Netizens Trolling Samantha Shaakuntalam Movie After Wins International Awards, Deets Inside - Sakshi
Sakshi News home page

Shaakuntalam Movie: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్‌ అవార్డులు.. నెటిజన్స్‌ ట్రోలింగ్‌

Published Fri, May 12 2023 12:22 PM | Last Updated on Fri, May 12 2023 12:48 PM

Samantha Shaakuntalam Movie Wins International Awards - Sakshi

సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

అందరి అంచనాలు తలకిందలు చేస్తూ భారీ ఫ్లాఫ్గా నిలిచింది. దీంతో నిర్మాతలను ఊహించని విధంగా నష్టాలపాలు చేసింది శాకుంతలం. మరోవైపు ఈ సినిమా పలు ఇంటర్నేషనల్‌ అవార్డులను సొంతం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ గుణ టీమ్‌ వర్క్స్‌ తెలిపింది.

చదవండి: అనారోగ్యం బారిన పడిన బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా

న్యూయార్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంట‌సీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా శాకుంత‌లం అవార్డులను గెలుచుకున్నట్లు మేకర్స్‌ ప్రకటించగా, ఫ్లాప్‌ సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. కాగా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసిన సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement