తల్లితో నటి తనూష లొల్లి | upcoming actress swathi reddy mother complaint against her daughter | Sakshi
Sakshi News home page

తల్లితో నటి తనూష లొల్లి

Published Sat, Feb 27 2016 10:15 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

తల్లితో నటి తనూష లొల్లి - Sakshi

తల్లితో నటి తనూష లొల్లి

♦ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీనటి తనూష తల్లి ఫిర్యాదు
♦ నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు..డబ్బు కోసమే ఆరోపణలు: తనూష
 
 హైదరాబాద్: గుంటూరుకు చెందిన యువ వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ పల్సర్ తన కూతురును కిడ్నాప్ చేశారని సినీనటి తనూష అలియాస్ స్వాతిరెడ్డి తల్లి కె.నాగేంద్రమ్మ బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. అయితే,  డబ్బులు ఇవ్వడంలేదనే కోపంతోనే తల్లే.. రాద్ధాంతం చేస్తోందంటూ స్వాతి పేర్కొంది. స్వాతి మూడేళ్ల నుంచి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోందని, ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం శ్రీనివాస్‌రెడ్డి పరిచయమయ్యారని, అప్పటి నుంచి కూతురి ప్రవర్తన మారి పోయిందని, పలు రకాలుగా లోబర్చుకున్నారని, ఆయనకు పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని నాగేంద్రమ్మ పేర్కొంది.

ఈ నెల 25న అర్ధరాత్రి శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటికి వచ్చి స్వాతిని కిడ్నాప్ చేశారని, తన కూతురును రక్షించి అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసుకొని శుక్రవారం విచారిస్తున్న పోలీసుల ముందు స్వాతిరెడ్డి ప్రత్యక్షమైంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనంతట తానే వెళ్లిపోయానని పోలీసులకు వివరించింది. శ్రీనివాస్‌రెడ్డి ఎవరో తనకు తెలియదని, డబ్బులు ఇవ్వకపోవడంతో లేనిపోని ఆరోపణలు చేస్తోందని తల్లిపైనే ఫిర్యాదు చేసింది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, లెజెండ్, ప్రెజెంట్ లవ్ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటిం చానని, పారితోషికం తెచ్చి ఇవ్వలేదన్న కోపంతోనే ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. నాగేంద్రమ్మ, స్వాతి పరస్పర ఆరోపణలతో స్టేషన్ ఆవరణ దద్దరిల్లింది. రూ.15 లక్షలు ఇవ్వలేదన్న కారణంగా కన్న కూతురుపైనే అభాండాలు వేస్తున్నావా అంటూ స్వాతి తల్లిపై దాడికి పాల్పడింది. పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీ సులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement