హైదరాబాద్ : హైదరాబాద్ పంజాగుట్టలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందంటూ పక్కా సమాచారం మేరకు పోలీసులు అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి భవనం మొదటి అంతస్తు పై నుంచి కిందకు దూకేసింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలు ముంబయికి చెందిన మోడల్గా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించటం వల్లే యువతి భవనం పై నుంచి దూకేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంజాగుట్టలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
Published Sat, Feb 8 2014 11:41 AM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM
Advertisement
Advertisement