gunasekar
-
వరుస ప్రమోషన్స్.. మళ్లీ అనారోగ్యం బారిన సమంత
Samantha: సమంత ప్రధాన పాత్రలో తెరకెకక్కిన సినిమా 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది వరకే రిలీజైన ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. మరో వైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో సమంత కూడా ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈక్రమంలో కెమెరా ఫ్లాష్‌లైట్స్ వల్ల తను కళ్లు కూడా తెరవడానికి ఇబ్బంది పడింది. తాజాగా సామ్ అనారోగ్యం బారిన పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సమంతే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. 'ఈ వారం అంతా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండాలని, మీ ప్రేమలో తడిసి ముద్దవ్వాలని అనుకున్నాను. కానీ బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం నాకు జ్వరం కూడా వచ్చింది.. నా గొంతు కూడా పోయింది.. ఈ రోజు మల్లారెడ్డి కాళాశాలలో జరిగే ఈవెంట్లో శాకుంతలం టీం రాబోతోంది.. మీరంతా వెళ్లండి.. మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను' అని సమంత ట్వీట్ చేసింది. అయతే శాకుంతలం సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటం, సామ్ ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. గతంలో టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగిన ఆయన వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న శాకుంతలం సినిమా గుణశేఖర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా రెండు రోజులు వెయిట్ చేయల్సిందే. (1/2)I was really excited to be amongst you all this week promoting my film and soaking in your love. Unfortunately the hectic schedules and promotions have taken its toll, and I am down with a fever and have lost my voice. — Samantha (@Samanthaprabhu2) April 12, 2023 -
30 కేజీల లెహెంగా.. చాలా ఇబ్బంది పడ్డా: సమంత
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ తేది దగ్గర పడుతుండడంతో సమంత వరుస ఇంటర్వ్యూలు పాల్గొంటున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఈ సినిమాకు సంబంధించి ఐదు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సమంత షేర్ చేశారు. ఐదు ఇంట్రెస్టింగ్ విషయాలివే పూలు అంటే ఎలర్జీ అని సమంత తెలిపారు. ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూలు చుట్టుకోవడంతో దద్దుర్లు వచ్చాయని వెల్లడించారు. అవీ టాటూలాగా కనిపించాయని.. ఆరు నెలలు అవి అలాగే ఉండిపోయాయని తెలిపింది. షూటింగ్ సమయంలో అవి కనిపించకుండా మేకప్‌తో కవర్ చేసినట్లు తెలిపింది. శాకుంతలంలో తన పాత్రకు సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్ కలలోకి వచ్చేవని తెలిపింది. అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో కుందేలు కరిచిందని సమంత తెలిపింది. సెట్లో చాలా కుందేళ్లు ఉండగా.. ఒకటి తనని కరిచిందని సమంత చెప్పుకొచ్చింది. ఆ కుందేలు తనకు నచ్చలేదని.. అసలు అది క్యూట్‌గానే లేదని చెప్పింది. ఈ సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని.. అది ఒరిజినల్ కాదని సమంత వెల్లడించింది. శాకుంతం మూవీలోని ఓ పాటకు ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని సమంత తెలిపింది. దాంతో చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. రౌండ్ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు ఫ్రేమ్ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్ గట్టిగా అరిచారని వెల్లడించింది. నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని వెళ్తోందంటూ చెప్పడంతో సెట్ అంతా నవ్వులు కురిసేవని సమంత చెప్పింది. ఈ విషయాలు తెలుసుకున్న నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్ విడుదల
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన సినిమా శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మూవీ టీం. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాకుంతలంను 3D వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్‌తో ఉన్న స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్హ ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇవ్వనుంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
సూపర్ చాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. పౌరాణిక కథతో రూపొందనున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. సమంత స్నేహితురాలి పాత్రను ఈషా చేయనున్నారని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
నాకు నేనే పోటి అంటున్న స్వీటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. అక్టోబర్ నెలలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రెండూ ఎక్స్పరిమెంటల్ సినిమాలు కావటంతో ఏ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని అనుష్కతో పాటు యూనిట్ సభ్యులు కూడా టెన్షన్ పడిపోతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి సినిమా రుద్రమదేవి. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడి ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న కసితో ఉన్నారు చిత్రయూనిట్. ఇక అదే సమయంలో రిలీజ్ కు రెడీ అవుతున్న స్వీటీ మరో సినిమా సైజ్ జీరో. ఎక్స్పరిమెంటల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగి, రిస్క్ చేసింది అనుష్క.. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ మూవీని కూడా అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుష్క లీడ్ రోల్ లో నటించిన రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురౌతాయంటున్నారు విశ్లేషకులు.