
అర్జున్, జేడీ చక్రవర్తి లీడ్ రోల్స్‌లో నటించిన కన్నడ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ ‘ఒప్పంద: కాంట్రాక్ట్’. ఈ చిత్రంలో రాధికా కుమార స్వామి, సోనీ చరిష్ఠ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఎస్ సమీర్ దర్శకత్వంలో డీఎస్ రెడ్డి సమర్పణలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో రేపు విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సమీర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్, చక్రవర్తిగార్లు పోటాపోటీగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌గారు, ఆమిర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా నటించారు. మా సినిమాని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment