నా కూతురితో రాజీ కుదిరింది | Tanusha actress mother nagendramma | Sakshi
Sakshi News home page

నా కూతురితో రాజీ కుదిరింది

Published Mon, Feb 29 2016 12:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

Tanusha actress mother nagendramma

సినీ నటి తనూష తల్లి నాగేంద్రమ్మ
 
బంజారాహిల్స్ : తన కూతురికి తనకు మధ్య రాజీ కుదిరిందని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తాము ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నామని సినీ నటి తనూష అలియాస్ స్వాతిరెడ్డి తల్లి కె.నాగేంద్రమ్మ వెల్లడించారు. ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... చిన్నచిన్న అభిప్రాయ భేదాల వల్ల తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు.

స్వాతికి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో భయపడి కేసు పెట్టానని, అంతకుమించి తన కూతురిపై ఎలాంటి కోపం లేదని నాగేంద్రమ్మ స్పష్టం చేశారు.  ప్రస్తుతం స్వాతి హీరో సచిన్‌జోషి పక్కన హీరోయిన్‌గా నటిస్తోందని, రెండు రోజుల్లో ఆ సినిమా షూటింగ్‌కు హాజరవుతుందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement