సమంత ప్రధానపాత్రలో నటించిన సినిమా శాకుంతలం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈసినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలం కోసం సుమారు 14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వినియోగించినట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు.
దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకు నిజమైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలనే వినియోగించినట్లు గుణశేఖర్ వెల్లడించారు. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో శకుంతల, దుష్యుంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్ లోని వసుంధర జ్యుయెలరీస్ లో ఆవిష్కరించారు.
ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో వసుంధర జ్యుయెలరీస్ శాకుంతలం కోసం సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి ఆభరణాలను తయారుచేసింది. పూర్తిగా చేతితో తయారు చేసిన ఆభరణాలు... తన పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయని గుణశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.
శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేసినట్లు తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేశామని, మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు గుణశేఖర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment