చిట్టి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందడిగా సాగుతోంది. ప్రధాన వేదిక ప్రసాద్ ఐమ్యాక్స్‌లో చిన్నారుల సంబరం అంబరాన్నంటుతోంది. సోమవారం ప్రదర్శితమైన పలు చిత్రాలు అలరించాయి.నగరంలోని వివిధథియేటర్లలో ప్రదర్శితమవుతున్న చిత్రాలు చూసేందుకుచిన్నారులు తరలి వస్తున్నారు.
అదృష్టం..
మేం రాజస్థాన్ బాల ఆశ్రమం నుంచి వచ్చాం. ఈ ఫెస్ట్‌కు రావడం ఇది మూడోసారి. మా ఆశ్రమంలోని పిల్లలు... కులమత భేదాలను వీడి, అందరూ సమైక్యంగా ఉండాలని సందేశాత్మక నాటకం చేశారు. ఇలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో పార్టీసిపేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – కన్నయ్యలాల్, జైపూర్
ఓ గొప్ప మూవీ తీస్తా..
ప్రతిసారి చిల్డ్రన్స్ ఫెస్టివల్‌కు హాజరవుతాను. అన్ని సినిమాలూ చూస్తాను. అయితే ఈసారి రెండు రోజులు మిస్ అయినందుకు బాధగా ఉంది. వచ్చే ఏడాది పిల్లలతో కలిసి దేశభక్తితో కూడిన ఓ గొప్ప సినిమా తీయాలనుకుంటున్నాను. నేను తెరకెక్కించిన ‘రక్తం‘, ‘నాగలి‘ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – సునీతాకృష్ణన్,ప్రజ్వల ఫౌండేషన్ ఫౌండర్
అవార్డు కొట్టేస్తా..
నేను ముంబై నుంచి వచ్చాను. నేను తీసిన ‘హాఫ్–టికెట్’ మూవీ ఇక్కడ ప్రదర్శితమైంది. ఈ మూవీ ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుంది. పిల్లల చిన్ననాటి కోరికలను పెద్దవాళ్లు ప్రోత్సహిస్తే వారెన్నో సాధిస్తారనేదే ఈ చిత్ర సారాంశం. చిత్రోత్సవంలో నా సినిమాకు అవార్డు వస్తుందనే నమ్మకం నాకుంది. – సమిత్ కక్కర్, డైరెక్టర్
ఇదే ఫస్ట్‌టైమ్
నేను గోవా నుంచి వచ్చాను. సామాజిక అంశాలపై షార్ట్‌ఫిల్మŠస్ తీస్తుంటాను. ఈ ఫెస్టివల్‌కి రావడం ఇదే మొదటిసారి. ఇక్కడ స్క్రీన్ అయ్యే ప్రతి చిత్రాన్ని చూస్తూ, అందులోని మంచిచెడులను గ్రహిస్తున్నాను. ప్రస్తుత జనరేషన్‌కు ఇవి ఎంత వరకు సింక్ అవుతాయో? రాసుకుంటున్నాను. – కబీర్‌నాయక్, గోవా
‘పిల్లలకు నచ్చే సినిమా తీయాలనుకున్నాను. ‘అప్పూ’ సినిమాలో జలపాతాలు, జంతువులు, సాహస సన్నివేశాలు థియేటర్‌లో చూసినప్పుడు పిల్లలు ఎంతో అబ్బురపడ్డారు. వారిలో ఆ ఆనందాన్ని నింపాలనే ఈ చిత్రం రూపొందించాన’ని అన్నారు డైరెక్టర్ మోహన్. చిత్ర యూనిట్ సోమవారం మీడియాతో అనుభవాలు పంచుకుంది. ‘నాకు ఇంతకముందు ఎలాంటి అనుభవం లేదు. అడవిలో 30 రోజులు షూటింగ్ చేసినా.. అదో పిక్నిక్‌లా సాగింద’ని ఆనందం వ్యక్తం చేశాడు హీరో శ్రీవంత్. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల పండగను నిర్వహించడంపై నటుడు లోహిత్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment