International awards
-
Balagam Actors Images: 'బలగం'కు 100 అవార్డులు.. విశ్వ విజయ శతకం వేడుకలు (ఫోటోలు)
-
బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!
చిన్న సినిమా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన చిత్రం బలగం. తెలంగాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు. వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం కలెక్షన్ల వర్షం కురిపించింది. దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ గ్రామీణ సంప్రదాయాన్ని తెరపై ఆవిష్కరించిన వేణుపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందటే.. ఏకంగా పల్లెల్లో ప్రత్యేక షోలు ప్రదర్శించే స్థాయికి చేరుకుంది. అంతలా ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. వెండితెరపై సత్తాచాటిన ఈ చిత్రాన్ని అవార్డులు అంతేస్థాయిలో వరించాయి. ఏకంగా అంతర్జాతీయ వేదికలపై బలగం పేరు మార్మోగింది. (ఇది చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?) ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై వందకుపైగా అవార్డులు సొంతం చేసుకుని అరుదైన రికార్డ్ సాధించింది. పలు దేశాల్లో జరిగిన ఈవెంట్స్‌లో వివిధ విభాగాల్లో బలగం సినిమాకు అవార్డులు దక్కాయి. ఇంతవరకు ఏ సినిమా సాధించలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. గతంలో ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. కానిస్టేబుల్, గ్రూప్-4 పరీక్షల్లో ప్రశ్నలు అంతే కాకుండా గతంలో తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఇటీవలే జరిగిన గ్రూప్-4 పరీక్షలో సైతం బలగం సినిమా ప్రశ్నను అడిగారు. తెలంగాణలో పల్లెపల్లెలో బలగం సినిమాకు పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. అలాగే మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. (ఇది చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!) A journey of Excellence and Recognition! ❤️ Earlier, we had Films running for 100 days.. Films running in 100 centers.. Films collecting 100 crores .. Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons 🤗🤗#balagam pic.twitter.com/26yfgS8sse — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 4, 2023 -
'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్
సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అందరి అంచనాలు తలకిందలు చేస్తూ భారీ ఫ్లాఫ్గా నిలిచింది. దీంతో నిర్మాతలను ఊహించని విధంగా నష్టాలపాలు చేసింది శాకుంతలం. మరోవైపు ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ తెలిపింది. చదవండి: అనారోగ్యం బారిన పడిన బిగ్‌బాస్ బ్యూటీ అరియానా న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్‌గా శాకుంతలం అవార్డులను గెలుచుకున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఫ్లాప్ సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. Our team is overwhelmed to have been honored with these prestigious Global Awards ✨ Thank you for this incredible recognition 🙏#Shaakuntalam streaming now on @PrimeVideoIN. https://t.co/obv3N5qKUw@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna… pic.twitter.com/2EjTVaOlLO — Gunaa Teamworks (@GunaaTeamworks) May 11, 2023 -
Prachi Dhabal Deb: ఆ కేకుల కోసం క్యూ కడతారు
బొమ్మలేసే ఆర్టిస్టు గురించి విన్నాం. కేక్ ఆర్టిస్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రాచీ ధబల్ను మన దేశంలో బేకింగ్ క్వీన్‌గా, గొప్ప కేక్ ఆర్టిస్ట్‌గా పిలుస్తారు. కేక్‌లను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా చేసి తినడానికే కాదు చూడటానికి కూడా రుచికరంగా తయారు చేసి అంతర్జాతీయ అవార్డులు పొందుతోందామె. ఈ ఫొటోలు చూడండి. అన్నీ తినే కేకులే. ‘మీరూ ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్ సాధించండి’ అంటోంది ప్రాచీ. ప్రపంచ ప్రఖ్యాత కేక్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎడ్డీ స్పెన్స్. కళాత్మకమైన కేకుల తయారీలో ఆయన ప్రతిభకు అక్కడి ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో గౌరవించింది. ‘నేను లండన్ వెళ్లి ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నాకు కేక్ ఆర్ట్ అంటే అంత పిచ్చి’ అంటుంది ప్రాచీ ధబల్. 36 ఏళ్ల ప్రాచీ గత సంవత్సరం 100 కిలోల కేక్‌ను తయారు చేసింది. ఇది ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ (చర్చ్)కు రెప్లికా. ఆరున్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ చర్చ్ ఆకారపు కేక్‌లో దాదాపు 1500 సున్నితమైన భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ రాయల్ ఐసింగ్ (తెల్ల సొన, చక్కెర పొడుల మిశ్రమం)తో తయారు చేసి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022’లో ఎక్కింది ప్రాచీ. అందుకే ఆమెను ‘బేకింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అంటుంటారు. చిన్నప్పటి నుంచి ప్రాచీ ధబల్ సొంత ఊరు డెహరాడూన్. అక్కడే పుట్టి పెరిగింది. ‘నాకు పదేళ్లున్నప్పుడు వేసవి సెలవుల్లో కేకుల తయారీని మా అమ్మ నాకు కాలక్షేపంగా నేర్పింది. నేను కప్‌కేక్‌లు తయారు చేసేదాన్ని. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి కూడా పెరిగింది. నాకు బొమ్మలు వేయడం కూడా వచ్చు. కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నా పుట్టిన రోజున బయట కేక్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు నేను చదివిన కథల్లోని కోటల్లాంటి, రాకుమార్తెల్లాంటి, ఉద్యానవనాల్లాంటి కేక్‌లు తెప్పించమని మా అమ్మను పోరేదాన్ని. కాని అలాంటి కేకులు ఎవరూ తయారు చేయరు. మార్కెట్లో మామూలు కేకులు ఉండేవి. నాకు అలాంటివి ఎందుకు తయారు చేయకూడదు అనిపించేది’ అంది ప్రాచీ ధబల్. ఉద్యోగం నచ్చలేదు ప్రాచీ కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పూణెలో ఉద్యోగానికి వచ్చి స్థిరపడింది. కాని ఆమెకు ఆ ఉద్యోగం నచ్చలేదు. ‘2012 నాటికి నాకు ఉద్యోగం బోర్ కొట్టింది. అందులో నాకు ఇష్టమైనదేదో లేదు. నాకు కేక్ ఆర్టిస్ట్‌గా మారాలనిపించింది. కాని ఆ రోజుల్లో ఆ కళకు పెద్దగా గిరాకీ లేదు. ఎవరికీ అలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. కళాత్మక కేకులు తయారు చేయాలంటే కావలసిన మెటీరియల్ మన దేశంలో దొరికేది కాదు. అయినా సరే తెగించి విదేశాల నుంచి కావలసిన సామాగ్రి తెప్పించుకుంటూ రంగంలో దిగాను. నేను తయారు చేసేది షాపులో అమ్మే కేకులు కాదు. కస్టమైజ్డ్ కేకులు. అందువల్ల వీటి ఖరీదు కూడా ఎక్కువ. అలాంటి కస్టమర్లు పెరిగే వరకూ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కాని నా ప్రత్యేకమైన కేకులు నలుగురి దృష్టిలో పడ్డాక ఇప్పుడు ఊపిరి సలపడానికి కూడా టైమ్ లేదు’ అని నవ్వుతుంది ప్రాచీ. దేశీయత ప్రాచీ తయారు చేసే కేకులు దేశీయతతో నిండి ఉంటాయి. చీరల మీద డిజైన్లు, ఆర్కిటెక్చర్, సంప్రదాయ చిహ్నాలు అన్నీ ఆమె కేకుల్లో కనిపిస్తాయి. ఇటీవల ఆమె బెనారస్ చీరను, ఆభరణాలను పోలిన కేక్‌ను తయారు చేసింది. ‘కుంకుమ భరిణె’ లా కనిపిస్తున్న ఆ కేక్ ఎన్నో ప్రశంసలు పొందింది. ఆమె తయారు చేసిన నెమలి కేక్‌లో పైకి ఆభరణాలుగా కనిపించేవి కూడా తినదగ్గ మెటీరియల్‌తో తయారు చేసినవే. అయితే ఈ కళను ప్రాచీ తన దగ్గరే దాచుకోవడం లేదు. యువ బేకర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి నేర్పుతోంది. ‘అమ్మాయిలు ముందు తమకు ఇష్టమైన రంగంలో కనీస డిగ్రీ సంపాదించాలి. ఆ తర్వాత ఆ ఇష్టం కోసం కష్టపడాలి. తప్పకుండా విజయం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు’ అంటుంది ప్రాచీ. పాత దారిలో కొత్తగా నడవడమే విజయం అని ప్రాచీ విజయం తెలుపుతోంది. -
జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు
తెలుగు సినిమాలకు, నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటీనటులకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. తాజాగా సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని మరో ఇంటర్నేషనల్ అవార్డు వరించింది. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. దహిణి ది విచ్ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది. (చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు) ఈ చిత్రం ఇది వరకు ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. -
ఇప్పటికే 16 ఇంటర్నేషనల్ అవార్డులు.. రిలీజ్‌కు రెడీ అయిన 'కళలి' చిత్రం
తమిళసినిమా: తమిళసినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి చాలా కాలమైంది. మన నటులు బాలీవుడ్ దాటి హాలీవుడ్‌లోనూ నటించేస్తున్నారు. అయితే అత్యధిక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలు మాత్రం అరుదుగానే వస్తున్నాయి. అలాంటి వాటిలో కళలి చిత్రం ఒకటి. ఇది ఏకంగా 16 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాంటి చిత్రం ఈనెల 23న తమిళ ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది. కాకరకాయ ముట్టై చిత్రంతో బాలనటుడిగా జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్న విఘ్నేష్ కథానాయకుడిగా నటింన చిత్రం కళలి. ఆయనతో నటి ఆరా కథానాయకిగా నటించింది. కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను సెరా కలైకయరసన్ నిర్వహించారు. కేపీ వేలు, ఎస్.జయరామన్, ఎమ్మెస్ రామచంద్రన్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. డీఎం ఉదయ్‌కుమార్ సంగీతాన్ని, షమీర్ చాయాగ్రహణం అందించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. జాతి విభేదాలు గురిం చర్చించినట్లు ఆయన చెప్పారు. దీని వలన ఒక ప్రేమ జంట ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? వారి ప్రేమ గెలిందా? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలను ఎంతో సహజత్వంగా చిత్రీకరింనట్లు చెప్పారు. సమాజానికి కావల్సిన చక్కని సందేశంతో కూడిన కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు సెరా కలైకయరసన్ తెలిపారు. -
21 Grams Pilot Film: 21 గ్రామ్స్‌కు 17 అంతర్జాతీయ అవార్డులు
57 నిమిషాల నిడివి ఉన్న 21 గ్రామ్స్ చిత్రం 17 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నవ దర్శకుడగా యాన్ శశి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇంతకు ముందు పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ఈయన వినూత్న ప్రయత్నం చేసిన ఇందులో కథానాయకుడిగా మోగణేష్ నటించారు. మరో ప్రధాన పాత్రలో ఇటీవల కన్నుమూసిన పూ రాము నటించారు. దీనికి సుందర్ రాజన్, అన్బు డెన్నిస్‌లు ఛాయాగ్రహణం, విజయ్ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ప్రాణం విలువ వెలకట్టలేనిదని, మనిషి ప్రాణాన్ని తీసే హక్కు, అధికారం ఎవరికి లేదనే సందేశాన్ని ఇచ్చే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. పూర్తి నిడివితో చిత్రాన్ని చేయాలన్నదే తన కల అని, అలా ఒక కథను తయారు చేసుకుని ప్రముఖ నిర్మాణ సంస్థలో చిత్రం చేయడానికి సన్నాహాలు జరిగాయని చెప్పారు. అయితే కరోనా కారణంగా ఆ చిత్రం ప్రారంభానికి జాప్యం జరిగిందని తెలిపారు. దీంతో 15 నిమిషాల నిడివితో ఒక పైలట్ చిత్రాన్ని చేయాలని భావించామని, అయితే కథ డెవలప్మెంట్తో 57 నిమిషాల నిడివికి చేరుకుందని అదే ‘21 గ్రామ్స్’చిత్రమని చెప్పారు. చిత్రాన్ని తొలిసారిగా కోల్కత్తా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డులను గెలుచుకుందన్నారు. అలాగే ఠాగూర్ అంతర్జాతీయ దినోత్సవాలు, సింగపూర్ చిత్రోత్సవాలు, టోక్యో, ఇటలీ, రోమ్, అమెరికన్ గోల్డెన్ పిక్చర్స్ చిత్రోత్సవాల్లో ఇప్పటి వరకు 17 అవార్డులను గెలుచుకుందని తెలిపారు. ఒక పూర్తి చిత్రాన్ని చూసిన సంతృప్తిని కలిగించే విధంగా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రాన్ని చూసిన పలువురి నుంచి లభించిన అభినందనలు గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డులు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: (Engineering Student: ఇంజినీరింగ్ మధ్యలో హిజ్రాగా మారి) -
సాక్షి కార్టూనిస్ట్ శంకర్‌కు అంతర్జాతీయ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: పలు జాతీయ, అంతర్జాతీయ కార్టూన్, క్యారికేచర్ పోటీల్లో అనేక బహుమతులు సాధించిన సాక్షి కార్టూనిస్ట్ శంకర్ ఖాతాలో మరో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు చేరాయి. పోర్చుగీస్ ప్రింటింగ్‌ప్రెస్ ప్రతియేటా నిర్వహించే 23వ పోర్టో కార్టూన్ వరల్డ్ ఫెస్టివల్లో శంకర్ వేసిన రెండు చిత్రాలు ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపికయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మార్టిన్ లూథర్‌కింగ్ క్యారికేచర్‌కు గాను మొదటి బహుమతి, ప్రఖ్యాత పియానిస్ట్ మారియా పైర్స్ క్యారికేచర్‌కు ద్వితీయ బహుమతి లభించింది. కార్టూన్, క్యారికేచర్ విభాగంలో ఆస్కార్గా భావించే గ్రాండ్ ప్రిక్స్ వరల్డ్ ప్రెస్ అవార్డును 2014లోనూ శంకర్ సాధించడం గమనార్హం. ఈ పోటీల్లో ఆయనకు మొత్తం 1,300 యూరోల ప్రైజ్‌మనీ లభించనుంది. త్వరలో పోర్టో సిటీలో జరగబోయే బహుమతి ప్రదానోత్సవంలో ఆయన అవార్డును అందుకోనున్నారు. కాగా, అంతర్జాతీయ క్యారికేచర్ పోటీలకు శంకర్ నాలుగుసార్లు జ్యూరీగానూ వ్యవహరించారు. ఇటీవల జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కళాకృతిలో ఆయన గాంధీ చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. ‘ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్’ అధ్యక్షుడిగానూ శంకర్ వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ అభినందనలు పోర్చుగల్ పోర్టో కార్టూన్ వరల్డ్ ఫెస్టివల్లో రెండు అవార్డులు సాధించిన శంకర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. శంకర్ తెలంగాణకు గర్వకారణమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ఇది వాళ్లకు తెలిసేలా షేర్ చేయండి: కేటీఆర్ -
డ్రీమ్ వీవర్ కీప్ మూవింగ్.. డోంట్ క్విట్
శ్రీలక్ష్మి సురేశ్... ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వెబ్ డిజైనర్, సిఈవోగా నిలిచిన అమ్మాయి. కేరళ కోజికోడ్‌లో తను చదువుతున్న స్కూల్ కోసం ప్రెజెంటేషన్.కామ్ అనే వెబ్ సైట్‌ను తయారుచేసి రికార్డు సాధించారు. అప్పుడు శ్రీలక్ష్మి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. ఇందుకుగాను శ్రీలక్ష్మి 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అత్యద్భుతంగా వెబ్ డిజైన్ చేసిందని మేధావుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ వెబ్మాస్టర్స్ సంస్థ శ్రీలక్ష్మికి తమ సంస్థలో సభ్యత్వంతోపాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోల్డ్ వెబ్ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆ అసోషియేషన్‌లో 18 సంవత్సరాల లోపు ఉండి, సభ్యత్వం పొందిన ఏకైక అమ్మాయి తనే. ఎన్నో సత్కారాలు, అవార్డులు అందుకున్న శ్రీలక్ష్మి ఇప్పుడు సొంతంగా వెబ్ ఇడిజైనింగ్ కంపెనీ ప్రారంభించారు. (www. edesign.co.in) ఈ కంపెనీకి సిఈవో. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో సిఈవోగా రికార్డు సాధించారు శ్రీలక్ష్మి. ఇప్పుడు శ్రీలక్ష్మి సైబ్రోసిస్ టెక్నో సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో కలిసి ఆన్లైన్ పిక్సెల్ ట్రేడర్స్ సంస్థను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. శ్రీలక్ష్మి తండ్రి సురేశ్ మీనన్. ఆయన అడ్వొకేట్. తల్లి విజు సురేశ్. వెబ్ డిజైనింగ్ మీద తనకు ఆసక్తి కలగడానికి కారణం.. తన తండ్రి తనను చిన్నతనం నుంచి కంప్యూటర్ మీద పనిచేసుకోనివ్వటమే అంటారు. ‘కంప్యూటర్ నోట్పాడ్ మీద ఇంగ్లీషు అక్షరాలు టైప్ చేస్తూ నేర్చుకున్నాను’ అంటారు శ్రీలక్ష్మి. ఇంకా స్కూల్లో కూడా చేరకముందే మైక్రోసాఫ్ట్ పెయింట్‌లో బొమ్మలు వేయడం ప్రారంభించారు శ్రీలక్ష్మి. ‘కంప్యూటర్ నా ప్రాణ స్నేహితురాలు. నా ఆరు సంవత్సరాల వయసులో ఒక చిన్న కుర్రవాడు తయారు చేసిన వెబ్‌సైట్‌ని నాన్న నాకు చూపిస్తూ, నాకు ఇష్టమైతే నన్ను కూడా చేయమని చెప్పారు. అప్పుడు నేను ఎంఎస్ వర్డ్ ఉపయోగిస్తూ ప్రయత్నించాను, ఆ తరవాత ఎంఎస్ ఫ్రంట్ పేజీలో ప్రయత్నించాను. అలా నా మొదటి వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాను. అది కూడా మా స్కూల్ కోసం www.presentationshss.com పేరున తయారు చేశాను. అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు. ఇప్పుడు నేను వెబ్‌సైట్స్‌ని డ్రీమ్వీవర్ ఉపయోగిస్తూ డెవలప్ చేస్తున్నాను’ అని ఎంతో ఆనందంగా చెబుతారు శ్రీలక్ష్మి. టైనీలోగో (tinylogo) అనే సెర్స్ ఇంజిన్ కూడా తయారు చేశారు శ్రీలక్ష్మి. తనకు లోగోలను సేకరించటమంటే ఇష్టమని, అందుకోసమే ఈ సైట్ ప్రారంభించానని చెబుతారు. అయితే ఇతరుల అనుమతి లేకుండా వారి లోగోలను తీసుకోవటం నేరమని నాన్న చెప్పారు. అందువల్ల వారి దగ్గర నుంచి చట్టబద్ధంగా లోగోలను సేకరిస్తున్నట్లు చెబుతారు శ్రీలక్ష్మి. ఆ సమయంలోనే శ్రీలక్ష్మి ‘సైనల్ రైన్బో’ టెక్నాలజీతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అబిదీన్ (సైబ్రోసిస్ టెక్నో సొల్యూషన్స్) ని కలిసి, లోగోల ఆధారంగా వాటికి సంబంధించిన అంశాలను సెర్చ్ చేయటం గురించి చర్చించారు. ఆ విధంగా లోగో ఆధారంగా సమాచారాన్ని సేకరించేలా వారితో కలిసి సెర్చ్ ఇంజిన్ తయారుచేశారు. ‘‘నా మొదటి వెబ్సైట్ తయారు చేసుకున్నప్పుడు నేను ఎవరో ఎవరికీ తెలియదు. అందువల్ల నాకు అస్సలు టెన్షన్ లేదు. ఇప్పుడు మాత్రం నాకు చాలా టెన్షన్‌గా ఉంటోంది. అందరూ మెచ్చుకునేలా చేయాలనే సంకల్పంతో, ఇప్పుడు ఎక్కువ సమయం వెబ్ డిజైనింగ్ గురించి బాగా చదువుతున్నాను. ఇంకా పిహెచ్‌పి, ఏఎస్పి... లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులంతా మెచ్చుకునేలా కష్టపడుతున్నాను’ అంటూ సంతోషంగా అంటారు శ్రీలక్ష్మిసురేశ్. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటం వల్ల శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు వచ్చింది. చాలామంది నిపుణులతో చర్చించటానికి అవకాశాలు వస్తున్నాయి. ‘‘విదేశీ మార్కెట్ మీద ఆధారపడిన వారి పరిస్థితులు బాలేవు. నేను విదేశీ కంపెనీలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయట్లేదు. చిన్నవి మాత్రమే చేస్తున్నాను. వెబ్సైట్ల అవసరం రోజురోజుకీ బాగా పెరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా వెబ్సైట్లు పెట్టుకుంటున్నారు. నేను ఎక్కువ ఆర్డర్లు తీసుకుని, చక్కగా చేసి ఇస్తున్నాను. అందువల్ల నా కంపెనీ భవిష్యత్తు గురించి నేను బాధపడనక్కర్లేదు’’ అంటారు ఎంతో ధీమాగా శ్రీలక్ష్మి. ప్రస్తుతం www.stateofkerala.in వెబ్సైట్లో కేరళ గురించి సమాచారాన్ని పొందుపరచి, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా రూపొందిస్తున్నాను’’ అంటున్న శ్రీలక్ష్మి చదువుతో పాటు ఈ పనులన్నీ ఎంతో ప్రణాళికతో చేస్తున్నారు. తనకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుందని, అదేవిధంగా అందరికీ చాలా సౌకర్యంగా ఉండే ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించాలని ఉంది. పిల్లలు కూడా పెద్దవాళ్లు చేసినవన్నీ చేయగలరు అంటూ ఎంతో ఉత్సాహంగా చెబుతారు. ‘కీప్ మూవింగ్, డోంట్ క్విట్’ అనేది శ్రీలక్ష్మి నినాదం. -
క్వీన్‌మేరిస్ పాఠశాల కరస్పాండెంట్ మృతి
ప్రొద్దుటూరు కల్చరల్: పట్టణంలోని క్వీన్ మేరిస్ ఐసీఎస్సీ సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ పాలగిరి సుధీకర్ మంగళవారం ఉదయం 7.30 గంటలకు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈయన ప్రొద్దుటూరులో 1984లో ఐసీఎస్సీ సెంట్రల్ సిలబస్‌తో పాఠశాల నెలకొల్పారు. 32 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించారు. విద్యారంగంలో చేసిన సేవలకుగాను 15 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏసియా అడ్మిరబుల్ అచీవర్స్, కోహినూర్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా, ఇండో అమెరికా హౌస్ హూ వంటి అవార్డులతో దేశ, విదేశాలలోని ప్రముఖుల చేత సత్కారం పొందారు. రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్లో సభ్యునిగా వివిధ రంగాలలో సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. ప్రొద్దుటూరు, కడపలో క్వీన్ మేరిస్ పాఠశాలలను స్థాపించారు. గ్రూప్–1 పరీక్షలో ఉత్తీర్ణులై కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా ఉండి, విద్య పట్ల ఆసక్తితో పాఠశాలను ఏర్పాటు చేసి డాక్టరేట్‌ను పొందారు. భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఈయన అంత్యక్రియలు బుధవారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రోటరీ క్లబ్ సభ్యులు సాధు గోపాలకృష్ణ, రచయిత జింకా సుబ్రమణ్యం సంతాపం తెలిపారు. -
తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం
ముషీరాబాద్: కృషి, పట్టుదల, లక్ష్యం ఉంటే జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎస్.సృజన నిరూపించింది. ప్రపంచంలోని పది ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి నేత్ర వైద్యంలో డాక్టరేట్ పట్టా పొందిన సృజన ప్రస్తుతం కెరటోకోనస్పై డాక్టరేట్ అనంతర విశిష్ట పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపక దంపతులైన ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ భారతిల కుమార్తె. ఇప్పటికే అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందిన సృజన నిర్విరామ సామాజిక సేవ-నేత్ర చైతన్య కృషి’కి గుర్తింపుగా ఆస్ట్రేలియాలోని నేత్ర పరిశోధనా కేంద్రం సెరా (సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ ఆస్ట్రేలియా) వారు డాక్టర్ సృజనకు ప్రతిష్టాత్మకమైన సెరా-2016 అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. సెరా ద్విదశాబ్థి ఉత్సవాల సందర్భంగా గురువారం జరిగిన వేడుక వేదికపై ఆమెకు ఈ అరుదైన అవార్డును బహూకరించారు. -
బుక్ ఆర్ట
రబ్బర్ స్టాంప్, ప్రింట్, టెక్ట్స్ బుక్స్ వంటివి ఆమె చేతిలో పడితే కళా రూపాలుగా మారిపోతాయి. ఇండియాలో అంతగా ప్రాచుర్యంలో లేని ఈ సరికొత్త కళల్లో ఆమె అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె పేరు మాలిని గుప్తా. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా.. ఉండేది మాత్రం అమెరికాలో. తన కళారూపాలను ‘ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఆర్ట్’ పేరుతో కళాకృతి గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారామె. ఈ సందర్భంగా మాలిని గుప్తాతో ‘సాక్షి’ చిట్చాట... ఇక్కడి ఏర్పాట్లు.. మన దేశంలో కళలంటే ఆదరణ చాలా తక్కువ. టైం, డబ్బు వృథా అనే ఆలోచన ఉంది. ఇందుకు భిన్నంగా గ్యాలరీలు ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునే వీలు, మీడియాలో కథనాలు రావటం చూస్తుంటే కళాకారులకు సంబంధించినంత వరకు చాలా మార్పులు వచ్చాయని అనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పుడు చాలా మారింది. అప్పట్లో కళాకారుల కోసం గ్యాలరీలు లేవు. మై హోమ్టౌన్.. నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. 2002లో యూఎస్‌కి వెళ్లాను. ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాను. అక్కడికి వెళ్లాక బీఎఫ్ఏ చేశాను. నా సొంత సిటీ అంటే ఎప్పుడు ప్రత్యేకమే. యూఎస్, యూకే దేశాల్లోని ఎన్ని సిటీల్లో ప్రదర్శనలు ఇచ్చినా హోమ్‌టౌన్‌లో ప్రదర్శన ఇవ్వటం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సిటీలో మళ్లీ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను. అమెరికా నుంచి సిటీకి.. అమెరికాలోని నార్త్ పసిఫిక్ ఆర్ట్ కాలేజ్‌లో నేర్చుకున్నా. నా థీసిస్ సబ్జెక్ట్ ఆర్టిస్ట్ పుస్తకం. బైండ్ చేయడం, ప్రింట్ చేయడం అందులో భాగం. ఇక అప్పటి నుంచి పుస్తకం, అక్షరాలతో నా చెలిమి మరింత ఎక్కువైంది. నా థీసిస్‌కి అక్కడ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత నేను ఒరెగన్ ఆర్ట్ కాలేజ్‌లో బుక్ ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. నేనొక కళాకారిణిని. గ్రాఫిక్ డిజైనర్‌ని. నాకు సంబంధించి ఇవన్నీ కలిసింది బుక్ ఆర్ట్. దీంట్లో గ్రాఫిక్ డిజైన్, క్రాఫ్ట్, ఆర్ట్ అన్నీ ఉంటాయి. న్యూయార్క్, జర్మనీలో నిర్వహించిన పోటీల్లో నేను చేసిన పోస్టర్‌కి అంతర్జాతీయ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. కానీ నా థీసిస్‌కి వచ్చిన అవార్డ్ నాకు చాలా స్పెషల్. -
చాలామంది భయపెట్టారు!
‘ఐ.డీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన గీతాంజలీ థాపా... తొలి సినిమాతోనే రెండు అంతర్జాతీయ అవార్డ్లు అందుకున్నారు. సిక్కింలో పుట్టి పెరిగిన గీతాంజలి కోల్‌కొతాలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2007లో ‘మిస్ నార్త్ ఈస్ట్’ కిరీటాన్ని అందుకున్నారు. ఇటీవలే మన దేశం నుంచి ఆస్కార్ అవార్డ్ నామినేషన్‌కు ఎంట్రీగా ఎంపికైన ‘లయర్స్ డైస్’ చిత్రంలో నటనకు జాతీయ అవార్డు అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె చెప్పిన మాటల్లో కొన్ని... * కోల్‌కతాలో చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ చేశాను. నటనలో ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. నటించాలనే కోరిక మాత్రం ఉండేది. దాంతో ముంబయిలో వాలిపోయాను. అదృష్టవశాత్తూ... కొందరు మంచి వ్యక్తులతో నాకు పరిచయం అయింది. వారే నన్ను కాస్టింగ్ డెరైక్టర్లకు పరిచయం చేశారు. అలా సినిమాల్లోకి వచ్చాను. * బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడు, ప్రోత్సాహం మాట అలా ఉంచి ‘‘సిక్కింలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లను చిన్న చూపు చూస్తారు’’ లాంటి మాటలతో చాలామంది భయపెట్టారు. నిరాశపరిచారు. మొదట్లో వాటి గురించి ఆలోచించినా, తరువాత మాత్రం పట్టించుకోలేదు. * అదృష్టవశాత్తూ నేను ఎలాంటి వివక్షను ఇప్పటి వరకు ఎదుర్కోలేదు. ‘‘నువ్వు ఇండియన్లాగా కనిపించడం లేదు’’లాంటి విమర్శలు వినిపించినా నేను వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. * మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. అది మెయిన్‌స్ట్రీమ్ కావచ్చు. ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కావచ్చు. రెండిట్లో దేని ప్రాధాన్యం దానికి ఉంది. మొదటి తరహా సినిమాల్లో నటించినప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు వస్తుంది. రెండో తరహాలో...కాస్త ఆలస్యమైనా గట్టి గుర్తింపే వస్తుంది. పైగా ఎంతోమంది ప్రతిభావంతులతో పని చేయడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. - గీతాంజలీ థాపా, హీరోయిన్ -
లెర్నింగ్ బై డూయింగ్: ట్రిపుల్ ఐటీ
ముందుగానే నిర్దేశించిన సిలబస్.. దాని ప్రకారం.. మూడున్నరేళ్లపాటు తరగతి గదిలో బోధన, అధ్యయనం.. చివరి సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్.. ప్రస్తుతం మన బీటెక్ కోర్సుల తీరు తెన్నులివి. కానీ ఇందుకు భిన్నంగా నిరంతరం లేబొరేటరీలు, రీసెర్చ్ విభాగాల్లో భాగస్వాములను చేస్తూ బ్యాచిలర్ డిగ్రీ తొలినాళ్ల నుంచే పుస్తకాల్లో చదువుకున్న అంశాలపై ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పిస్తూ... లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యార్థులకు నైపుణ్యాలను అందిస్తున్న ఇన్స్టిట్యూట్.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-హైదరాబాద్ (ట్రిపుల్ ఐటీ -హైదరాబాద్). మనసిటీలో ఏర్పాటై.. అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్‌పై ఇన్స్టిట్యూట్ వాచ్.. దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో నాన్-ప్రాఫిట్ విధానంలో ప్రారంభమైన ట్రిపుల్ ఐటీ - హైదరాబాద్.. మొదటి నుంచీ ‘రీసెర్చ్ యూనివర్సిటీ’ లక్ష్యంతో బోధన సాగిస్తోంది. నిరంతరం ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతూ పదహారేళ్ల ఇన్స్టిట్యూట్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. అకడెమిక్స్‌లో వినూత్న విధానం ట్రిపుల్ ఐటీ.. అకడెమిక్ బోధనలోనూ వినూత్న విధానాలకు రూపకల్పన చేసింది. స్ట్రక్చరల్ లెర్నింగ్‌కు బదులు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు అందిస్తోంది. విద్యార్థులు గ్రాడ్యుయేట్ స్థాయిలో తమకు నచ్చిన కోర్సులను, ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకునే విధంగా కరిక్యులం అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థులు తమకు నిజంగా ఆసక్తి ఉన్న విభాగాలను గుర్తించి అందులో నిష్ణాతులుగా రాణిస్తున్నారు. అందుకే ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్కాలర్‌షిప్స్‌కు ఎంపికయ్యారు. బీటెక్ నుంచే పరిశోధనలో పాల్పంచుకునేలా ప్రస్తుతం ఈ ఇన్స్టిట్యూట్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ బ్రాంచ్‌ల్లో కేవలం కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లే కాకుండా హ్యుమానిటీస్ అంశాలను కూడా బోధిస్తూ విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా చేస్తోంది. వీటితోపాటు ఇన్స్టిట్యూట్ చేపడుతున్న రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌లో బీటెక్ స్థాయిలోనే ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఎందరో విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలోనే పలు ప్రముఖ జర్నల్స్‌లో, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పేపర్స్ ప్రచురించారు. బీటెక్ కోర్సులే కాకుండా ఎంటెక్, ఎంఎస్ బై రీసెర్చ్, పీహెచ్డీ, ఎంఫిల్ (కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్) కోర్సులను అందిస్తోంది. బీటెక్ అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ పేరుతో అయిదేళ్ల వ్యవధిలో డ్యూయల్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఈ డ్యూయల్ డిగ్రీ ప్రస్తుతం కోర్ ఏరియాకు సంబంధించి మూడు విభాగాల్లో (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; బిల్డింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) అందుబాటులో ఉంది. అంతేకాకుండా విద్యార్థులు బీటెక్‌లో ఒక కోర్సు; ఎంఎస్బై రీసెర్చ్‌లో తమ ఆసక్తి మేరకు మరో కోర్సును ఎంచుకునే విధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్‌కు అనుసంధానంగా ఎంఎస్ బై రీసెర్చ్‌లో కంప్యూటేషనల్ నేచురల్ సైన్స్; కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్; ఎక్సాట్ హ్యుమానిటీస్ కోర్సులను ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో అందిస్తోంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డ్లు ఇన్స్టిట్యూట్ బోధన, రీసెర్చ్ పరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందడంతోపాటు ఎన్నో అవార్డ్లు ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు లభించాయి. నాసా నేతృత్వంలోని అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ నిర్వహించే అంతర్జాతీయ పోటీలు.. కాన్‌శాట్ అవార్డులు, గూగుల్ ఇండియా ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ అవార్డులు; గూగుల్ - ఇండియా స్కాలర్షిప్ అవార్డ్లు వంటివి ఇందుకు కొన్ని నిదర్శనాలు. ప్లేస్‌మెంట్స్‌లోనూ రికార్డ్ ప్లేస్‌మెంట్స్ పరంగానూ ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ రికార్డులు నమోదు చేస్తోంది. ఆయా సర్వే సంస్థలు నిర్వహించే ర్యాంకింగ్స్‌లో ప్లేస్‌మెంట్స్ పరంగా గత పదేళ్లుగా టాప్-10లోనే ఉంటోంది. వంద శాతం ప్లేస్మెంట్ రికార్డ్‌తో సగటున రూ.9 లక్షల వార్షిక వేతనం ఖాయంగా లభిస్తోంది. ఇన్స్టిట్యూట్ ప్రాధాన్యాన్ని గుర్తించి పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఒక సంస్థ 2013లో రూ.17 లక్షల వార్షిక వేతనం అందించింది. మౌలిక సదుపాయాలు మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాల పరంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన కంప్యూటర్స్, లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్ (పీసీ టు స్టూడెంట్ రేషియో- 1:2) అందుబాటులో ఉంది. అదే విధంగా రీసెర్చ్ జర్నల్స్, సీడీరామ్స్, ఆన్లైన్ రిసోర్సెస్‌తో వేల సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలు లైబ్రరీలో లభిస్తాయి. డిజిటల్ లైబ్రరీలోనూ అనేక పుస్తకాలు, మరెన్నో పూర్వ లెక్చర్స్‌ను పరిశీలించే అవకాశం అందుబాటులో ఉంది. ప్రవేశాలు ఇలా.. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ మార్కుల ఆధా రంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. పీజీ కోర్సులకు ఇన్స్టిట్యూట్ సొంతంగా నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నిరంతరం లేబొరేటరీలు, రీసెర్చ్ సెంటర్స్‌లో తలమునకలైన విద్యార్థులకు మానసికోల్లాసం కల్పించే దిశగా ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కూడా ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది. ప్లే గ్రౌండ్, జిమ్నాజియం వంటి సదుపాయాలు కల్పించడంతోపాటు, పలు సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.iiit.ac.in ముఖ్య ఉద్దేశం.. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కీలకంగా వ్యవహరించడం. అందుకే మొదటి నుంచీ రీసెర్చ్ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ విభాగంలో ఎనిమిది; డొమైన్ ఏరియాలో పదకొండు; డెవలప్మెంట్ విభాగంలో మూడు రీసెర్చ్ సెంటర్లను నిర్వహిస్తోంది. వీటిలో నిరంతరం ఇండస్ట్రీ స్పాన్సర్డ్, ఇన్స్టిట్యూట్ సొంత రీసెర్చ్ కార్యకలాపాలు సాగుతూనే ఉంటాయి. ఈ సెంటర్లల్లో రీసెర్చ్ కార్యకలాపాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇన్స్టిట్యూట్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యుల నేతృత్వంలో దాదాపు పదిహేను వందల రీసెర్చ్ పబ్లికేషన్స్; పదుల సంఖ్యలో పుస్తకాలు ప్రచురితమవడమే ఇందుకు నిదర్శనం. రీసెర్చ్‌తోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఔత్సాహికుల కోసం ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్వహించడం ఇన్స్టిట్యూట్ మరో ప్రత్యేకత. ఏ టు జెడ్ ఇన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ విభాగాల్లో విద్యార్థులకు ఏ టు జెడ్ నాలెడ్జ్ అందించడమే లక్ష్యంగా ట్రిపుల్ ఐటీ చర్యలు చేపడుతోంది. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పొందేలా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, ఆర్ అండ్ డీ అప్రోచ్‌తో బోధన సాగిస్తున్నాం. అందుకే ఇక్కడి విద్యార్థులు కేవలం డొమైన్ ఏరియాకే పరిమితం కాకుండా పరిశ్రమలో అడుగు పెట్టాక అన్ని కోణాల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. ఇన్స్టిట్యూట్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నిర్వహించే పలు సంస్థల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ కూడా ఇదే. పూర్తి రెసిడెన్షియల్ విధానంలో ఉండే ప్రోగ్రామ్‌ల విద్యార్థులు హాస్టల్ నివసించడం తప్పనిసరి. ఇది కూడా ఒక విధంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే అంశమే. సహచరులతో గ్రూప్-డిస్కషన్స్‌కు, తద్వారా కొత్త అంశాల అన్వేషణకు మార్గం లభిస్తుంది. - ప్రొఫెసర్ పి.జె. నారాయణన్, డెరైక్టర్, ట్రిపుల్ ఐటీ - హైదరాబాద్