200 కోట్లతో రానా సినిమా! | 200 Crores Budget For Rana Gunasekhar Hiranya Kashyapa | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 13 2018 3:54 PM | Last Updated on Thu, Dec 13 2018 7:05 PM

200 Crores Budget For Rana Gunasekhar Hiranya Kashyapa - Sakshi

రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్‌ లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్‌ చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ఈ పౌరాణిక గాథను భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్‌ చేశారు. అంతేకాదు యంగ్‌ హీరో రానా ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ లో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. 

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హిరణ్యకశ్యప సినిమాను దర్శకుడు గుణశేఖర్‌ దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మార్కెట్‌ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని సోలోగా ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ భారీ ప్రయోగంలో గుణ మరోసారి విజయం సాధింస్తాడేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement