తమిళసినిమా: తమిళసినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి చాలా కాలమైంది. మన నటులు బాలీవుడ్ దాటి హాలీవుడ్‌లోనూ నటించేస్తున్నారు. అయితే అత్యధిక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలు మాత్రం అరుదుగానే వస్తున్నాయి. అలాంటి వాటిలో కళలి చిత్రం ఒకటి. ఇది ఏకంగా 16 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాంటి చిత్రం ఈనెల 23న తమిళ ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది.
కాకరకాయ ముట్టై చిత్రంతో బాలనటుడిగా జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్న విఘ్నేష్ కథానాయకుడిగా నటింన చిత్రం కళలి. ఆయనతో నటి ఆరా కథానాయకిగా నటించింది. కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను సెరా కలైకయరసన్ నిర్వహించారు. కేపీ వేలు, ఎస్.జయరామన్, ఎమ్మెస్ రామచంద్రన్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. డీఎం ఉదయ్‌కుమార్ సంగీతాన్ని, షమీర్ చాయాగ్రహణం అందించారు.
ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. జాతి విభేదాలు గురిం చర్చించినట్లు ఆయన చెప్పారు. దీని వలన ఒక ప్రేమ జంట ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? వారి ప్రేమ గెలిందా? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలను ఎంతో సహజత్వంగా చిత్రీకరింనట్లు చెప్పారు. సమాజానికి కావల్సిన చక్కని సందేశంతో కూడిన కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు సెరా కలైకయరసన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment