Samantha Shares Tweets On Why She Is Not Attending For Shaakuntalam Movie Promotion - Sakshi
Sakshi News home page

Samantha: అస్వస్థతకు లోనైన సామ్‌.. ఆరోగ్యం దెబ్బతిందంటూ ట్వీట్‌

Published Wed, Apr 12 2023 6:30 PM | Last Updated on Wed, Apr 12 2023 6:59 PM

Samantha Ruth Prabhu Tweets Not Attend Shaakuntalam Promotions Over Health Issue - Sakshi

Samantha: సమంత ప్రధాన పాత్రలో తెరకెకక్కిన సినిమా 'శాకుంతలం'. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది వరకే రిలీజైన ట్రైలర్‌, పాటలతో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. మరో వైపు రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో సమంత కూడా ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈక్రమంలో కెమెరా ఫ్లాష్‌లైట్స్‌ వల్ల తను కళ్లు కూడా తెరవడానికి ఇబ్బంది పడింది. 

తాజాగా సామ్‌ అనారోగ్యం బారిన పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సమంతే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 'ఈ వారం అంతా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండాలని, మీ ప్రేమలో తడిసి ముద్దవ్వాలని అనుకున్నాను. కానీ బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం నాకు జ్వరం కూడా వచ్చింది.. నా గొంతు కూడా పోయింది.. ఈ రోజు మల్లారెడ్డి కాళాశాలలో జరిగే ఈవెంట్లో శాకుంతలం టీం రాబోతోంది.. మీరంతా వెళ్లండి.. మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను' అని సమంత ట్వీట్ చేసింది. అయతే శాకుంతలం సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటం, సామ్‌ ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాగా దర్శకుడు గుణశేఖర్‌ శాకుంతలం చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. గతంలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగిన ఆయన వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న శాకుంతలం సినిమా గుణశేఖర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా రెండు రోజులు వెయిట్‌ చేయల్సిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement