నాకు నేనే పోటి అంటున్న స్వీటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. అక్టోబర్ నెలలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రెండూ ఎక్స్పరిమెంటల్ సినిమాలు కావటంతో ఏ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని అనుష్కతో పాటు యూనిట్ సభ్యులు కూడా టెన్షన్ పడిపోతున్నారు.
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ లో తెరకెక్కిన హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి సినిమా రుద్రమదేవి. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడి ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న కసితో ఉన్నారు చిత్రయూనిట్.
ఇక అదే సమయంలో రిలీజ్ కు రెడీ అవుతున్న స్వీటీ మరో సినిమా సైజ్ జీరో. ఎక్స్పరిమెంటల్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగి, రిస్క్ చేసింది అనుష్క.. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ మూవీని కూడా అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుష్క లీడ్ రోల్ లో నటించిన రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురౌతాయంటున్నారు విశ్లేషకులు.