nagendramma
-
అమ్మ తొందరపాటు వల్లే: స్వాతిరెడ్డి
గుంటూరు : తన తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేదని సినీ నటి స్వాతిరెడ్డి తెలిపింది. డబ్బు విషయంలోనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, అయితే తన తల్లి తొందరపాటు వల్లే ఇంత వ్యవహారం జరిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ఇక తన తండ్రి మరణంపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన గుండెపోటుతోనే చనిపోయారని తెలుసని చెప్పింది. తాను పుట్టినప్పటి నుంచి ఫాదర్ సైడ్ వాళ్లతో ఎలాంటి సంబంధాలు లేవని స్వాతిరెడ్డి తెలిపింది. ఇప్పుడు కూడా ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సినిమాలపై దృష్టి పెడతానని స్వాతిరెడ్డి చెప్పింది. ఇకపై ఎలాంటి వివాదాలు లేకుండా తన తల్లికి దూరంగా ఒంటరిగా ఉంటానని తెలిపింది. కాగా స్వాతిరెడ్డి తల్లి నాగేంద్రమ్మ... తన కుమార్తె కిడ్నాప్ అయినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరు ఘర్షణకు దిగారు. చివరకు పోలీసులు కల్పించుకుని తల్లీకూతుళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
నా కూతురితో రాజీ కుదిరింది
సినీ నటి తనూష తల్లి నాగేంద్రమ్మ బంజారాహిల్స్ : తన కూతురికి తనకు మధ్య రాజీ కుదిరిందని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తాము ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నామని సినీ నటి తనూష అలియాస్ స్వాతిరెడ్డి తల్లి కె.నాగేంద్రమ్మ వెల్లడించారు. ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... చిన్నచిన్న అభిప్రాయ భేదాల వల్ల తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. స్వాతికి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో భయపడి కేసు పెట్టానని, అంతకుమించి తన కూతురిపై ఎలాంటి కోపం లేదని నాగేంద్రమ్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం స్వాతి హీరో సచిన్‌జోషి పక్కన హీరోయిన్గా నటిస్తోందని, రెండు రోజుల్లో ఆ సినిమా షూటింగ్‌కు హాజరవుతుందన్నారు. -
తల్లితో నటి తనూష లొల్లి
♦ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీనటి తనూష తల్లి ఫిర్యాదు ♦ నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు..డబ్బు కోసమే ఆరోపణలు: తనూష హైదరాబాద్: గుంటూరుకు చెందిన యువ వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ పల్సర్ తన కూతురును కిడ్నాప్ చేశారని సినీనటి తనూష అలియాస్ స్వాతిరెడ్డి తల్లి కె.నాగేంద్రమ్మ బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. అయితే, డబ్బులు ఇవ్వడంలేదనే కోపంతోనే తల్లే.. రాద్ధాంతం చేస్తోందంటూ స్వాతి పేర్కొంది. స్వాతి మూడేళ్ల నుంచి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోందని, ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం శ్రీనివాస్‌రెడ్డి పరిచయమయ్యారని, అప్పటి నుంచి కూతురి ప్రవర్తన మారి పోయిందని, పలు రకాలుగా లోబర్చుకున్నారని, ఆయనకు పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని నాగేంద్రమ్మ పేర్కొంది. ఈ నెల 25న అర్ధరాత్రి శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటికి వచ్చి స్వాతిని కిడ్నాప్ చేశారని, తన కూతురును రక్షించి అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసుకొని శుక్రవారం విచారిస్తున్న పోలీసుల ముందు స్వాతిరెడ్డి ప్రత్యక్షమైంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనంతట తానే వెళ్లిపోయానని పోలీసులకు వివరించింది. శ్రీనివాస్‌రెడ్డి ఎవరో తనకు తెలియదని, డబ్బులు ఇవ్వకపోవడంతో లేనిపోని ఆరోపణలు చేస్తోందని తల్లిపైనే ఫిర్యాదు చేసింది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, లెజెండ్, ప్రెజెంట్ లవ్ తదితర సినిమాల్లో హీరోయిన్గా నటిం చానని, పారితోషికం తెచ్చి ఇవ్వలేదన్న కోపంతోనే ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. నాగేంద్రమ్మ, స్వాతి పరస్పర ఆరోపణలతో స్టేషన్ ఆవరణ దద్దరిల్లింది. రూ.15 లక్షలు ఇవ్వలేదన్న కారణంగా కన్న కూతురుపైనే అభాండాలు వేస్తున్నావా అంటూ స్వాతి తల్లిపై దాడికి పాల్పడింది. పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీ సులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి ముగ్గురు మృతి
నీరు తాగటానికి బావిలోకి దిగి జారిపడ్డ భర్తను రక్షించబోయి భార్య కూడా పడిపోయింది. వారిని కాపాడేందుకు యత్నించిన మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం మాధవరం సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొరకుప్పల కోటయ్య(50), నాగేంద్రమ్మ(45) దంపతులు తమ గొర్రెలను తోలుకుని బుధవారం మాధవరం సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. సాయంత్రం సమయంలో కోటయ్య మంచినీరు తెచ్చేందుకని సమీపంలోని నేలబావిలోకి దిగాడు. అయితే, కాలుజారి నీటిలో పడిపోయిన కోటయ్య కేకలు వేయటంతో నాగేంద్రమ్మ వచ్చి భర్తను రక్షించేందుకు చీర కొంగును అందించింది. కోటయ్యను పైకి లాగే క్రమంలో నాగేంద్రమ్మ కూడా పడిపోయింది. వారి కేకలు విని సమీపంలోనే ఉన్న మాధవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(60) పరుగున అక్కడికి చేరుకుని, రక్షించేక్రమంలో అతడు కూడా పట్టుతప్పి నీళ్లలో పడిపోయాడు. ముగ్గురూ నీట మునిగి చనిపోయారు. గురువారం ఉదయం వరకు వారి జాడ లేకపోవటంతో కుటుంబసభ్యులు వెతకగా.. బావిలో వారి శవాలు తేలియాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో హైస్కూల్ హెచ్ఎం
సత్తెనపల్లి (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.10 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ వలలో చిక్కారు. వివరాలు.. జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ నిధులతో వంటగది నిర్మించారు. ఇందుకు సంబంధించి ఒక లక్షా యాభై వైల రూపాయల చెక్కు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో కాంట్రాక్టర్ వంకాయలపాటి శ్రీనివాసరావు కృష్ణాజిల్లా ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణను ఆశ్రయించారు. వల పన్నిన ఏసీబీ అధికారులు ప్రధానోపాధ్యాయురాలు కె. నాగేంద్రమ్మ పాఠశాలలో కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ, ఇతర అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ మీడియాకు చెప్పారు.