‘‘జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాను నేను ఎంతలా ప్రేమిస్తానో... సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ‘శాకుంతలం’తో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను’’ అని సమంత అన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్‌లో నటింన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ– ‘‘ఓపిక లేకపోయినా గుణశేఖర్‌గారిపై ఉన్న అభిమానం, గౌరవంతో నా బలం మొత్తాన్ని కూడగట్టుకుని ఇక్కడికి వచ్చాను. కొందరికి సినిమా అనేది జీవితంలో ఓ భాగం. కానీ, గుణశేఖర్‌గారికి సినిమానే జీవితం. ప్రతి సినిమాలానే ‘శాకుంతలం’ని కూడా ఆయన ప్రాణం పెట్టి తీశారు. ఏ కథ విన్నా సినిమా బాగా రావాలని నటీనటులు కోరుకుంటారు. కొన్నిసార్లు ఆ ఊహను దాటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..‘శాకుంతలం’ చూశాక నాకు అదే భావన కలిగింది’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్‌గారు ‘శాకుంతలం’ కథ చెప్పినప్పుడు లీడ్ రోల్‌లో సమంత అయితే సరిపోతారనుకున్నాం. కథ విని, సమంత కూడా ఓకే అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా ఇది’’ అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘శాకుంతలం’లో ముగ్గురు హీరోలున్నారు. కథకు హీరో దేవ్ మోహన్ , సినిమాకు హీరో సమంత, తెరవెనక హీరో ‘దిల్’ రాజుగారు.
ఇండియాలో వచ్చిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్ సినివ్చన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో అతి పెద్ద బడ్జెట్ సినిమా ‘శాకుంతలం’. ఓ హీరోయిన్‌ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన రాజుగారికి థ్యాంక్స్. (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు. గుణశేఖర్ మాటలకు సమంత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘‘మా నాన్న ఎన్నో విజువల్స్ వండర్స్ సృష్టించారు. ‘శాకుంతలం’ ఆయనకు పూర్వ వైభవం తెస్తుంది’’ అన్నారు నీలిమ గుణ.
Comments
Please login to add a commentAdd a comment