
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియా తన చిలిపి చేష్టల గురించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. కేవలం నటనలో మాత్రమే ఆయన సిరీయస్.. రియల్ లైఫ్‌లో బిందాస్ అన్నట్లు తన టాలెంట్‌ను చూపిస్తున్నారు. ఇంతకీ మళ్లీ ఆయన ఏం చేశారని అనుకుంటున్నారా? అదేంటో మీరు ఓ లుక్కేయండి.
హీరో జగపతి బాబు తాజాగా హైదరాాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సందడి చేశారు. అదేంటీ థియేటర్లకు అందరూ వెళ్తారు.. అందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? ఉందండి.. అదేంటంటే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేందుకు చాలా గేమ్స్ ఉన్నాయి. ఇంకేముంది మన హీరో వెంటనే చిన్నపిల్లాడిగా మారిపోయాడు. అక్కడున్న ఏ ఆటను వదలకుండా ఆడేశారు. చివరికీ టాయ్ ట్రైన్‌లో ప్రయాణించి చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. పెద్దవాడికి బుల్లి కోరికలు క్యాప్షన్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్, గుంటూరు కారం సినిమాలతో మెప్పించిన జగపతిబాబు.. త్వరలోనే రిలీజ్ కానున్న కంగువాలో నటించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Peddhavaddiki bulli korikkalu… pic.twitter.com/8mFpV9aO30
— Jaggu Bhai (@IamJagguBhai) November 11, 2024