ఇదో అద్భుతం! | Rudramadevi 3d theatrical trailer released | Sakshi
Sakshi News home page

ఇదో అద్భుతం!

Published Sun, Mar 1 2015 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

ఇదో అద్భుతం!

ఇదో అద్భుతం!

వీర వనిత రుద్రమదేవి పాత్ర చేయాలంటే అందుకు తగ్గ ఆహార్యం ఉండాలి. దక్షిణాదిన ఆ ఆహార్యం ఉన్న తార ఎవరు? అంటే ఎవరైనా అనుష్క పేరే చెబుతారు. రుద్రమదేవిగా అనుష్క ఎంత బాగున్నారో ఈ పాత్రకు సంబంధించిన లుక్ తెలియజేసింది. ఇక.. ఆ వీరవనితలా అనుష్క అలవోకగా కత్తి తిప్పుతూ శత్రువులను అంతం చేస్తే ఎలా ఉంటుంది? అనే ఊహాలకు తెరదించుతూ చిత్రదర్శక, నిర్మాత గుణశేఖర్ ప్రచార చిత్రం రూపంలో చిన్న శాంపిల్ చూపించారు. ఈ త్రీడీ ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
 గుణ టీమ్ వర్క్స్‌పై శ్రీమతి రాగిణి గుణ  సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడుగా రానా కీలక పాత్రలు పోషించారు. ‘‘ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నా. ఈ చిత్రం ఓ అద్భుతం’’ అని అనుష్క అన్నారు. గుణశేఖర్  మాట్లాడుతూ - ‘‘దేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రంగా రూపొందించాం. ఎంతో కష్టపడి ప్రేక్షకులకు నచ్చే చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఫొటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement