Prasad Imax
-
ఈ స్టార్ యాక్టర్ స్టైలే వేరు.. పెద్దవాడినన్న సంగతే మరిచిపోయారు!
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియా తన చిలిపి చేష్టల గురించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. కేవలం నటనలో మాత్రమే ఆయన సిరీయస్.. రియల్ లైఫ్‌లో బిందాస్ అన్నట్లు తన టాలెంట్‌ను చూపిస్తున్నారు. ఇంతకీ మళ్లీ ఆయన ఏం చేశారని అనుకుంటున్నారా? అదేంటో మీరు ఓ లుక్కేయండి.హీరో జగపతి బాబు తాజాగా హైదరాాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సందడి చేశారు. అదేంటీ థియేటర్లకు అందరూ వెళ్తారు.. అందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? ఉందండి.. అదేంటంటే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేందుకు చాలా గేమ్స్ ఉన్నాయి. ఇంకేముంది మన హీరో వెంటనే చిన్నపిల్లాడిగా మారిపోయాడు. అక్కడున్న ఏ ఆటను వదలకుండా ఆడేశారు. చివరికీ టాయ్ ట్రైన్లో ప్రయాణించి చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. పెద్దవాడికి బుల్లి కోరికలు క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్, గుంటూరు కారం సినిమాలతో మెప్పించిన జగపతిబాబు.. త్వరలోనే రిలీజ్ కానున్న కంగువాలో నటించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.Peddhavaddiki bulli korikkalu… pic.twitter.com/8mFpV9aO30— Jaggu Bhai (@IamJagguBhai) November 11, 2024 -
Tank Bund: చల్ మోహన రంగ
సిడ్నీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించే ట్యాంక్ బండ్..అద్భుత అందాలతో పాటు చారిత్రాత్మక వైభవాలకు ప్రతీకనగరానికి మణిహారం సాగర తీరం..చెప్పుకుంటూ పోతే మరెన్నో.. రింజిమ్..రింజిమ్..హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రమలు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్.. అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు.. ఈ వంకా జూబిలి హాలూ తళతళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ...ఇలా చెప్పుకుంటూ పోతే.. పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు.. ఎటుచూసినా ఏదో ఒక విశేషమైన ప్రాంతం చూపరులను అబ్బురపరుసూనే ఉంటాయి... వాటిల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచేది.. ట్యాంక్ బండ్.. నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ట్యాంక్ బండ్‌తో అవినాభావ సంబంధం ఉంటుంది. ట్యాంక్ బండ్ ప్రారంభంలోనే ‘నగర రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ జవాన్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనం’గా ఏర్పాటు చేసిన యుద్ధనౌక స్వాగతం పలుకగా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పార్క్ అందాలు, మహనీయుల విగ్రహాల పలకరింపుతో సాగర్‌లోని నీటి ఫౌంటేన్ల తుంపరల మధ్య శాంతిమయుడు గౌతమ బుద్ధుడిని తిలకిస్తూ అక్కడి అందాలను ఆస్వాదించడం భలే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల గురించి లుసుకుందాం... సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రకు తలమానికమైన చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాలే కాకుండా..దేశానికే తలమానికంగా నిరి్మతమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్లమెంట్‌ను పోలిన నిర్మాణం పైన భారీ ఎత్తులో నిరి్మతమైన ఈ విగ్రహం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తిలకించినా సగర్వంగా కనిపిస్తుంది. బుద్ధుడిని స్పూర్తిగా తీసుకుని దేశం గరి్వంచదగ్గ వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్., హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని వెనుకనే నిరి్మంచడంతో సింబాలిక్‌గా నిలుస్తుంది. నగర వైభవాన్ని ప్రతిబింబించే నిర్మాణాలైన చారి్మనార్, అసెంబ్లీ భవనాల సరసన నిలిచేలా నూతనంగా నిర్మితమైన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, కేబుల్ బ్రిడ్జి వంటివి చూపు తిప్పుకోనివ్వవు అంటే అతిశయోక్తి కాదేమో..! ఎన్.టి.ఆర్ గార్డెన్... అరుదైన బొన్సాయ్ మొక్కలు, ఆరి్టఫీషి యల్ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్ రోడ్ అందాలను చూపించే జేయింట్ వీల్, అండర్ గ్రౌండ్లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆశ్చర్యపరిచే ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్ చేసే త్రీడి షో.. వెరసి అందరినీ అలరించే ఎన్.టీ.ఆర్ గార్డెన్. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో ఎన్.టీ.రామారావు సమాధిని సందర్శింవచ్చు.ప్రసాద్ ఐమాక్స్.. సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్ ఇలా అన్ని రకాల నగర జీవన శైలికి అద్దం పట్టే వేదిక ఐమాక్స్. ఇందులో సినిమా చూస్తే అదో క్రేజ్‌లా మారేంతలా గుర్తింపు పొందింది. కొత్త సినిమాల విడుదలతో ప్రతీ శుక్రవారం ఇక్కడ సెలబ్రిటీలు, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలతో సందడిగా ఉంటుంది. జల్ విహార్... కేవలం నీళ్లలో ఆడే ఆటలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్. రేయిన్ డ్యాన్స్, వాటర్ఫూల్స్లో ఎత్తునుంచి జారవిడిచే ఆటలతో పాటు ఇతర వాటర్ గేమ్స్ ప్రేక్షకులను బయటకు రానివ్వవు.థ్రిల్ సిటీ... ఈ మధ్యనే ప్రారంభమైన థ్రిల్ సిటీ ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. రోమాలను నిక్కబొడుచుకునేలా చేసే థ్రిల్లింగ్ గేమ్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.పీవీ జ్ఞాన భూమి... ఇంతకు ముందు ఎరుగని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు సమాధి ఈ జ్ఞాన భూమిలో కొలువుదీరింది. దేశానికి పనిచేసిన ఏ ప్రధాన మంత్రి సమాధిని చూడాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ దక్షిణాది ప్రధానిగా చక్రంతిప్పిన పీవీ సమాధి మాత్రం నెక్లెస్ రోడ్లో చూడవచ్చు.సంజీవయ్య పార్క్... అనేక రంగులతో అలరించే రోస్ గార్డెన్, రంగురంగుల సీతాకోకచిలుకలను కలుసుకునే బటర్ఫ్లవర్ పార్క్, ఎత్తులో దేశంలో రెండో అతిపెద్ద జాతీయ జెండాలను ప్రత్యక్షంగా చూడాలంటే సంజీవయ్య పార్క్ వెళ్లాల్సిందే. ఎత్తులో రెండో స్థానం అయినప్పటికీ త్రివర్ణ పతాకం సైజులో మాత్రం దేశంలోనే అతిపెద్దది.ఈట్ స్ట్రీట్–ఆర్ట్ స్ట్రీట్.. ఆహార ప్రియులకు అనువైన చోటు నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్., సాగర్ నీటి అలల అంచున కూర్చోని వివిధ డిష్‌లను ఆస్వాదించవచ్చు. దీని ఎదురుగానే ఉన్న వీధుల్లోని ఇళ్లను మొత్తం విభిన్న చిత్రాలతో కళాకారులు తయారు చేశారు. డాగ్ పార్క్.. ప్రతీ ఆదివారం ఉదయం నగరంలోని అన్ని రకాల కుక్కలతో వారి యజమానులు ఈ డాగ్ పార్క్‌కు వస్తారు. జంతు ప్రేమికులను ఇది విశేషంగా అలరిస్తుంది. సైక్లింగ్ క్లబ్.. థ్రిల్ సిటీకి ఎదురుగా ఉన్న సైక్లింగ్ క్లబ్ ఫిట్‌నెస్‌కు మంచి మార్గం. ఇందులో మొంబర్íÙప్ తీసుకుని ఎవరైనా సైక్లింగ్ చేయవచ్చు.అమరవీరుల స్మారక కేంద్రం... తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత శ్రద్ధాంజలిగా దీపం రూపంలో నిరి్మంచిన స్మారక కేంద్రం కొత్త శోభను తీసుకొచి్చంది. ఇందులో ప్రత్యేకంగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం అదనపు ఆకర్షణ.టూరిస్టు సర్కిల్‌గా ట్యాంక్బండ్ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గుర్తుచేసేలా సాగర్ మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం నగరానికే తలమానికం. చూట్టూ ఆవరించి ఉన్న నీటి మధ్యలో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి. ఇక్కడి బోటింగ్ సదుపాయాలు అదనపు ఆనందం.బిర్లా ప్లానిటోరియం.. విజా్ఞనం, వినూత్నం, వివేకానికి బిర్లా ప్లానిటోరియం మంచి వేదిక. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకూ అవసరమైన శాస్త్ర–సాంకేతిక, పురాతత్వ విషయాలను తెలుసుకొవచ్చు. ఇక్కడే అంతరిక్షానికి చెందిన ప్రత్యేక స్కై షో కూడా చూడవచ్చు. లుంబినీ పార్క్, బోటింగ్.. ఆటవిడుపుకు, కాలక్షేపానికి అడ్డాగా మాత్రమే కాకుండా హుస్సేన్‌సాగర్ అందాలను తనివితీరా చూపించే బోటింగ్ సదుపాయం లుంబినీ పార్క్ సొంతం. సాధారణ బోటింగ్, సినిమాల్లో చూపించే వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లతో పాటు వ్యక్తిగత పారీ్టలు సైతం నిర్వహించుకునేలా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. -
ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. సినీ ప్రపంచంలో మన తెలుగు చిత్రాలకు సుస్థిరమైన స్థానం కల్పించాడు. సినిమాలతో తనకున్న అనుబంధాన్ని ఎప్పుడు ఏదో ఒకరూపంలో వ్యక్తం చేస్తుంటారు. తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందో తెలుసుకుందాం. (ఇది చదవండి: అల్లు అర్జున్ సినిమాకు నో చెప్పిన శ్రీలీల... కారణం ఇదేనా?) హైదరాబాద్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మల్టీప్లెక్స్ పేరు ప్రసాద్ ఐమాక్స్. సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆ మల్టీప్లెక్స్‌కు ఓ చరిత్ర ఉందనడంలో సందేహం లేదు. శుక్రవారం వచ్చిందంటే చాలు ఓ పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతలా సినీ ప్రియులకు వినోదం అందించడంలో ముందున్న ప్రసాద్ ఐమాక్స్ స్థాపించి ఇరవై ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి ఓ వీడియోను షేర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'ఎన్ని శుక్రవారాలు... ఫస్ట్ డే ఫస్ట్ షోలు.. ఉదయాన్నే 8.45కి సీట్లో కూర్చోవడానికి పరుగెత్తుకుంటూ.. అప్పుడే 20 ఏళ్లు గడిచాయా?? ప్రతి సినిమా వినోదాత్మకంగా ఉన్నా, నిరాశపరిచినా నాకు ఏదో గుణపాఠం చెబుతోంది. ప్రియమైన ప్రసాద్ ఐమాక్స్.. మీరు సినిమా మాత్రమే కాదు, మీరు నా తరగతి గది.. ధన్యవాదాలు' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో ప్రేక్షకుల భావోద్వేగాలను చక్కగా ప్రస్తావించారు. (ఇది చదవండి: నిండు గర్భంతో పోకిరీ భామ.. బేబీ బంప్ ఫోటో వైరల్!) How many Fridays... First day first shows. Rushing to be seated by 8.45.. Is it 20 years already?? Every movie, whether entertaining or disappointing, was teaching me a lesson.. Dear Prasads, you are not just a cinema, you are my classroom.. Thank you..🤗🤗🤗 A special mention… pic.twitter.com/0R5p76UF49 — rajamouli ss (@ssrajamouli) July 27, 2023 -
ప్రసాద్ ఐమాక్స్ కీలక నిర్ణయం.. వారికి నో ఎంట్రీ!
హైదరాబాద్‌లో ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా రివ్యూల కోసం వచ్చే ఛానెళ్లు, యూట్యూబర్లకు షాకిచ్చింది. ప్రసాద్ ఐమ్యాక్స్ ఆవరణలో వారికి ప్రవేశం లేదని ప్రకటిచింది. వాటిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రసాద్ ఐమాక్స్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. \ (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) ఏ కొత్త సినిమా రిలీజైన ప్రసాద్ ఐమాక్స్ వద్దే ఆడియన్స్ నుంచి రివ్యూలు తీసుకోవడం జరుగుతోంది. ఈ నిర్ణయంతో ఐమ్యాక్స్ ఆవరణలో రివ్యూలకు ఇకపై అనుమతి ఉండదు. దీంతో రివ్యూల కోసం న్యూస్ ఛానెల్స్, యూట్యూబర్స్ రోడ్లపైనే ఉండి రివ్యూలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి) -
'శాకుంతలం' సినిమాకు ఊహించని షాక్, తొలిరోజే ఇలా జరిగిందేంటి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజే ఊహించని షాక్ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్ 14)న డాక్టర్ బీఆర్ అబేద్కర్ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. An important update to our beloved fans & moviegoers in Hyderabad : Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow! 🎟️… pic.twitter.com/TTjdOSloDT — Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023 -
ఫ్యాన్ మూమెంట్.. వాల్తేరు వీరయ్య సినిమా చూసిన అల్లు అర్జున్
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. వింటేజ్ లుక్‌లో చిరు స్టైల్‌కి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అటు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా పోటాపోటీగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు చూసేందుకు సినీ అభిమానులే కాకుండా, సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమాను చూశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో అభిమానులతో కలిసి ఆయన సినిమాను చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాను మెగాస్టార్‌కి వీరాభిమాని అని అల్లు అర్జున్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ ఫ్యాన్ మూమెంట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Icon StAAr @alluarjun watching his hardcore Mega Star @KChiruTweets fan movie #WaltairVeerayya 😍🔥#AlluArjun #Chiranjeevi #MegaStarChiranjeevi #Chiranjeevi pic.twitter.com/Mg0FPCtdTr — Nithin (@NithinPSPKCult) January 13, 2023 -
ఐమాక్స్‌లో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తలసాని
-
ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకుని అద్దె చెల్లించని 9 బడా కంపెనీలు
-
బడా కంపెనీల ఇష్టారాజ్యం.. కేసీఆర్ సర్కార్‌కు వందల కోట్లు లాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకున్న 9 బడా కంపెనీలు అద్దె చెల్లించడంలేదు. జీహెచ్ఎంపీ పరిధిలో ఉన్న పెద్ద కంపెనీలు 2009 నుంచి ప్రభుత్వానికి లీజ్ చెల్లించడంలేదు. ఈ కంపెనీలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 272కోట్లు బకాయిపడ్డాయి. ఈ క్రమంలో లీజ్ చెల్లించని వారి లైసెన్స్ రద్దు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కాగా సదరు సంస్థలు పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు లీజ్‌కు తీసుకోవడం గమనార్హం. 9 బడా కంపెనీలు ఇవే.. -ట్రైడెంట్ హోట్.. రూ. 87.86 కోట్లు. - అర్బన్దేవ్ సెంటర్ రూ. 62.77 కోట్లు. - త్రిస్టార్ హోటల్ రూ. 50.35 కోట్లు. - ప్రసాద్ ఐమాక్స్ రూ. 27. 45 కోట్లు. - ఎక్స్‌పోటెల్ హోటల్ రూ. 15.13 కోట్లు. - స్నో వరల్డ్ రూ. 15 కోట్లు. - జల విహార్ రూ. 6.51 కోట్లు. - గోల్ఫ్ కోర్స్(శామీర్‌పేట్) రూ. 5.58 కోట్లు. - దస్పల్లా హోటల్ రూ. 1.8 కోట్లు. ఇది కూడా చదవండి: ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్! -
ప్రసాద్ ఐమ్యాక్స్‌పై సెంట్రల్ ట్యాక్స్ విచారణ!
సాక్షి, హైదరాబాద్: ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌పై సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ విచారణ చేపట్టింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా రూ.100 దాటిన సినిమా టికెట్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించకుండానే ప్రేక్షకుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారని ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 1 నుంచి అన్ని థియేటర్లలో ఈ తగ్గించిన రుసుమును టికెట్లపై వసూలు చేయాల్సి ఉంది. అయితే, సినిమా థియేటర్లు దీన్ని అమలు చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు కస్టమ్స్ శాఖ పరిధిలోని ప్రత్యేక విభాగం అధికారులు కొన్ని థియేటర్లను పరిశీలించగా, ఐమ్యాక్స్ థియేటర్లో తగ్గించలేదని తేలింది. ఆధారాలను కూడా సేకరించిన కస్టమ్స్ విభాగం దీనిపై విచారణ జరిపించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీకి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
బాహుబలి నటుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ, పెళ్లి పేరిట ఓ మహిళను మోసం చేసిన వ్యవహారంలో ఐమ్యాక్స్ మేనేజర్ వెంకట ప్రసాద్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఫిర్యాదుతో వెంకట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం అయినప్పటికీ మనస్పర్థల కారణంగా భర్తతో విడిగా ఉంటోంది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా.. ఐమ్యాక్స్ మేనేజర్ వెంకటప్రసాద్ కన్ను ఆమెపై పడింది. ఆమెతో మాటలు కలిపి దగ్గరయి ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. విడాకులు రాగానే ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేశారు. ఏడేళ్ల సహజీవనంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఇంతలో ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మహిళతోపాటు చాలా మంది యువతులను వెంకట్ మోసం చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, బాహుబలిలో ప్రభాస్ శివుడు పాత్ర పెంపుడు తండ్రి పాత్ర (అశ్వని భర్త) పాత్రలో నటించింది ఇతనే. తాజాగా రాజేశేఖర్ 'గురుడవేగ' సీఎం పీఏ పాత్రలో ఓ చిన్న పాత్రను కూడా వెంకట్ పోషించాడు. -
ఎప్పటి లోపు ఖాళీ చేస్తారో చెప్పండి
డాక్టర్ కార్స్ యాజమాన్యానికి హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ నుంచి ప్రసాద్ ఐమాక్స్ పక్కన లీజుకు తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసిన నేపథ్యంలో ఎప్పటి లోపు ఆ స్థలాన్ని ఖాళీ చేస్తారో చెప్పాలని డాక్టర్ కార్స్ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను గురు వారానికి వాయిదా వేసింది. బుధవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సెకెండ్ హ్యాండ్ కార్ల విక్రయం, ప్రదర్శన నిమిత్తం డాక్టర్ కార్స్ యాజమాన్యం 2012లో స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె బకారుులు చెల్లించకపోవడంతో స్థలాన్ని ఖాళీ చేయాలని హెచ్ఎండీఏ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ డాక్టర్ కార్స్ హైకోర్టును ఆశ్రరుుం చగా.. నోటీసులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తర్వాత స్టే ఎత్తివే యాలని కోరుతూ హెచ్ఎండీఏ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ డాక్టర్ కార్స్ యాజమాన్యం తాజాగా ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. -
భాగ్యనగరిలో బాలానందం
19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు ఆతిథ్యం ఇస్తున్న భాగ్యనగరి బాలల సందడితో నిండిపోయింది. చిత్రాలను వీక్షించేందుకు పలు దేశాల నుంచి భిన్న సంస్కృతుల పిల్లలు రావడంతో ప్రధాన వేదిక ప్రసాద్ ఐమాక్స్, శిల్పారామంలో పండుగ సందడి నెలకొంది. సాంస్కృతిక వేదిక రవీంద్రభారతి నాట్య సౌరభాలతో గుబాళిస్తోంది. ఐదురోజులుగా సాగుతున్న సినిమా పండుగ నేటితో ముగియనుంది. - సాక్షి, హైదరాబాద్ బిడ్డ కోసం ఓ తల్లి వేదన.. తెల్ల రంగులోని ఒంటెను ఎక్కడైనా చూశారా..? కేవలం రష్యాలో కనబడే ఈ ఒంటెలు పుడితే అదృష్టమని అక్కడి వారి నమ్మకం. విశేషం ఏంటంటే.. కరెక్ట్‌గా మేఘాలు కూడా ఒంటె ఆకారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఒంటెలు పుడతాయట. వీటిని ‘సెలస్టియల్ కామిల్స్’ అంటారు. ఇలాంటి తమాషా కథాంశంతో తల్లీ బిడ్డల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన రష్యా చిత్రం ‘సెలస్టియల్ కామిల్’. బిడ్డ దూరమైతే తల్లి పడే బాధ వర్ణనాతీతం. మనుషులైతే తమ బాధను చెప్పుకోగలరు. మరి నోరులేని జీవుల పరిస్థితి ఏంటి..? దక్షిణాది రష్యాలో ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ కుటుంబం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ కుటుంబ పెద్దకి ముగ్గురు పిల్లలు. వారితో పాటు ఓ ఒంటె, కొన్ని గొర్రెలు ఉంటాయి. ఇంతలో ఈ ఒంటెకి తెల్ల రంగులో ఉన్న పిల్ల పుడుతుంది. కానీ అక్కడి కి వచ్చిన రష్యా చిత్ర బృందం ఆ ఒంటెను చూసి తమ సినిమా కోసం డబ్బు ఆశ చూపించి ఆ పిల్లను తీసుకెళ్లిపోతారు. కళ్ల ముందే తన బిడ్డను తీసుకెళ్లిపోతుంటే తల్లి ఒంటె ఎంతో బాధ పడుతుంది. తర్వాత పిల్లను వెతుక్కుంటూ ఇంటి నుంచి పారిపోతుంది. ఈ ఒంటె లేకపోతే ఆ కుటుంబానికి నీళ్లుండవు. ఎందుకంటే ఎంతో లోతుకి తోడితే గానీ బావిలోంచి నీళ్లు రావు. తమ కుటుంబంలో భాగమైన ఒంటెను, దాని పిల్లను వెతకడానికి ముగ్గురు పిల్లల్లో ఒకరైన బెయర్ బయలుదేరతాడు. వాటి జాడ తెలుసుకున్నాడా లేదా అన్నది కథ. రష్యాకు చెందిన యూరి ఫిటింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. పండుగలో మధు‘హారం’ ప్రస్తుత కాలంలో పిల్లలకు పుస్తకాలే ప్రపంచమైపోయింది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మార్కుల పరుగు పందెంలో తమలో ఉన్న ప్రతిభను గుర్తించడం లేదు. తల్లిదండ్రులు గుర్తించినా ప్రోత్సహించడం లేదు. అయితే, ఖైరతాబాద్ నాజర్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మధుమాల తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకుంటూ ‘ఐ యామ్ డిఫరెంట్’ అంటోంది. పేపర్‌తో భిన్న ఆర్టికల్స్ తయారు చేసి తనలోని సృజనకు పదును పెడుతోంది. అంతేకాదండోయ్.. ఈ బాలిక తన వస్తువులకు బాలల చలన చిత్రోత్సవాలను ‘మార్కెట్’గానూ మలచుకొంది. గురువారం ప్రసాద్ ఐమాక్స్ ప్రాంగణంలో ఆమె పెట్టిన ‘పేపర్ జ్యువెలరీ’ స్టాల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మధుమాల మాట్లాడుతూ.. ‘నాకు గ్లాస్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఓ ఎగ్జిబిషన్లో పేపర్‌తో చేసిన చైన్స్ చూశా. ఇంకా కొత్తగా చేయాలనిపించింది. అమ్మా,నాన్నల ప్రోత్సాహంతో వీటిని తయారు చేయడం స్టార్ట్ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది. ‘వీటి తయారీకి ఉపయోగించే పేపర్ కేవలం ముంబై, పుణెల్లోనే దొరుకుతుంది. ప్రతి ఆర్టికల్ చేత్తోనే తయారు చేస్తా. మా స్కూల్లో జరిగిన ఓ వేడుకలో వీటిని ప్రదర్శనకు పెట్టాను. అందరూ బాగున్నాయన్నారు. ఫిలిం ఫెస్టివల్ మొదటి రోజునే ప్రదర్శనకు పెడదామనుకున్నా. కానీ నాకు ఆ రోజు నుంచి ఎగ్జామ్స్. ఈ రోజు కూడా పరీక్ష రాసి ఈ స్టాల్‌కు వచ్చాను. చూసినవారందరూ నా వర్క్‌ను మెచ్చుకుంటున్నారు.’ అని వివరించింది. -
రికార్డ్ బ్రేక్
రూబిక్ క్యూబ్‌లో గాదిరాజు కృష్ణంరాజు రికార్డు బద్దలు కొట్టాడు. అత్యధిక క్యూబ్‌లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. నిర్విరామంగా 24 గంటలపాటు ఒంటిచేత్తో 2,176 క్యూబ్‌లు చేసి రికార్డులకెక్కాడు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఫీట్‌ని మొదలు పెట్టి.. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవంతంగా ముగించాడు. ‘అనుకున్నది సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని రికార్డులను ఛేదిస్తా. రెండు చేతుల సహాయంతో 5,800 క్యూబ్‌లు చేసిన కెనడాకు చెందిన ఎరిక్ క్లమ్బ్యాక్ రికార్డును అధిగమించడం నా నెక్ట్స్ గోల్’ అని కెమికల్ రీసెర్చర్ కృష్ణంరాజు సంతోషం వ్యక్తం చేశాడు.