Banjarahills Police
-
కారు ఎవరిది..? డాక్యుమెంట్లు ఎవరి పేరున ఉన్నాయి..?
హైదరాబాద్: ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా దుర్భాషలాడిన సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్ జాన్‌బీని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. గత నెల 24న రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు గొడుగు విఘ్నేష్ కారులో ఓ యువతి రాంగ్రూట్లో వస్తుండగా అడ్డుకున్నాడు. . దీంతో రెచ్చిపోయిన ఆమె హోంగార్డు విఘ్నేష్ పై దాడి చేయడమేగాక దుస్తులు చించేసి అడ్డువచి్చన పోలీసులను కూడా దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న పోలీసులను ఆటంకం కలిగిస్తూ నోటికొచి్చనట్లు తిట్టడంతో పాటు న్యూసెన్స్‌కు కూడా పాల్పడింది. అదే రోజు రాత్రి హోంగార్డు విఘ్నేష్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతిని సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్జాన్బీగా గుర్తించి ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లి విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమెకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆమె తరపు న్యాయవాదులు పోలీసులకు చూపించారు. అప్పటికప్పుడు ఆమెకు 41ఏ నోటీసు ఇచ్చి రెండు గంటల పాటు విచారించారు. ఆ రోజు నడిపిన జాగ్వార్ కారు ఎవరిది, కారుకు సంబంధించిన డాక్యుమెంట్లను మూడు రోజుల్లో చూపించాలన్నారు. అలాగే మెడిసిన్ కోసం వెళుతున్నట్లుగా ఆమె చెప్పిందని, మెడిసిన్ ప్రిస్కప్షన్ కూడా చూపించాలని ఆదేశించారు. ఆ రోజు రాంగ్రూట్లో వెళ్లడానికి గల కారణం, పోలీసులపై ఎందుకు దుర్భాషలాడారు, హోంగార్డును ఎందుకు అడ్డుకున్నారు అన్న విషయాలపై ఆమెను ప్రశి్నంచారు. మొత్తం ఎనిమిది ప్రశ్నలు సంధించిన పోలీసులు వాటికి జవాబు ఇవ్వాలని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసులో సూచించారు. మూడు రోజుల్లో మరోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని, విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను ఆదేశించారు. నేను ఎవరిపైనా దాడి చేయలేదు అనంతరం సౌమ్యాజాను మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరిపై దాడి చేయలేదని తెలిపింది. ఆరోజు తాను నడిపిన జాగ్వార్ కారు తన స్నేహితులదని, తాను రాంగ్ రూట్లో వెళ్లిన మాట వాస్తవవేనని, తనది పొరపాటేనని తెలిపింది. తనపై మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, త్వరలో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. -
Sowmya Janu: నటి సౌమ్య జాను వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ నటికి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను రాంగ్ రూట్లో రావడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ హౌంగార్డ్ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ కేసుపై నటి సౌమ్య జాను హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సౌమ్యకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా మార్చి 11 లోపు పోలీసుల ఎదుట హాజరు కావాలని సౌమ్యకు హైకోర్ట్ సూచించింది. అసలేం జరిగిందంటే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడికి పాల్పడిందని సినీనటి సౌమ్యజానుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతనెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. -
HYD: ఎస్సై సార్ సాహసం.. ప్రాణాలకు తెగించి 16 మందిని కాపాడాడు
సాక్షి, హైదరాబాద్: మనిషికి సమయస్ఫూర్తితో పాటు ధైర్యసాహసాలు కూడా అవసరమే!. తన ప్రాణాలకు తెగించి మరీ ఇక్కడో ఎస్సై సార్.. పదహారు మంది ప్రాణాలను కాపాడారు. రియల్ హీరో అనిపించుకున్నారు. మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పదహారు మందిని డీసీఎంలో తరలిస్తుండగా.. ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనం నడుపుతున్న హోంగార్డు రమేష్‌కు ఫిట్స్ వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి.. డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. కిందకు దూకి ప్రాణాలకు తెగించి వాహనాన్ని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు, మరో కానిస్టేబుల్ సాయి కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎస్సై సార్ సాహసంతో 16 మంది ప్రమాదం నుంచి బయటపడగా.. గాయపడిన ఎస్సై కరుణాకర్‌ను, రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. -
బంజారాహిల్స్ రోడ్ నెం.45 ట్రాఫిక్ డైవర్షన్: కొనసాగించాలా..? ఎత్తేయాలా.?
బంజారాహిల్స్: ట్రాఫిక్ డైవర్షన్ వల్ల మీరు ఆనందంగా ఉన్నారా..? ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? ఈ డైవర్షన్‌ను ఇలాగే కొనసాగించాలా..? ఎత్తేయాలా..? అంటూ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై వాహనదారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత నెల 24న రోడ్ నెం.45లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పలు చోట్ల వాహనాల మళ్లింపు, ‘యూ’ టర్న్‌లు, జంక్షన్ల మూసివేత, అంతర్గత రహదారుల వినియోగం తదితర చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇవి కొంత మందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరి కొందరు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోలీసులు క్షేత్ర స్థాయిలో నేరుగా వాహనదారుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి వాహనదారులతో ముచ్చటిస్తున్నారు. ఈ రహదారులపై రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వాహనదారులను గుర్తించి వారి నుంచే అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, రోడ్ నెం. 36, ఫిలింనగర్ రోడ్ నెం.1, జర్నలిస్టు కాలనీ, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రతినిధులు వాహనదారులను ట్రాఫిక్ డైవర్షన్‌పై పలు కోణాల్లో ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నారు. వీటిని క్రోడీకరించి నగర పోలీస్ కమిషనర్‌కు నివేదిక అందించేందుకు సిద్ధమవుతున్నారు. నేడో, రేపో కమిషనర్‌కు ట్రాఫిక్ వెస్ట్‌జోన్ డీసీపీ ఈ నివేదికను అందించనున్నారు. మరో వైపు డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రాకపోకలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టకముందు, చేపట్టిన తర్వాత అనే రెండు కోణాల్లో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. వాహనదారులు ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తున్నది..? డైవర్షన్ వల్ల ఎంత సమయం ఆదా అవుతున్నది.. తదితర వివరాలను కూడా నివేదిక రూపంలో కమిషనర్‌కు అందించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు క్షేత్ర స్థాయి పరిశీలనతో కూడిన నివేదికను పరిశీలించిన తర్వాత నగర పోలీస్ కమిషనర్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ డైవర్షన్‌పై ఓ నిర్ణయాన్ని వెలువరించనున్నారు. కొనసాగించాలా..? వద్దా..? అన్నది వాహనదారుల అభిప్రాయాల ద్వారానే నిర్ణయించనున్నారు. -
కులం పేరుతో దూషించారు.. ప్రాణహానీ ఉంది: నిర్మాత ఫిర్యాదు
తాను నిర్మిస్తున్న సినిమాను వివిధ కారణాలతో ఆపేందుకు ప్రయత్నించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిసీ దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాలు.. నల్లకుంటలో నివసించే మంచాల ప్రమోద్(27) సినిమాలు నిర్మించేందకు గాను శ్రీనగర్ కాలనీకి వచ్చి సొంత బ్యానర్‌పై ‘కంటోన్మెట్ పోస్టాఫీస్’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నీకు ఎందుకంటూ బాల సతీష్, రాజేష్ చిలువురి అనే ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తూ తనను సినీ పరిశ్రమ నుంచి దూరం చేసేందుకు యత్నించడమే కాకుండా తన సినిమా నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తూ ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గణపతి కాంప్లెక్స్ వద్ద తనతో పాటు సహాయ దర్శకుడు బి. రవితేజపై కూడా కులం పేరుతో దుషించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సతీష్, రాజేష్ చిలువూరిలపై బంజారాహిల్స్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు
సాక్షి, బంజారాహిల్స్: దాడి కేసులో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైకి పెంపుడు కుక్కలను వదిలి భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని బంజారా గ్రీన్ కాలనీలో నివసించే సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రీ 2013లో రౌడీషీటర్ ఆరిఫ్ మోయినుద్దీన్‌కు తన ఇంటిని కిరాయికి ఇచ్చాడు. జాఫ్రీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆరిఫ్ ఆ ఇంటికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నించగా కోర్టులో జాఫ్రీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. రెండేళ్ల క్రితం ఆరీఫ్ కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇంటిని ఖాళీ చేసినా నకిలీ పత్రాలతో ఎలాగైనా కబ్జా చేయాలని పథకం వేశాడు. మంగళవారం అర్ధరాత్రి తన స్నేహితుడు రషీద్ బిన్ సయీద్ హందీతో పాటు మరో 15 మందితో కలిసి జాఫ్రీపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి పరారయ్యారు. చదవండి: (హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 86లోని శాయా కసీటా విల్లాలో ఉంటున్న ఆరీఫ్‌ను అరెస్టు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ డీఐ హఫీజుద్దీన్, ఎస్ఐ కె. ఉదయ్, కానిస్టేబుల్ డి.శేఖర్ తదితరులు వెళ్లారు. ఇంట్లో దాక్కున్న ఆరిఫ్ పోలీసులను అడ్డుకునేందుకు పెంపుడు కుక్కలను వారిపైకి వదిలాడు. వాటి బారి నుంచి తప్పించుకున్న పోలీసులు ఇంటి వెనక డోరు పగలగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో హందీతో పాటు మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం గాలింపు చేపట్టారు. -
నటి సహాయకురాలు మోసంతో మొదలైన డ్రామా
సాక్షి, సిటీబ్యూరో: నల్లకుంటకు చెందిన బిల్డర్ వెంకటేశం సినిమా తీయడం కోసం బెంగళూరు హీరోయిన్ని బుక్ చేసుకోవాలని ప్రయత్నించారు. ఓ మధ్యవర్తిని, ఆ నటి సహాయకురాలిని నమ్మి రూ.13.5 లక్షలకు మోసపోయాడు. దీన్ని రికవరీ చేయాల్సిన బాధ్యతల్ని బంజారాహిల్స్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ అమర్నాథ్రెడ్డికి అప్పగించాడు. చెన్నైకి చెందిన వారి ద్వారా రూ.10 లక్షలు వసూలు చేశాడు అమర్నాథ రెడ్డి. అందులో వారికి రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. అమర్నాథ్ రెడ్డి చెన్నై వాళ్లనూ మోసం చేశాడు. దాంతో ఈ డబ్బు రికవరీ కోసమే వచ్చిన నిందితులు అమర్నాథ్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు 10 గంటల్లోనే ఛేదించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం వెల్లడించారు. శ్రీనగర్‌కాలనీలో నివసించే కె.అమర్నాథ్ రెడ్డి సినీ రంగంలో మేకప్ ఆర్టిస్ట్, క్యాస్టింగ్ కోచ్, ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో కార్యాలయం ఉంది. ప్రతిరోజూ ఉదయం వెళ్లే ఆయన రాత్రి తిరిగి వస్తుంటారు. నల్లకుంట ప్రాంతానికి చెందిన ఎస్వీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యజమాని పి.వెంకటేశం ఓ చిత్రాన్ని నిర్మించాలని భావించారు. బెంగళూరుకు చెందిన నటిని ఇందులో హీరోయిన్గా బుక్ చేసుకోవడానికి జునైద్ అనే వ్యక్తిని సంప్రదించారు. ఇతగాడు ఆ నటి సహాయకురాలు అనుతో కలిసి వెంకటేశంను మోసం చేయాలని పథకం వేశాడు. గతేడాది అడ్వాన్సుగా రూ.13.5 లక్షలు తీసుకుని వెంకటేశంను బెంగళూరుకు పిలిపించారు. అక్కడ ఇతడిని ఓ హోటల్లో ఉంచి వాళ్లిద్దరూ డబ్బుతో ఉడాయించారు. ఈ సొమ్ము వసూలు చేసి పెట్టాల్సిందిగా వెంకటేశం తన స్నేహితుడైన అమర్నాథ్రెడ్డిని కోరారు. దీనికి అంగీకరించిన ఈయన చెన్నైకి చెందిన న్యాయవాది కుమారగురుకు విషయం చెప్పారు. ఆయన సహాయంతో బెంగళూరులోని హైరోడ్ పోలీసుస్టేషన్లో అను, జునైద్లపై ఫిర్యాదు చేశారు. వీరిపై మోసం కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు రూ.10 లక్షలు రికవరీ చేసి కోర్టులో డిపాజిట్ చేశారు. డబ్బు రికవరీ చేయిస్తే రూ.4 లక్షలు చెల్లించాలని అమర్నాథ్రెడ్డి-కుమార గురు మధ్య ముందే ఒప్పందం కుదిరింది. అయితే కోర్టు నుంచి ఈ డబ్బు తీసుకున్న అమర్నాథ్ రెడ్డి కుమార గురుకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని కుమార గురు తన స్నేహితులైన చెన్నై వాసులు ప్రదీప్ నటరాజన్, పాలూరు లోకేష్ కుమార్, ఎస్.జగదీష్, పీకే గణేష్ కుమార్‌కు చెప్పాడు. వాళ్లు కూడా అమర్నాథ్రెడ్డిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన లేదు. దీంతో హైదరాబాద్ వెళ్లి అమర్నాథ్రెడ్డిని కిడ్నాప్ చేసి తమకు రావాల్సిన డబ్బు వసూలు చేద్దామని ప్రదీప్ పథకం వేశాడు. గురువారం ఉదయం ఈ ఐదుగురితో పాటు ప్రదీప్ గర్ల్‌ఫ్రెండ్ కీర్తన కూడా కారులో నగరానికి వచ్చింది. వీళ్లంతా వనస్థలిపురంలోని హరణి వనస్థలి పార్క్‌లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. అక్కడ నుంచి మాదాపూర్‌లోని కావూరీ హిల్స్‌కు వెళ్లిన నిందితులు కీర్తన ద్వారా అమర్నాథ్రెడ్డిని ట్రాప్ చేశారు. అర్జంట్ పని ఉందని, కలవాలంటూ సందేశం పంపిన కీర్తన తన లైవ్ లోకేషన్‌ను పంపింది. ఆమెను కలవడానికి అక్కడకు వెళ్లిన అమర్నాథ్ రెడ్డిని నిందితులు పట్టుకుని ఆయన కారులోనే వనస్థలిపురంలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆయన బట్టలు విప్పి కిడ్నాపర్లు వీడియో చిత్రీకరించారు. బయటకు వెళ్లాక తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ క్లిప్పుల్ని సోషల్‌మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఆపై ప్రదీప్ ఫోన్ నుంచి అమర్నాథ్ రెడ్డి భార్య కల్పనకు ఫోన్ చేయించి రూ.4 లక్షలు ప్రదీప్ ఖాతాలో డిపాజిట్ చేయాలని చెప్పించారు. తనను ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారు చెప్పినట్లు చేయకపోతే చంపేస్తారంటూ అమర్నాథ్రెడ్డి చెప్పడంతో ఆందోళనకు గురైన కల్పన గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కిడ్నాపర్లను ట్రాప్ చేసి పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు ఆ మొత్తాన్ని వాళ్లే సిద్ధం చేశారు. డబ్బు ఫొటోలను కల్పన ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రదీప్‌కు పంపి, తీసుకోవడానికి శ్రీనగర్ కాలనీకి రమ్మని చెప్పారు. అక్కడ కాపు కాసిన పోలీసులు సాయంత్రం 6.30 గంటలకు అమర్నాథ్రెడ్డి కారులో వచ్చిన ప్రదీప్, కుమార గురు, లోకేష్‌లను గుర్తించారు. ఈ విషయం గుర్తించిన కిడ్నాపర్లలో ఇద్దరు పారిపోగా.. లోకేష్ చిక్కాడు. ఇతడిని విచారించిన అధికారులు దుండగులు వనస్థలిపురంలో బస చేసినట్లు తెలుసుకున్నారు. ఈ లోపు అప్రమత్తమైన నిందితులు అమర్నాథ్రెడ్డిని తీసుకుని తమ కారులో చెన్నైకు బయలుదేరారు. వెళ్తూ ఈ విషయాన్ని కల్పనకు ఫోన్ ద్వారా చెప్పి తక్షణం రూ.4 లక్షలు చెల్లించకుంటే అమర్నాథ్రెడ్డిని చంపేస్తామన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు నిందితుల కదలికల్ని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. వీళ్లు నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ అధికారులు తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో కారులో వెళ్తున్న కుమార గురు, జగదీష్, గణేష్‌లను రాత్రి 11 గంటలకు పట్టుకున్నారు. అప్పటికే ప్రదీప్, కీర్తన వీరి నుంచి వేరు పడి బస్సులో పరారయ్యారని గుర్తించారు. ఆ కారులో ఉన్న అమర్నాథ్రెడ్డిని రెస్క్యూ చేశారు. నిందుతుల్ని సిటీకి తరలించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి కారు తదితరాలు స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. -
కలకలం: పోలీసు అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా తిరుగుతుండటం కలకలం రేపింది. మూడ్రోజుల క్రితం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ అదనపు డీజీపీ రవిగుప్తా నివాసాలపైన డ్రోన్ కెమెరా ఐదారుసార్లు తిరగడాన్ని సిబ్బంది గుర్తించారు. ఓ పోలీసు ఉన్నతాధికారి సతీమణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి, పక్కింట్లో ఉన్న ఓ యువకుడు ఈ డ్రోన్‌ను వినియోగించినట్లు తేల్చారు. కెమెరా ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డ్రోన్‌ను ఇళ్లపై ఎందుకు తిప్పారు? ఏయే ఫొటోలు తీశారు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు రేణుకా చౌదదరి ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. -
మానవత్వం మంటగలిసిన వేళ
సాక్షి, హైదరాబాద్: చేతిలో చిల్లి గవ్వలేదు.. చుట్టాలకు చెప్పినా స్పందిస్తారనే ఆశ లేదు.. ఒకవైపు ఇంటి ఓనర్, చుట్టుపక్కలవారి వేధింపులు.. మరోవైపు ఏం చేయాలో పాలుపోని స్థితి.. దీం తో ఓ వ్యక్తి తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక పుట్‌పాత్ మీద మృతదేహాన్ని వదిలేసిన హృదయవిదారక ఘటన హైదరాబాద్ బంజా రాహిల్స్‌లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి గోనె సంచిని విప్పి చూడగా అందులో ఒక వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన భగీరథి (75)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నిజామాబాద్‌లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పెద్ద కుమారుడు దత్తు వద్ద ఆమె ఉండేది. అతడి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తన చిన్న కొడుకు రమేశ్ వద్దకు వారం క్రితం వచ్చింది. కుటుంబ కలహాల వల్ల రమేశ్ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆరు నెలల క్రితమే వెళ్లిపోయింది. రమేశ్ బంజారాహిల్స్‌లోని షాంగ్రిల్లా ప్లాజాలో వాచ్ మన్. నెల క్రితం బంజారాహిల్స్‌లోని షౌకత్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. వారం క్రితం తన తల్లిని గదికి తీసుకొచ్చాడు. కానీ, ఆమె అప్పటికే జ్వరంతో బాధపడుతోంది. ఐదురోజులుగా పలు రకాల మాత్రలు ఇస్తున్నప్పటికీ జ్వరం తగ్గకపోగా మరింత తీవ్రమైంది. దీంతో ఓనర్‌తోపాటు చుట్టుపక్కల వారు ఆమెకు కరోనా వచ్చి ఉంటుందేమో అంటూ పలు రకాలుగా ప్రశ్నలతో వేధించేవారు. ఇంతలోనే శనివారం అర్ధరాత్రి ఆమెకు శ్వాస ఆడటం ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో రమేశ్‌కు అర్థం కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కరోనా అంటే ఊళ్లోకి కూడా రానివ్వరు. ఇక్కడ కూడా అంత్యక్రియలు చేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని చుట్టాలకు చెప్పినా ఎవరూ సహకరించరేమోనని కలత చెంది బయట ఎక్కడైనా వదిలేస్తే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందనుకొని దుప్పటితో తన తల్లిని చుట్టేసి ముఖానికి గోనె సంచి తగిలించి బంజారాహి ల్స్ రోడ్ నంబర్ 2లోని లుంబినీ మాల్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్ మీద వదిలేశాడు. (చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు) లోతుగా దర్యాప్తు... కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముందుగా ఈమె యాచకురాలని భావించారు. ఆ తర్వాత విచారణ చేయగా ఆమె కొడుకు షౌకత్‌నగర్‌లో ఉంటున్నట్లు కనుక్కొని రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రమేశ్ చెప్తున్నది నిజమా కాదా అన్నది మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని బంజారాహిల్స్ సీఐ కళింగరావు తెలిపారు. -
సినీనటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సినీనటి రాధ ప్రశాంతిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. శబ్దం వినిపించడంతో స్థానికంగా ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటికి వచ్చి చూడగా... రాధ ప్రశాంతితో పాటు ఉన్న మరో వ్యక్తి ఆ మహిళపై దాడి చేస్తుండగా తన మొబైల్లో చిత్రీకరించారు. దీంతో సాప్ట్వేర్ ఇంజనీర్ మొబైల్ లాక్కొని ధ్వంసం చేసి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాధ ప్రశాంతితో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంజారాహిల్స్‌లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు
-
షేక్‌పేట భూ వివాదంలో సరికొత్త వ్యూహం
-
ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది
సాక్షి, సిటీబ్యూరో : ‘కుదిరితే కాసులు..లేకుంటే కోర్టు కేసులుగా..’ తయారైంది ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణ పరిస్థితి. హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖ అంటేనే ప్రభుత్వ భూములు...వాటి పరిరక్షణే ప్రధాన బాధ్యత. ఇక అత్యంత విలువ గల స్థలాలు కావడంతో అటూ అక్రమార్కులకు... ఇటు అధికారులకు కాసుల పంట పండుతోంది. తాజాగా వెలుగు చూసిన బంజారాహిల్స్ భూ వివాదంలో ఇరువర్గాల సరికొత్త వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఒకవైపు మధ్యంతర ఉత్తర్యులు అడ్డం పెట్టుకొని స్థలం సర్వే, ఆన్లైన్లో అప్డేట్కోసం ప్రయత్నించడం..మరోవైపు ఒక స్థలంపై ఫిర్యాదు చేసి అసలు వివాదాస్పద స్థలంపై బేరసారాలు నడిపి కాసులుదండుకుంటూ ఏసీబీ చేతిలో చిక్కక తప్పలేదు. ఏకంగా రూ.30 లక్షల డీల్ కుదుర్చుకొని రూ.15 లక్షలు తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం సంచలనం సృష్టించగా, తహసీల్దార్ సుజాత ఇంట్లో రూ.30 లక్షల నగదు, అరకిలో బంగారు నగలు ఏసీబీ అధికారులకు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఏసీబీ విచారణలో మరి కొందరి చేతివాటం కూడా వెలుగు చూడటం రెవెన్యూ యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, తహాసీల్దార్ సుజాతను కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. అమీర్‌పేట తహసీల్దార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. (షేక్‌పేట భూవివాదం కేసు : రూ.30 లక్షలు ఎక్కడివి?) ఇదీ కథ.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సర్వేనెంబర్ 129/59లో అత్యంత విలువగల 4,865 చదరపు గజాల భూమిపై గత రెండు దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీ మీరాలం మండికి చెందిన సయ్యద్ అబ్దుల్ ఖలీద్ అనే వ్యక్తి తన తండ్రి అబ్దుల్ రషీద్ 1969లో ఈ భూమిని కొనుగోలు చేశాడని పేర్కొంటుండగా.. అది ప్రభుత్వ స్థలమంటూ సివిల్ కోర్టు 1998లో తీర్పుచెప్పింది. దీనిపై అబ్దుల్ ఖలీద్ హైకోర్టును ఆశ్రయించి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు పొందారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నప్పటికి మధ్యంతర ఉత్తర్వులు ఆధారంగా తన భూమిని సర్వే చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని షేక్‌పేట్ రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆ భూమి వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. మరో స్థలంపై ఫిర్యాదు. వివాదాస్పద భూమి అయినా..కాసులు దండుకునేందుకు రెవెన్యూ అధికారులు అతితెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అసలు వివాదాస్పద స్థలాన్ని వదిలి..దాని పక్కన గల స్థలంపై ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఆశా హాస్పిటల్ దగ్గర వివాదాస్పద స్థలానికి సమీపంలోని సర్వే నెంబర్ 403/పీలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు అబ్దుల్ ఖలీద్ ప్రయత్నం చేశారని షేక్‌పేట తహసీల్దార్ ఏప్రిల్ 30న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సూచిక బోర్డునుసైతం తొలగించడంతో పాటు తమ సిబ్బంది అడ్డుకున్నప్పటికి పదేపదే తన సొంత భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. (ఎమ్మార్వో ఇంట్లో మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లు) కేసు తర్వాతనే అసలు కథ.. బంజారాహిల్స్‌లోని సర్వే నెంబర్ 403/పీలోని స్థలంపై ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది. ఒకవైపు పోలీసుల వత్తిడి పెరగడంతో అసలు వివాదాస్పద భూమి వ్యవహారంపై బేరసారాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసుల ఉచిత సలహాల కూడా ఉన్నట్లు సమాచారం. . దీంతో వివాదాస్పద స్థలానికి అన్ని విధాలుగా సహకరించేందుకు స్థలం విలువలో పది శాతం డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అధికారుల అత్యాశ ఫలితంగా పూర్తి స్థాయిలో వ్యవహరం చక్కబడకముందే బహిర్గతమైంది. ఇక ప్రభుత్వ భూములను పర్యవేక్షించాల్సిన వారే భక్షించడంపట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షేక్‌పేట తహసీల్దార్ అరెస్టు రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో అరెస్ట్ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయారని సమాచారం. మరోవైపు సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరికొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. -
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
-
షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూవివాదం కేసులో ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎమ్మార్వో సుజాతను అరెస్ట్ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో ఎమ్మార్వో సుజాతను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయరని సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ ఎస్సై రవి నాయక్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్ : షేక్‌పేట భూవివాదం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు తొమ్మిది గంటల విచారణ తర్వాత ఎమ్మార్వో సుజాతను ఇంటికి పంపించారు. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని పిలిచి అధికారులు వివరాలు సేకరించారు. (చదవండి : అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) మరోవైపు ఆర్ఐ నాగార్జున రెడ్డి విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో నాగార్జునరెడ్డిని రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్సై రవీంద్రనాయక్‌ను రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని 4865 గజాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్లను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ
-
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన షేక్‌పేట ఆర్ఐ
సాక్షి, హైదరాబాద్: రూ.15 లక్షల లంచం తీసుకుంటూ షేక్‌పేట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు యజమాని నుంచి ఆయన రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. బయానాగా రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆర్ఐ నాగార్జునను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే స్థల వివాదంలో ఆర్ఐ నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ కూడా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్సై రవీందర్‌ను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఒకటిన్నర ఎకరాల స్థల వివాదంలో వీరిద్దరూ లంచాలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఎస్సై రవీందర్‌పై ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. (చదవండడి: జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా) స్థల వివాదమిదే! బంజారాహిల్స్‌లో సయ్యద్ అబ్దుల్‌కు చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్దుల్ కోర్టుకెక్కారు. స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి సయ్యద్ అబ్దుల్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు సయ్యద్ అబ్దుల్పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ఐ నాగార్జున, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ 50 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. -
‘కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ, ఈ కేసు విచారణ అధికారి కేఎస్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ 16వ తేదీన కోడెల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్‌ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని కేఎస్ రావు తెలిపారు. దీనిపై నివేదిక వచ్చాక ఈ కేసులో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. -
బంజారాహిల్స్‌లో భారీ చోరీ
బంజారాహిల్స్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పనిమనిషి ఉన్నదంతా ఊడ్చుకుని పరారయ్యాడు. వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నం 12లోని అంకుర్ ఆస్పత్రి సమీపం లో వ్యాపారి కపిల్‌గుప్తా నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. తిరిగి సోమ వారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లిచూడగా బెడ్రూంలో బీరువా తాళాలు పగులగొట్టి ఉండటమే కాకుండా ఆభరణాల బాక్సులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. తమ ఇంట్లో నెలన్నర క్రితం బిహార్‌కు చెందిన రామ్(29) అనే వ్యక్తిని పనిమనిషిగా నియమించుకున్నామని పోలీసులకు తెలిపారు. పెళ్లికి వెళ్తూ ఇంటి బాధ్యతలను పనిమనిషికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించిన రామ్ బీరువాలోని రూ.5.70 లక్షల నగదు, రూ.కోటి విలువ చేసే బంగారు వజ్రాభరణాలను చోరీ చేసి ఇంటికి తాళంవేసి తాళం చెవులను గేటు వద్ద పెట్టి ఉడాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కపిల్‌గుప్తా మేనల్లుడు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకుని వెళ్లాడు. ఆ తర్వాతే చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు సదరు యజమాని తీసుకోలేదు. నిందితుడి ఫొటోలు కూడా యజమాని వద్దలేకపోవడంతో దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. -
స్నానం చేస్తున్న యువతిని వీడియో తీసి..
సాక్షి, హైదరాబాద్: బాత్రూంలో స్నానం చేస్తున్న యువతిని దొంగచాటుగా వీడియో తీస్తున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే....బంజారాహిల్స్ రోడ్ నంబరు2లోని శౌకత్నగర్లో నివసించే యూసఫ్ ఫారూక్ (19) మొబైల్ రిపేరర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఎదుటి ఇంట్లో యువతి (30) స్నానం చేస్తుండగా కిటికీ లోంచి సెల్ఫోన్లో ఆమెను వీడియో తీస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె గమనించింది. ఆందోళన చెందుతూ ఇంట్లోకి పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమెను నేను ప్రేమించా.. నువ్వెలా చేసుకుంటావ్?
సాక్షి, బంజారాహిల్స్ : ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో అతను తట్టుకోలేకపోయాడు. అతని అడ్డు తొలగిస్తే తాను పెళ్లి చేసుకోవచ్చని మిత్రుడితో కలిసి అతనిపై దాడిచేశారు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్లో నివసించే గోపాల్(22) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న యువతి(19) జూబ్లీహిల్స్‌లోని ఓ మెడికల్ షాపులో ఫార్మాసిస్టుగా పనిచేస్తోంది. కొంతకాలంగా గోపాల్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహంగానే ఉన్నారు. అయితే ఆ యువతికి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి కుదిర్చారు. మరో నాలుగు నెలల్లో పెళ్లి జరపాలని తీర్మానించారు. దీనిని గోపాల్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ప్రేమించిన యువతి మరొకరికి దక్కకూడదని రోజూ ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. కాబోయే భర్తను బెదిరించి అడ్డు తొలగిస్తే యువతి దక్కుతుందని జూబ్లీహిల్స్ దుర్గాభవాని నగర్లో నివసించే ఫుడ్ డెలివరీ బాయ్ అయిన తన స్నేహితుడు జీవన్(22)తో పథకం వేశాడు. ఇందులో భాగంగా యువతికి కాబోయే భర్తను కిడ్నాప్ చేసి బెదిరించి పెళ్లి వద్దనే విధంగా హెచ్చరించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి మద్యం తాగిన గోపాల్ దుర్గాభవానినగర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వేచివున్నాడు. పథకం ప్రకారం జీవన్ ఆ యువతికి కాబోయే భర్తను వెంటాడుతూ ఓ చోట లిఫ్ట్ కావాలని అడిగి నేరుగా తన స్నేహితుడు గోపాల్ ఉన్న చోటుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి అతనిని పిడిగుద్దులతో బాదారు. నా లవర్‌ను నువ్వెలా పెళ్లి చేసుకుంటావంటూ దాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటపడి కాలర్ పట్టుకుని ఆమెను వదిలేయకపోతే అంతు చూస్తానంటూ హెచ్చరించారు. వారి నుంచి తప్పించుకుని బాధితుడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న గోపాల్, జీవన్లను అర్థరాత్రి అరెస్టు చేశారు. వీరిపై 70(సీ) కింద కేసు నమోదు చేసి సోమవారం ఉదయం నాంపల్లి పదవ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులు ఇద్దరికీ మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కోడెల అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం 11.15 గంటలకు ఆయనను డ్రైవర్, గన్‌మెన్ బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు చికిత్స పొందుతూ కోడెల మృతి చెందారు. కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది ఆత్మహత్యనా? అనారోగ్యం కారణంగా మృతిచెందారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. చదవండి: సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
పోలీసుల అదుపులో కత్తి మహేశ్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్ ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ.. ఓ హిందూ దేవుడిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్య దైవాన్ని కత్తి మహేశ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారంటూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త కిరణ్ నందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్ 295(1), 505(2)ల కింద కేసు నమోదు చేసి కత్తి మహేశ్‌ను ఇంటి దగ్గర నుంచి అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆయనపై హైదరాబాద్ పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.