RRR Movie New Poster With Ram Charan And Jr NTR, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్​ఆర్​ఆర్​ నుంచి సూపర్​ అప్​డేట్​.. మురిసిపోతున్న ఫ్యాన్స్​

Published Fri, Feb 4 2022 2:22 PM | Last Updated on Fri, Feb 4 2022 4:02 PM

RRR Movie Racing Towards New Poster Goes Viral - Sakshi

RRR Movie Racing Towards New Poster Goes Viral: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ కాంబోలో భారీ మల్టీ స్టారర్​గా వస్తున్న చిత్రం చిత్రం 'రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్‌)'. అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అనేక వాయిదాల తర్వాత ఇదే ఫైనల్ రిలీజ్​ డేట్​ అంటూ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్​. అయితే వాయిదాలతో అభిమానులు, ప్రేక్షకులను నిరాశ పరిచిన జక్కన్న టీమ్​, పోస్టర్స్​, మేకింగ్​ వీడియోస్​, సాంగ్స్​, ట్రైలర్స్​తో ఉత్సాహపరిచింది. 

ఫిబ్రవరి 3న ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఈ పోస్టర్​లో గుఱ్ఱపు స్వారీ చేస్తూ రామరాజు, బుల్లెట్​పై కొమురం భీమ్​ ఆకట్టుకోనున్నారు. అలాగే 'ఇంకో 50 రోజుల్లో ఈ చిత్రం రానుందని' క్యాప్షన్​ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. పోస్టర్​లో ఎన్టీఆర్​, రామ్​ చరణ్ ఫ్యాన్స్​ వారిని చూసి మురిసిపోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్​ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement