'ప్రతాప రుద్రుడు'గా ప్రభాస్..? | guna sekhar wants prabhas as pratap rudra | Sakshi
Sakshi News home page

'ప్రతాప రుద్రుడు'గా ప్రభాస్..?

Published Thu, Feb 25 2016 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

'ప్రతాప రుద్రుడు'గా ప్రభాస్..?

'ప్రతాప రుద్రుడు'గా ప్రభాస్..?

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా మార్కెట్ పరంగా ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్లోనే టాప్ హీరోగా ఎదిగాడు. అందుకే పెద్ద బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే సినిమాలకు ప్రభాస్నే హీరోగా సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అదే బాటలో తన నెక్ట్స్ సినిమా కోసం ప్రభాస్ను సంప్రదిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్.

రుద్రమదేవి సినిమాతో మంచి విజయం సాధించిన గుణశేఖర్, ఆ చిత్రానికి సీక్వల్గా చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రుద్రమదేవి సినిమాతో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో సీక్వెల్ను మరింత భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే భారీ క్రేజ్ ఉన్న స్టార్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ప్రభాస్ను సంప్రదిస్తున్నాడట.

ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది చివరకు ఫ్రీ అవుతాడు. ఈ సినిమా తరువాత మిర్చి నిర్మాతలతో సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని ప్రభాస్ డేట్స్ దొరికే పరిస్థితి లేదు. మరి గుణశేఖర్ ప్రభాస్ను ప్రతాపరుద్రుడి పాత్రకు ఒప్పిస్తాడా..? లేక మరో హీరోతో మొదలెట్టేస్తాడా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement