Samantha Shares Five Facts About Shaakuntalam Movie - Sakshi
Sakshi News home page

Samantha: అవీ అంటే నాకు అలర్జీ.. ఆరు నెలలు ఇబ్బంది పడ్డా: సమంత

Published Tue, Apr 11 2023 8:13 PM | Last Updated on Tue, Apr 11 2023 9:03 PM

Samantha Shares Five Facts About Shaakuntalam Movie - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ తేది దగ్గర పడుతుండడంతో సమంత వరుస ఇంటర్వ్యూలు పాల్గొంటున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఈ సినిమాకు సంబంధించి ఐదు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సమంత షేర్ చేశారు. 

ఐదు ఇంట్రెస్టింగ్ విషయాలివే

  • పూలు అంటే ఎలర్జీ అని సమంత తెలిపారు. ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూలు చుట్టుకోవడంతో దద్దుర్లు వచ్చాయని వెల్లడించారు. అవీ టాటూలాగా కనిపించాయని.. ఆరు నెలలు అవి అలాగే ఉండిపోయాయని తెలిపింది. షూటింగ్‌ సమయంలో అవి కనిపించకుండా మేకప్‌తో కవర్‌ చేసినట్లు తెలిపింది.
  • శాకుంతలంలో తన పాత్రకు సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నట్లు వెల్లడించింది. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్ కలలోకి వచ్చేవని తెలిపింది. 
  • అంతే కాకుండా సినిమా షూటింగ్‌ సమయంలో కుందేలు కరిచిందని సమంత తెలిపింది. సెట్‌లో చాలా కుందేళ్లు ఉండగా.. ఒకటి తనని కరిచిందని సమంత చెప్పుకొచ్చింది. ఆ కుందేలు తనకు నచ్చలేదని.. అసలు అది క్యూట్‌గానే లేదని చెప్పింది.
  • ఈ సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని.. అది ఒరిజినల్‌ కాదని సమంత వెల్లడించింది.
  • శాకుంతం మూవీలోని ఓ పాటకు ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని సమంత తెలిపింది. దాంతో చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. రౌండ్‌ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు ఫ్రేమ్‌ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్‌ గట్టిగా అరిచారని వెల్లడించింది. నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని వెళ్తోందంటూ చెప్పడంతో సెట్‌ అంతా నవ్వులు కురిసేవని సమంత చెప్పింది.

ఈ విషయాలు తెలుసుకున్న నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement