
తెలుగు సినిమాలకు, నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటీనటులకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. తాజాగా సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని మరో ఇంటర్నేషనల్ అవార్డు వరించింది.
నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. దహిణి ది విచ్ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది.
(చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు)
ఈ చిత్రం ఇది వరకు ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment