సాక్షి, హైదరాబాద్ : ప్రేమ, పెళ్లి పేరిట ఓ మహిళను మోసం చేసిన వ్యవహారంలో ఐమ్యాక్స్ మేనేజర్ వెంకట ప్రసాద్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఫిర్యాదుతో వెంకట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం అయినప్పటికీ మనస్పర్థల కారణంగా భర్తతో విడిగా ఉంటోంది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా.. ఐమ్యాక్స్ మేనేజర్ వెంకటప్రసాద్ కన్ను ఆమెపై పడింది. ఆమెతో మాటలు కలిపి దగ్గరయి ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. విడాకులు రాగానే ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేశారు.
ఏడేళ్ల సహజీవనంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఇంతలో ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మహిళతోపాటు చాలా మంది యువతులను వెంకట్ మోసం చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు.
కాగా, బాహుబలిలో ప్రభాస్ శివుడు పాత్ర పెంపుడు తండ్రి పాత్ర (అశ్వని భర్త) పాత్రలో నటించింది ఇతనే. తాజాగా రాజేశేఖర్ 'గురుడవేగ' సీఎం పీఏ పాత్రలో ఓ చిన్న పాత్రను కూడా వెంకట్ పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment