
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్‌మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది.
కోడెల అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం 11.15 గంటలకు ఆయనను డ్రైవర్, గన్‌మెన్ బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు చికిత్స పొందుతూ కోడెల మృతి చెందారు. కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది ఆత్మహత్యనా? అనారోగ్యం కారణంగా మృతిచెందారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
చదవండి: సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!
కోడెల శివప్రసాదరావు కన్నుమూత