చూస్తుండగానే మరో ఘోరం జరిగిపోయింది. రాష్ట్రంలో అవినీతి రక్కసి కోరలకు మరో ఎస్సై బలైపోయారు. ఉన్నతాధికారుల వేధిం పులు భరించలేక, తాను చేయని తప్పును తనపై వేసుకోలేక సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు (54) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీసు రివాల్వర్‌తో తన భార్యను కాల్చి తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దుబ్బాక పోలీసు క్వార్టర్స్‌లో శుక్రవారం పట్టపగలే ఈ ఘటన జరిగింది. గత తొమ్మిది నెలల్లో ఒకే పోలీసు డివిజన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న రెండో ఎస్సై చిట్టిబాబు కావడం గమనార్హం.