imax theatre
-
IMAX వద్ద కల్కి సందడి
-
ప్రభాస్ ‘కల్కి’ మూవీ..ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
'శాకుంతలం' సినిమాకు ఊహించని షాక్, తొలిరోజే ఇలా జరిగిందేంటి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజే ఊహించని షాక్ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్ 14)న డాక్టర్ బీఆర్ అబేద్కర్ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. An important update to our beloved fans & moviegoers in Hyderabad : Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow! 🎟️… pic.twitter.com/TTjdOSloDT — Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023 -
'ఆర్ఆర్ఆర్' దక్కిన అరుదైన గౌరవం.. ఆ దేశంలో విడుదల
RRR Movie Will Showing In London Biggest Imax Screen: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్‌ను భారీగానే ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా బ్రిటన్‌లో సుమారు వెయ్యి థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన 'ఒడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్'లోనూ విడుదల కానుంది. అయితే లండన్‌లో ఇదే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్. లండన్ వాటర్లూలో ఈ ఐమ్యాక్స్‌ను నిర్మించారు. థియేటర్ పరిసరాల్లో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ థియేటర్లో సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ హాలీవుడ్ పెద్ద చిత్రాలైన 'బ్యాట్ మ్యాన్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి సినిమాలను ప్రదర్శించారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడంతో ఈ గౌరవం దక్కించున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు రూ. 400 కోట్లతో తెరకెక్కింది. -
ఆ ఆనందం కోసమే..
చిట్టి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందడిగా సాగుతోంది. ప్రధాన వేదిక ప్రసాద్ ఐమ్యాక్స్‌లో చిన్నారుల సంబరం అంబరాన్నంటుతోంది. సోమవారం ప్రదర్శితమైన పలు చిత్రాలు అలరించాయి.నగరంలోని వివిధథియేటర్లలో ప్రదర్శితమవుతున్న చిత్రాలు చూసేందుకుచిన్నారులు తరలి వస్తున్నారు. అదృష్టం.. మేం రాజస్థాన్ బాల ఆశ్రమం నుంచి వచ్చాం. ఈ ఫెస్ట్‌కు రావడం ఇది మూడోసారి. మా ఆశ్రమంలోని పిల్లలు... కులమత భేదాలను వీడి, అందరూ సమైక్యంగా ఉండాలని సందేశాత్మక నాటకం చేశారు. ఇలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో పార్టీసిపేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – కన్నయ్యలాల్, జైపూర్ ఓ గొప్ప మూవీ తీస్తా.. ప్రతిసారి చిల్డ్రన్స్ ఫెస్టివల్‌కు హాజరవుతాను. అన్ని సినిమాలూ చూస్తాను. అయితే ఈసారి రెండు రోజులు మిస్ అయినందుకు బాధగా ఉంది. వచ్చే ఏడాది పిల్లలతో కలిసి దేశభక్తితో కూడిన ఓ గొప్ప సినిమా తీయాలనుకుంటున్నాను. నేను తెరకెక్కించిన ‘రక్తం‘, ‘నాగలి‘ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – సునీతాకృష్ణన్,ప్రజ్వల ఫౌండేషన్ ఫౌండర్ అవార్డు కొట్టేస్తా.. నేను ముంబై నుంచి వచ్చాను. నేను తీసిన ‘హాఫ్–టికెట్’ మూవీ ఇక్కడ ప్రదర్శితమైంది. ఈ మూవీ ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుంది. పిల్లల చిన్ననాటి కోరికలను పెద్దవాళ్లు ప్రోత్సహిస్తే వారెన్నో సాధిస్తారనేదే ఈ చిత్ర సారాంశం. చిత్రోత్సవంలో నా సినిమాకు అవార్డు వస్తుందనే నమ్మకం నాకుంది. – సమిత్ కక్కర్, డైరెక్టర్ ఇదే ఫస్ట్‌టైమ్ నేను గోవా నుంచి వచ్చాను. సామాజిక అంశాలపై షార్ట్‌ఫిల్మŠస్ తీస్తుంటాను. ఈ ఫెస్టివల్‌కి రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ స్క్రీన్ అయ్యే ప్రతి చిత్రాన్ని చూస్తూ, అందులోని మంచిచెడులను గ్రహిస్తున్నాను. ప్రస్తుత జనరేషన్‌కు ఇవి ఎంత వరకు సింక్ అవుతాయో? రాసుకుంటున్నాను. – కబీర్నాయక్, గోవా ‘పిల్లలకు నచ్చే సినిమా తీయాలనుకున్నాను. ‘అప్పూ’ సినిమాలో జలపాతాలు, జంతువులు, సాహస సన్నివేశాలు థియేటర్లో చూసినప్పుడు పిల్లలు ఎంతో అబ్బురపడ్డారు. వారిలో ఆ ఆనందాన్ని నింపాలనే ఈ చిత్రం రూపొందించాన’ని అన్నారు డైరెక్టర్ మోహన్. చిత్ర యూనిట్ సోమవారం మీడియాతో అనుభవాలు పంచుకుంది. ‘నాకు ఇంతకముందు ఎలాంటి అనుభవం లేదు. అడవిలో 30 రోజులు షూటింగ్ చేసినా.. అదో పిక్నిక్లా సాగింద’ని ఆనందం వ్యక్తం చేశాడు హీరో శ్రీవంత్. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల పండగను నిర్వహించడంపై నటుడు లోహిత్ హర్షం వ్యక్తం చేశారు. -
ఒక్కటైన స్టార్ వార్స్
-
ఇంట్లోనే ఐమాక్స్ థియేటర్
ఐమాక్స్ థియేటర్లో తెర సాధారణ థియేటర్లో కన్నా పెద్దగా ఉంటుంది. ఐమాక్స్ తెరపై సినిమా చూడడం వల్ల ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు.. ఇక్కడ ప్రదర్శించే చిత్రాలను ఐమాక్స్ ఫార్మాట్లోనే రూపొందించాలి. సాధారణ చిత్రాలను ఈ తెరమీద ప్రదర్శించడం కుదరదు. గత ఏడాది డిసెంబర్ వరకు దాదాపు 62 దేశాల్లో 934కు పైగా ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయని ఓ అంచనా. అయితే ఇప్పటివరకు వాణిజ్య పరంగా మాత్రమే వినియోగిస్తున్న ఐమాక్స్ థియేటర్స్‌ను ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకప్పుడు 3డీ చిత్రాలు చూడాలంటే థియేటర్‌కే వెళ్లాల్సి వచ్చేది. కానీ పెరిగిన సాంకేతికత కారణంగా ఇప్పుడు 3డీ సినిమాలు, గేమ్స్ టీవీల్లోనూ వీక్షించే అవకాశం ఉంది. ఈ మార్పును ఎవరూ ఊహించి ఉండరు. ఇదే కోవలో ఇప్పుడు ఐమాక్స్ పరిజ్ఞానం కూడా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ వినియోగానికి అనువుగా ఐమాక్స్ సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని, ఇళ్లల్లోనే ఈ తరహా థియేటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని 2013లోనే ఐమాక్స్ కార్పొరేషన్ ప్రకటించింది. అనంతరం టీసీఎల్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టిన ఐమాక్స్ సంస్థ ఇటీవల తొలి ప్రైవేట్ ఐమాక్స్ తెరని రూపొందించింది. దీని పేరు ‘ప్యాలైస్’. చైనాలో తొలిసారిగా: ఐమాక్స్ కార్పొరేషన్, టీసీఎల్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన హోం స్టైల్ ఐమాక్స్ థియేటర్ ‘ప్యాలైస్’ను చైనాలోని షాంఘైలో ఆవిష్కరించారు. అసలైన ఐమాక్స్ థియేటర్ అనుభూతి కలిగేలా దీన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక సౌండ్ సిస్టం, ఫ్లోరింగ్, లైటింగ్, వాల్ ప్రొడక్షన్, సీటింగ్లను ఇందులో ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు సందర్శకులను తయారీదారులు అనుమతిస్తున్నప్పటికీ కొందరికి మాత్రమే ఈ థియేటర్లో ప్రవేశం కల్పిస్తున్నారు. దాదాపు రెండేళ్లపాటు దీని నిర్మాణంపై పరిశోధనలు సాగాయి. ఇప్పుడు ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ఐమాక్స్ థియేటర్‌ను త్వరలో అందరికీ అందుబాటులోకి తెచ్చేలా, ఇళ్లల్లోనే ఐమాక్స్ అనుభూతి కలిగేలా చేస్తామని తయారీదారులు తెలిపారు. అయితే ఈ థియేటర్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు వెల్లడించలేదు.