Manchu Lakshmi Interesting Tweet On Samantha Shaakuntalam Movie Trailer, Deets Inside - Sakshi
Sakshi News home page

Shaakuntalam: సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్‌

Published Tue, Jan 10 2023 10:35 AM | Last Updated on Tue, Jan 10 2023 11:02 AM

Manchu Lakshmi Interesting Tweet On Samantha Shakuntalam Movie Trailer - Sakshi

గుణ శేఖర్‌ దర్శకత్వంలో సమంత లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓవైపు గ్రాఫిక్స్, మరోవైపు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సులతో ట్రైలర్‌ అదిరిపోయింది. శాకుంతలగా సమంత మేకోవర్, మణిశర్మ నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఈ చిత్రంలో  దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ , దుర్వాస మహర్షి పాత్రలో మంచు మోహన్ బాబు, భరతుడిగా అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అర్హ నటిస్తోంది.

(చదవండి: ఓపిక లేకపోయినా వచ్చాను.. సమంత ఎమోషనల్‌)

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సమంత అద్భుతంగా చేశావు. నాన్న దుర్వాస మహర్షి పాత్రలో నిన్ను చూడడం మంత్రముగ్ధులను చేసింది. అర్హ పాప భరతుడు పాత్రలో బాగా నటించావు’అంటూ మంచు లక్ష్మి ట్వీట్‌ చేసింది. ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement