Samantha's Shaakuntalam Movie: All Shows Stopped At Prasad Imax Due To This Reason - Sakshi
Sakshi News home page

Shaakuntalam Movie: 'శాకుంతలం' మూవీకి తొలిరోజే భారీ షాక్‌.. షోలు రద్దు, కారణమిదే!

Published Fri, Apr 14 2023 11:24 AM | Last Updated on Fri, Apr 14 2023 11:38 AM

Samantha Shaakuntalam Movie Shows Stopped At Prasad Imax Due To This Reason - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్‌ రోజే ఊహించని షాక్‌ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్‌ 14)న డాక్టర్‌ బీఆర్‌ అబేద్కర్‌ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా  బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది.

హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్‌ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది.  

తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు  సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్‌ బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్‌ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement