ఫిలింనగర్‌లోని ఓ అతిథిగృహంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు.
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని ఓ అతిథిగృహంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... విజయవాడకు చెందిన అప్పారావు, చంద్రశేఖర్‌నాయుడు, మస్తాన్‌రావు ఫిలింనగర్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో లగ్జరీ ఫ్లాట్‌ను ఐదు నెలలు క్రితం అద్దెకు తీసుకున్నారు. దేశంలోని వివిధ నగరాల నుంచి మోడల్స్‌ను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సదరు ఫ్లాట్‌పై దాడి చేశారు. బెంగళూర్‌కు చెందిన ఎయిర్‌హోస్టస్‌ను, భోపాల్, న్యూఢిల్లీలకు చెందిన ఇద్దరు మోడల్స్‌ను రెస్క్యూ చేశారు. ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. విటుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి ఉన్నట్టు తెలిసింది. యువతుల్ని రెస్కూహోమ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.