RRR Movie Will Showing In London Biggest Imax Screen: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్‌ను భారీగానే ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా బ్రిటన్‌లో సుమారు వెయ్యి థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన 'ఒడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్'లోనూ విడుదల కానుంది.
అయితే లండన్‌లో ఇదే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్. లండన్ వాటర్లూలో ఈ ఐమ్యాక్స్‌ను నిర్మించారు. థియేటర్ పరిసరాల్లో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ థియేటర్లో సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ హాలీవుడ్ పెద్ద చిత్రాలైన 'బ్యాట్ మ్యాన్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి సినిమాలను ప్రదర్శించారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడంతో ఈ గౌరవం దక్కించున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు రూ. 400 కోట్లతో తెరకెక్కింది.
RRR Movie: 'ఆర్ఆర్ఆర్' దక్కిన అరుదైన గౌరవం.. ఆ దేశంలో విడుదల
Published Fri, Mar 4 2022 10:01 PM | Last Updated on Sat, Mar 5 2022 8:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment