guna sekhar
-
'శాకుంతలం' సినిమాకు ఊహించని షాక్, తొలిరోజే ఇలా జరిగిందేంటి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజే ఊహించని షాక్ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్ 14)న డాక్టర్ బీఆర్ అబేద్కర్ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. An important update to our beloved fans & moviegoers in Hyderabad : Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow! 🎟️… pic.twitter.com/TTjdOSloDT — Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023 -
‘శాకుంతలం’పై సమంత రివ్యూ
సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని తాజాగా నిర్మాతలు 'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత వీక్షించింది. అనంతరం ఇన్‌స్టా వేదికగా ‘శాకుంతలం’పై రివ్యూ ఇచ్చింది. ‘ఫైనల్లీ... ఈ రోజు 'శాకుంతలం' సినిమా చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శాకుంతలం కథకు గుణశేఖర్‌గారు ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిన్న పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన దిల్ రాజు, నీలిమా గుణలకు థాంక్స్'అని సమంత రాసుకొచ్చింది. శాకుంతలం రివ్యూ చదివిన సమంత ఫ్యాన్స్...శాకుంతలంతో సమంత మరో హిట్ అందుకోనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'శాకుంతలం' వాయిదా?
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 17న విడుదల కాబోతుంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్,అనన్య నాగల్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అర్హ ఈ చిత్రంతో డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శాకుంతలం సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్
గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓవైపు గ్రాఫిక్స్, మరోవైపు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సులతో ట్రైలర్ అదిరిపోయింది. శాకుంతలగా సమంత మేకోవర్, మణిశర్మ నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ , దుర్వాస మహర్షి పాత్రలో మంచు మోహన్ బాబు, భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటిస్తోంది. (చదవండి: ఓపిక లేకపోయినా వచ్చాను.. సమంత ఎమోషనల్) తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సమంత అద్భుతంగా చేశావు. నాన్న దుర్వాస మహర్షి పాత్రలో నిన్ను చూడడం మంత్రముగ్ధులను చేసింది. అర్హ పాప భరతుడు పాత్రలో బాగా నటించావు’అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. . @Samanthaprabhu2, you nailed it with grace in #Shaakuntalam. 🙌🏻🤗 Nanna watching you as Durvasa Maharshi, has left me spellbound. 😍😍 Last and the cutest #Arha papa as #Bharathudu is a spectacle to watch out for!! ♥️https://t.co/iED4KfGNEm — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 9, 2023 -
పెళ్లికూతురిలా ముస్తాబైన గుణశేఖర్ కూతురు.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్మ్యాన్ను నీలిమ వివాహం చేసుకోనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. కాగా నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. -
దేవకన్యలా సమంత.. శాకుంతలం ఫస్ట్‌లుక్ వచ్చేసింది
Samantha First Look In Shakunthalam Is Out: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సమంత ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సమంత దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. చదవండి: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను : సమంత Presenting .. Nature’s beloved.. the Ethereal and Demure.. “Shakuntala” from #Shaakuntalam 🤍 #ShaakuntalamFirstLook@Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/q4fCjyfnth — Samantha (@Samanthaprabhu2) February 21, 2022 -
‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్
కమర్షియల్, పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు గుణశేఖర్. భారీ సెట్లు, భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ డైరెక్టర్ ప్రస్తుతం ‘హిరణ్యకశ్యప’ టైటిల్‌తో పౌరాణిక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ‘హిర్యణ్యకశ్యప’ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది. (ఆగస్టులోనే రానా పెళ్లి) సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘హిరణ్యకశ్యప’ చిత్రంలో రానా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అనుష్క ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఆ తర్వాత ‘బాహుబలి’ని మించిన రేంజ్లో ఓ చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం అటకెక్కిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని ప్రకటించడంతో ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న అసత్య వార్తలకు చిత్ర బృందం పుల్‌స్టాప్ పెట్టింది. ఇక ఇది భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ ఈ సినిమాను హిరణ్యకశ్యపుడి కోణంలో గుణశేఖర్ తెరకెక్కించబోతున్నారు. -
అఫీషియల్ : రానా ‘హిరణ్యకశ్యప’
రానా దగ్గుబాటి మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 60 ఏళ్ల తరువాత భక్త ప్రహ్లాద, హిరణ్యకశ్యపుల కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తలు చాలా కాలంగా వినబడుతున్నా.. చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగాచిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారాన్ని తన ట్విటర్పేజ్లో పోస్ట్ చేశారు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాలో రానా టైటిల్ రోల్లో నటించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. Exciting journey with @RanaDaggubati for హిరణ్యకశ్యప #Hiranyakashyapa #OmNamoNarayanaya pic.twitter.com/7GujaMz0nu — Gunasekhar (@Gunasekhar1) 1 June 2019 -
200 కోట్లతో రానా సినిమా!
రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్ చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ఈ పౌరాణిక గాథను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అంతేకాదు యంగ్ హీరో రానా ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హిరణ్యకశ్యప సినిమాను దర్శకుడు గుణశేఖర్ దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మార్కెట్ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని సోలోగా ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ భారీ ప్రయోగంలో గుణ మరోసారి విజయం సాధింస్తాడేమో చూడాలి. -
రాక్షస రాజుగా రానానే ఫిక్స్
రుద్రమదేవి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు గుణశేఖర్, ఈ సారి పౌరాణిక కథ మీద వర్క్ చేస్తున్నారు. మహా భక్తుడు ప్రహ్లాదుడి కథను హిరణ్య కశిపుడి కోణంలో రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజా ఈ సినిమాపై సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. గుణశేఖర్, రానా కాంబినేషన్లో హిరణ్య చిత్రం రూపొందుతుందని వెల్లడించారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ వర్క్ జరుగుతుందని చెప్పిన సురేష్, సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందన్న విషయం ఇప్పుడు చెప్పలేమన్నారు. -
పౌరాణిక పాత్రలో రానా..
విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో ఆసక్తికరమైన చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న 1945, హథీ మేరీ సాథీతో పాటు చారిత్రక చిత్రంగా రూపొందుతున్న మార్తాండ వర్మ సినిమాల్లో సినిమా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఓ పౌరాణిక చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు గుణశేఖర్, త్వరలో హిరణ్య కశ్యప సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోసారి గుణ టీం వర్క్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్త ప్రహ్లాదుడి కథను హిరణ్యకశ్యపుడి కోణంలో చూపించనున్నారట. ఈ సినిమాలో హిరణ్య కశ్యపుడిగా రానా నటించనున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు. -
అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగింది
-
జీవిత విశ్వసనీయత కోల్పోయారు : గుణశేఖర్
నంది అవార్డుల వివాదం ప్రధానంగా నాలుగు సినిమాల చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. లెజెండ్, మనం, రేసుగుర్రం, రుద్రమదేవి సినిమాల పేర్లే ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాకు అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందని దర్శకుడు గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై స్పదించిన జ్యూరీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడటంపై గుణశేఖర్ మరోసారి స్పందించారు. మీడియాతో వివాదం గురించి మాట్లాడారు. ముఖ్యంగా రుద్రమదేవి సినిమాకు పన్ను రాయితీ రాకపోవడానికి గుణశేఖర్ సక్రమంగా ప్రయత్నించకపోవటమే కారణమన్న వాదనపై ఆయన వివరణ ఇచ్చారు. తాను నిబంధనల ప్రకారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు పన్ను మినహాయింపు కోసం అప్లై చేశానన్నరు. అయితే తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించినా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మూడు నెలల పాటు కాలయాపన చేసి, తరువాత తన ఫైల్ క్లోజ్ చేశారని తెలిపారు. ఈ విషయంపై మంత్రి అయ్యన్న పాత్రుడ్ని కలిస్తే ఆయన నేను అమరావతి వెళ్లాక మీ విషయం మాట్లాడతానని చెప్పి తరువాత ఫోన్ ఎత్తటం మానేశారన్నారు. మెసేజ్ లకు కూడా స్పందించకపోవటంతో, మరో మంత్రి గంటా శ్రీనివాసరావును సంప్రదించానని తెలిపారు. ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు విషయమై ప్రత్యేక క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ మీ విషయం ప్రస్తావిస్తానన్నారని కానీ తరువాత గంటా కూడా స్పందించలేదని.. ఇక ప్రయత్నించటం వృథా అని భావించి వదిలేశానని తెలిపారు. అదే సమయంలో అవార్డు కమిటీ నిర్ణయాలను ప్రశ్నిస్తే మూడేళ్ల పాటు వారిని అవార్డుల ఎంపిక నుంచి బహిష్కరిస్తామనే నిబంధన సరైంది కాదన్నారు. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందన్న గుణశేఖర్, ఈ నిబంధన కారణంగా చిన్న చిన్న సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆవేదనను బయటకు చెప్పుకోలేకపోతున్నారన్నారు. రుద్రమదేవి సినిమా విషయంలో 2015 నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత రాజశేఖర్ స్పందించిన తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ముందు బాహుబలితో పోటి పడ్డప్పుడు రుద్రమదేవి వెనకపడిందన్న కమిటీ కనీసం రెండో సినిమాగా అయిన అవార్డు ఇవ్వాలి కదా అని భావించాను.. కానీ అవార్డులు సాధించిన ఏ సినిమాతోనూ రుద్రమదేవి పోటి పడలేకపోయిందని చెప్పటం బాధకలిగించిందన్నారు. అవార్డులు ప్రకటించిన తరువాత జీవిత రాజశేఖర్ చంద్రబాబు పాలన రాకింగ్ అంటూ కామెంట్ చేయటంతో ఆమె విశ్వసనీయతను కోల్పోయారన్నారు. జ్యూరీలో అంతా సినిమా వాల్లే ఉండటం కరెక్ట్ కాదని, అదే సమయంలో రాజకీయ లబ్ధి ఆశించే వారికి జ్యూరీలో స్థానం కల్పించటం వల్ల నష్టం జరుగుతుందన్నారు. కొంత మంది జాతీయ అవార్డులతో నంది అవార్డులను పోలుస్తున్నారని అది సరికాదని తెలిపారు. జాతీయ అవార్డుల గైడ్ లైన్స్ కు.. నంది అవార్డుల గైడ్ లైన్స్ కు చాలా తేడా ఉంటుందని మన అవార్డులను మన ప్రాంతీయత, సంస్కృతి ఆధారంగా నిర్ణయిస్తారని తెలిపారు. జాతీయ అవార్డుల్లో రుద్రమదేవికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు రానందుకు బాధలేదని.. రుద్రమదేవి కన్నా కంచె సినిమాకు అవార్డు సాధించేందుకు అన్ని రకాలుగా అర్హత ఉందని అందుకే ఆ సినిమాను అవార్డు వరించిందని తెలిపారు. -
'అల్లు అర్జున్ ను అవమానించారు'
నంది అవార్డులపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ ప్రముకులు, అభిమానులు అవార్డుల ఎంపిక న్యాయంగా జరగలేదని విమర్శిస్తుండగా, దర్శకుడు గుణశేఖర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రుద్రమదేవి సినిమాకు ఆశించిన స్థాయిలో అవార్డులు రాకపోవటంపై ఇప్పటికే స్పందించిన గుణశేఖర్, తాజాగా అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వటం పై మాట్లాడారు. కావాలనే అల్లు అర్జున్ ను అవమానించారన్న గుణశేఖర్, స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వటం తప్పన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు, ఆమెను కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందని తెలిపారు. ఈ విషయంపై స్పదించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగిందన్నారు. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారు..? అని ప్రశ్నించారు. -
పౌరాణిక పాత్రలో సీనియర్ హీరో..?
రుద్రమదేవి సినిమాతో మంచి విజయం అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్.. ఇప్పుడు మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గుణ టీం, ఈ సారి ఓ పౌరాణిక గాథను తెరపై ఆవిష్కరించనున్నారు. భక్త ప్రహ్లాద కథను హిరణ్య కశ్యపుడి కోణంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించాడు గుణ శేఖర్. అయితే ప్రస్తుతం ఉన్న నటుల్లో హిరణ్య కశ్యపుడి పాత్రకు ఎవరు సూట్ అవుతారన్న చర్చ మొదలైంది. ముందుగా యంగ్ హీరోలే ఈ పాత్రలో నటిస్తారన్న ప్రచారం జరిగినా.. తాజాగా ఓ సీనియర్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు తన కెరీర్ లో పౌరాణిక పాత్రలో కనిపించని సీనియర్ హీరో వెంకటేష్, హిరణ్య కశ్యప సినిమాలో లీడ్ రోల్ లో నటించనున్నాడు. ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్న వెంకటేష్, నెగెటివ్ టచ్ ఉన్న హిరణ్య కశ్యపుడి పాత్రలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. త్వరలోనే ఈ భారీ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు. -
ఆస్కార్ బరిలో రుద్రమదేవి
-
ఆస్కార్ బరిలో రుద్రమదేవి
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భారీ చారిత్రక చిత్రం రుద్రమదేవి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఎన్నో రికార్డ్‌లతో పాటు అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. రుద్రమదేవి సినిమాను బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం క్యాటగిరీలో ఆస్కార్‌కు పంపేందుకు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రికమండ్ చేసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని పక్కన పెట్టి ఆస్కార్ బరిలో నిలవటంతో రుద్రమదేవి యూనిట్ ఎంతో సంతోషంగా ఉన్నారు. -
'ప్రతాప రుద్రుడు'గా ప్రభాస్..?
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా మార్కెట్ పరంగా ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్లోనే టాప్ హీరోగా ఎదిగాడు. అందుకే పెద్ద బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే సినిమాలకు ప్రభాస్‌నే హీరోగా సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అదే బాటలో తన నెక్ట్స్ సినిమా కోసం ప్రభాస్‌ను సంప్రదిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. రుద్రమదేవి సినిమాతో మంచి విజయం సాధించిన గుణశేఖర్, ఆ చిత్రానికి సీక్వల్గా చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రుద్రమదేవి సినిమాతో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే భారీ క్రేజ్ ఉన్న స్టార్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ప్రభాస్‌ను సంప్రదిస్తున్నాడట. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది చివరకు ఫ్రీ అవుతాడు. ఈ సినిమా తరువాత మిర్చి నిర్మాతలతో సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని ప్రభాస్ డేట్స్ దొరికే పరిస్థితి లేదు. మరి గుణశేఖర్ ప్రభాస్‌ను ప్రతాపరుద్రుడి పాత్రకు ఒప్పిస్తాడా..? లేక మరో హీరోతో మొదలెట్టేస్తాడా చూడాలి. -
రుద్రమ ప్రతాపం
-
రుద్రమదేవి రిలీజ్ ఎప్పుడు..?
-
ఇదో అద్భుతం!
వీర వనిత రుద్రమదేవి పాత్ర చేయాలంటే అందుకు తగ్గ ఆహార్యం ఉండాలి. దక్షిణాదిన ఆ ఆహార్యం ఉన్న తార ఎవరు? అంటే ఎవరైనా అనుష్క పేరే చెబుతారు. రుద్రమదేవిగా అనుష్క ఎంత బాగున్నారో ఈ పాత్రకు సంబంధించిన లుక్ తెలియజేసింది. ఇక.. ఆ వీరవనితలా అనుష్క అలవోకగా కత్తి తిప్పుతూ శత్రువులను అంతం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఊహాలకు తెరదించుతూ చిత్రదర్శక, నిర్మాత గుణశేఖర్ ప్రచార చిత్రం రూపంలో చిన్న శాంపిల్ చూపించారు. ఈ త్రీడీ ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. గుణ టీమ్ వర్క్స్‌పై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడుగా రానా కీలక పాత్రలు పోషించారు. ‘‘ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నా. ఈ చిత్రం ఓ అద్భుతం’’ అని అనుష్క అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ - ‘‘దేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రంగా రూపొందించాం. ఎంతో కష్టపడి ప్రేక్షకులకు నచ్చే చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఫొటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్. -
బాహుబలి, రుద్రమదేవి పోస్టర్ల విడుదల
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న బాహుబలి, గుణశేఖర్ దర్శకత్వంలో భారీస్థాయిలో రూపొందుతున్న రుద్రమదేవి.. రెండు సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. గోన గన్నారెడ్డిగా తెలుగుజాతి పౌరుషాన్ని తన ఖడ్గంతో చూపిస్తున్న అల్లు అర్జున్.. ఆ వెనకాల జలపాతాలతో రుద్రమదేవి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఆర్కామీడియా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బాహుబలి పోస్టర్లో ప్రభాస్ ఒకచేత్తో గండ్రగొడ్డలి, మరోచేత్తో కత్తి పట్టుకుని యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో కనిపించేలా బాహుబలి పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ మీద ఆర్కా మీడియా లోగో, బాహుబలి టైటిల్, 2015 అన్న పదాల తప్ప మరేమీ లేవు. రుద్రమదేవి పోస్టర్ మీద మాత్రం, సినిమాకు సంబంధించిన అందరి పేర్లు వేశారు. చారిత్రక నేపథ్యాలతో రూపొందిస్తున్న ఈ రెండు సినిమాల పోస్టర్లు ఒకే సమయంలో విడుదల కావడం యాదృచ్ఛికం. -
గోన గన్నారెడ్డిగా బన్నీ
‘‘గోన గన్నారెడ్డి గొప్ప వీరుడు. రాబిన్ హుడ్ తరహాలో ప్రజల కోసం రుద్రమదేవితో పోటాపోటీగా తలపడ్డ వ్యక్తి. తెరపై కనిపించేది కాసేపే అయినా, రుద్రమదేవి పాత్రతో పాటు ఈ పాత్ర కూడా ప్రేక్షకులను వెంటాడుతుంది’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. అనుష్క టైటిల్ రోల్లో భారీ నిర్మాణ వ్యయంతో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. ఇందులో గోన గన్నారెడ్డి పాత్రకు హీరో అల్లు అర్జున్ను తీసుకున్నారు. ఈ విషయం తెలియజేయడానికి శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘పల్నాటి బ్రహ్మనాయుడు అనగానే ఎన్టీఆర్ గుర్తొస్తారు. తెనాలి రామకృష్ణుడు అనగానే అక్కినేని నాగేశ్వరరావు గుర్తొస్తారు. తాండ్ర పాపారాయుడు అంటే కృష్ణంరాజు, అన్నమయ్య అంటే నాగార్జున గుర్తొస్తారు. అలా... గోన గన్నారెడ్డి అనగానే అల్లు అర్జున్ గుర్తొచ్చేంత గొప్పగా ఆయన పాత్ర ఉంటుంది. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ గుర్రపు స్వారీ, కత్తి సాము నేర్చుకుంటున్నారు. యూత్ ఐకాన్ బన్నీ ఈ పాత్ర చేయడం ఆనందంగా ఉంది. జూలై నెలాఖరున ఆయనపై సన్నివేశాలు తీస్తాం. అల్లు అర్జున్‌కు ఓ హిట్ సినిమా బాకీ ఉన్నాను. ఈ సినిమాతో ఆ బాకీ తీర్చుకుంటా. గోన గన్నారెడ్డి సరసన అనామిక పాత్రను కేథరిన్ పోషిస్తోంది’’ అని చెప్పారు. చారిత్రక నేపథ్యంలో, త్రీడీ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేస్తానని తెలిపారు గుణశేఖర్.