Samantha Ruth Prabhu shares cryptic post after announcing one long year break, pic goes viral - Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: సమంత.. ఇలా అయిపోయిందేంటి?

Published Mon, Jul 10 2023 3:20 PM | Last Updated on Mon, Jul 10 2023 3:29 PM

Samantha Ruth Prabhu Cryptic Post Latest Pic Viral - Sakshi

Samantha Ruth Prabhu Cryptic Post: సమంత పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఆమె నటించిన గత రెండు చిత్రాలు 'యశోద', 'శాకుంతలం'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో ఆశలన్నీ ప్రస్తుతం 'ఖుషి' పైనే పెట్టుకుంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓ ఫొటో పోస్ట్ చేసిన సామ్ అందరూ అవాక్కయ్యేలా చేసింది.

గుర్తుపట్టలేనంతగా
సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతోంది. గతేడాది 'యశోద' విడుదల సమయంలో ఈ సమస్య గురించి బయటపెట్టిన సామ్.. ఆ తర్వాత పలు సినిమాలతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. అయితే సామ్.. ఓ సంవత్సరం పాటు  బ్రేక్ తీసుకోనుందని ఈ మధ్య న్యూస్ వచ్చింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: అ‍ల్లర్ల మధ్య హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ వాల్తేరు వీరయ్య బ‍్యూటీ!)

ఆరు నెలలు కష్టంగా
తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ పిక్ పోస్ట్ చేయగా.. అది సమంత అని గుర్తుపట్టడానికి కాస్త సమయం పట్టింది. మేకప్ లేకపోవడం లేదా అలసట వల్లో తెలియదు గానీ ఇందులో సమంత చాలా డల్ గా కనిపించింది. 'ఈ ఆరు నెలల చాలా సుధీర్ఘంగా, కష్టంగా గడిచాయి. ఫైనల్ గా దీన్ని ముగించాల్సిన టైమ్ వచ్చింది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

చికిత్స కోసం అంత ఖర్చు?
ఏడాదిపాటు సమంత బ్రేక్ తీసుకోనున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. అలానే సామ్ చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని, ఈ మొత్తం చికిత్స కోసం ఏకంగా రూ. కోటి వరకు ఖర్చు కానుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే సమంత లేటెస్ట్ లుక్ మాత్రం అందరినీ అయోమయానికి గురిచేసింది. 

(ఇదీ చదవండి: బుల్లితెర నటి ఇంట్లో చోరీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement