![Central Tax inquiry into Prasad iMax - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/2/imax.jpg.webp?itok=QQLSVOcj)
సాక్షి, హైదరాబాద్: ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌పై సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ విచారణ చేపట్టింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా రూ.100 దాటిన సినిమా టికెట్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించకుండానే ప్రేక్షకుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారని ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఈ ఏడాది జనవరి 1 నుంచి అన్ని థియేటర్లలో ఈ తగ్గించిన రుసుమును టికెట్లపై వసూలు చేయాల్సి ఉంది. అయితే, సినిమా థియేటర్లు దీన్ని అమలు చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు కస్టమ్స్ శాఖ పరిధిలోని ప్రత్యేక విభాగం అధికారులు కొన్ని థియేటర్లను పరిశీలించగా, ఐమ్యాక్స్ థియేటర్‌లో తగ్గించలేదని తేలింది. ఆధారాలను కూడా సేకరించిన కస్టమ్స్ విభాగం దీనిపై విచారణ జరిపించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీకి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment