వచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే నా ముగ్గురు ఆడపిల్లల్ని, ఒక బాబుని చదివిస్తున్నా. ఇంతకన్నా ఏం కావాలి. నేను ఒక్కడినే కాదు.. మా అన్నదమ్ములు కూడా ప్యారడైజ్, మహబూబ్ కాలేజ్, జైల్కానా దగ్గర హోటళ్లు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ల వద్ద కూడా రూ.10కే భోజనం దొరుకుతుంది. - బాలకృష్ణ