ఓటీటీలోకి సమంత 'శాకుంతలం'.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడంటే.. | Samantha Shaakuntalam Movie Gets Ott Release  | Sakshi
Sakshi News home page

Samantha : ఓటీటీలోకి సమంత 'శాకుంతలం'.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడంటే..

May 5 2023 9:22 PM | Updated on May 5 2023 9:25 PM

Samantha Shaakuntalam Movie Gets Ott Release  - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. సుమారు 60‍కోట్లతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయింది. చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై

విడుదలైన తొలిరోజు నుంచే నెగిటివ్‌ టాక్‌ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో శకుంతలగా సమంత నటించగా, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించాడు. ఈ సినిమాతోనే అల్లు అర్హ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇచ్చింది.

సినిమాకు ముందు భారీ హైప్‌ క్రియేట్‌ అయినా క‌థ‌, గ్రాఫిక్స్‌ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈనెల 12న శాకుంతలం సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్‌లో సినిమాను మిస్‌ అయినవాళ్లు ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement