Samantha's much-awaited 'Shaakuntalam' release date gets postponed - Sakshi
Sakshi News home page

Samantha : సమంత మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'శాకుంతలం' వాయిదా పడనుందా?

Feb 2 2023 3:16 PM | Updated on Feb 2 2023 3:33 PM

Samantha Much Awaited Shaakuntalam Release To Be Postponed - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఈనెల 17న విడుదల కాబోతుంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్,అనన్య నాగల్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అల్లు అర్హ ఈ చిత్రంతో డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్‌ మొదలు పెట్టనున్నారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శాకుంతలం సినిమాను వాయిదా వేసే  అవకాశం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement