RRR Movie: Latest Photo Of NTR And Ram Charan Released By Makers - Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్​ఆర్​ఆర్' ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​.. రోలింగ్​ లేనప్పుడు స్క్రోలింగ్​

Published Tue, Mar 1 2022 5:18 PM | Last Updated on Tue, Mar 1 2022 5:35 PM

RRR Movie Latest Photo NTR Ram Charan Released By Makers - Sakshi

RRR Movie Latest Photo NTR Ram Charan Released By Makers: ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ల భారీ మల్టీ స్టారర్​ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్​ అవేయిటెడ్ చిత్రం వరల్డ్​ వైడ్​గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్​ ప్రకటించారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమా ప్రమోషన్స్​ పెంచేసింది జక్కన్న టీం. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా ఆర్​ఆర్​ఆర్​ అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చింది. 

సినిమా షూటింగ్​ లేనప్పుడు రామ్​-భీమ్​లు ఇద్దరూ ఎలా ఉంటారనేది చెబుతూ పోస్టర్​ విడుదల చేసింది. ఈ పోస్టర్​లో పచ్చటి గడ్డిపై ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ ఇద్దరూ మ్యాట్​లు వేసుకుని పడుకుని ఉన్నారు. అంతేకాకుండా వారు తమ మొబైల్స్​ చేతిలో పట్టుకొని ఏదో స్క్రోలింగ్​ చేస్తూ దర్శనిమిచ్చారు. ఈ పోస్టర్​కు 'కెమెరా రోలింగ్​లో లేనప్పుడు స్క్రోలింగ్'​ అని క్యాప్షన్​ ఇచ్చారు. అయితే సినిమాల్లో నవరసాలు పండించే ఈ హీరోలు షూటింగ్​ లేనప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ వైరల్​ కాగా ఫ్యాన్స్​ వారి హీరోలను చూస్తూ మురిసిపోతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement