సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని తాజాగా నిర్మాతలు 'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత వీక్షించింది. అనంతరం ఇన్‌స్టా వేదికగా ‘శాకుంతలం’పై రివ్యూ ఇచ్చింది.
‘ఫైనల్లీ... ఈ రోజు 'శాకుంతలం' సినిమా చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శాకుంతలం కథకు గుణశేఖర్‌గారు ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిన్న పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన దిల్ రాజు, నీలిమా గుణలకు థాంక్స్'అని సమంత రాసుకొచ్చింది. శాకుంతలం రివ్యూ చదివిన సమంత ఫ్యాన్స్...శాకుంతలంతో సమంత మరో హిట్ అందుకోనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment