Samantha First Look In Shakunthalam Is Out: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా సమంత ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సమంత దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు. చదవండి: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను : సమంత
Presenting ..
— Samantha (@Samanthaprabhu2) February 21, 2022
Nature’s beloved..
the Ethereal and Demure.. “Shakuntala” from #Shaakuntalam 🤍 #ShaakuntalamFirstLook@Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/q4fCjyfnth
Comments
Please login to add a commentAdd a comment