అమ్మ తొందరపాటు వల్లే: స్వాతిరెడ్డి | now I concentrate on my career, says actress swathireddy | Sakshi
Sakshi News home page

అమ్మ తొందరపాటు వల్లే: స్వాతిరెడ్డి

Published Tue, Mar 1 2016 11:05 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

అమ్మ తొందరపాటు వల్లే: స్వాతిరెడ్డి - Sakshi

అమ్మ తొందరపాటు వల్లే: స్వాతిరెడ్డి

గుంటూరు : తన తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేదని  సినీ నటి స్వాతిరెడ్డి తెలిపింది. డబ్బు విషయంలోనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, అయితే తన తల్లి తొందరపాటు వల్లే ఇంత వ్యవహారం జరిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ఇక తన తండ్రి మరణంపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన గుండెపోటుతోనే చనిపోయారని తెలుసని చెప్పింది.

తాను పుట్టినప్పటి నుంచి  ఫాదర్ సైడ్ వాళ్లతో ఎలాంటి సంబంధాలు లేవని స్వాతిరెడ్డి తెలిపింది. ఇప్పుడు కూడా ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సినిమాలపై దృష్టి పెడతానని స్వాతిరెడ్డి చెప్పింది. ఇకపై ఎలాంటి వివాదాలు లేకుండా తన తల్లికి దూరంగా ఒంటరిగా ఉంటానని తెలిపింది. కాగా స్వాతిరెడ్డి తల్లి నాగేంద్రమ్మ... తన కుమార్తె కిడ్నాప్ అయినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరు ఘర్షణకు దిగారు. చివరకు పోలీసులు కల్పించుకుని తల్లీకూతుళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement