Basavatarakam Hospital
-
ఆపదలో అముద.. కేన్సర్ బారినపడిన దీనురాలు.. సాయం చేయండి ప్లీజ్!
కోదాడ: అముద ఆపదలో ఉంది.. ఒకప్పుడు చెత్తకుప్పల మధ్య తిరిగిన ఆమె.. అటెండర్ ఉద్యోగం వరకు ఎదిగింది. అయితే ఇప్పుడు కేన్సర్ బారినపడి మృత్యువు ముంగిట మరో జీవన్మరణ పోరాటం చేస్తోంది. నాడు ఆమెను ఆదరించి అండగా నిలిచిన నిరుపేద వెంకటేశ్వర్లుకు అముదకు చికిత్స చేయించే స్థోమత లేక సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరీ అముద.. పది సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో మతిస్థిమితం కోల్పోయి.. చెత్త కుప్పల మధ్య తిరుగుతున్న ఉన్న ఓ యువతిని.. సమీపంలో చెప్పులు కుట్టుకొని జీవిస్తున్న నిరుపేద వెంకటేశ్వర్లు చూసి ఆదరించి మంచి మనిషిగా మార్చారు. సొంత బిడ్డలా చూసుకుంటూ అండగా నిలిచారు. ఆమె మంత్రి హరీశ్‌రావు చొరవతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. అముద గురించి ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనాలను చూసిన ఒకరు ఇటీవలే ఈమె జీవితాన్ని సినిమాగా తీస్తున్నారు. కాగా, అనారోగ్యంతో ఉద్యోగానికి వెళ్లలేకపోవడంతో మార్కెట్ కమిటీ అముద జీతం నిలిపి వేసింది. దీంతో ఆమె కష్టాలు తీవ్రమయ్యాయి. జ్వరం వచ్చిందని వెళితే.. నెల రోజుల క్రితం వరకు బాగానే ఉన్న అముదకు ఇటీవల జ్వరం రావడంతో వెంకటేశ్వర్లు ఆమెను కోదాడ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని చెప్పడంతో.. ఓ డాక్టర్‌కు చూపించారు. ఆయన కేన్సర్ సోకిందనే అనుమానంతో బసవతారకం ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కేన్సర్ సోకిందని నిర్ధారించడంతోపాటు వెంటనే చికిత్స చేయించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పడంతో వెంకటేశ్వర్లు అముదను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నా.. కొద్ది రోజుల్లోనే ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద అయిన వెంకటేశ్వర్లు అముద చికిత్సకు చేయూతనందించాలని దాతలను కోరుతున్నారు. దాతలు అముద అకౌంట్‌కు తమకు తోచినంత డబ్బు పంపితే ఆమె బతుకుతుందని అంటున్నారు. పల్లె అముద నారాయణ నాడర్ అకౌంట్ నంబర్: 6247 8971579 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 0020181 ఫోన్: 93915 42070 -
శివరామ్ విచారణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్‌ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. బసవతారకం ఆస్పత్రి వైద్యురాలికి చివరి కాల్.. హైదరాబాద్‌లో కోడెల ఉరి వేసుకున్న గదిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా వినియోగిస్తున్న మందులను వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. అదే సమయంలో కోడెల పర్సనల్ మొబైల్ సెల్‌ఫోన్ ఎక్కడుంది? దాన్ని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆత్మహత్యకు ముందు ఆ ఫోన్‌తో ఆయన ఎవరితో మాట్లాడారు? ఫోన్ దొరికితే గుట్టు రట్టవుతుందని ఎవరైనా భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కాల్‌డేటా రికార్డర్ యాప్ (సీడీఆర్ఏ)తో కాల్‌లిస్ట్‌ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యురాలికి ఫోన్ చేసి 24 నిమిషాలు మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఆ డాక్టరును విచారించాలని నిర్ణయించారు. కేబుల్ వైరుతో ఉరి.. పోస్టుమార్టం నివేదిక కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ నివేదికను బుధవారం పోలీసులకు అందించారు. మెడకు కేబుల్ వైరు బిగించుకోవడం ద్వారానే మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడెల గొంతు భాగంలో ఎనిమిది అంగుళాల పొడవుతో మచ్చ ఉందని తెలిపారు. ముందుగా తన పంచెను చింపి తాడుగా చేసుకుని ఉరి వేసుకోవాలని కోడెల ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో గదిలో ఉన్న కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నారని తెలిపారు. 12 మందిని విచారించాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్‌మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్మెంట్ కీలకం కానుందని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామన్నారు. ముగిసిన కోడెల అంత్యక్రియలు నరసరావుపేట/నరసరావుపేటటౌన్: అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు టీడీపీ కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు. నరసరావుపేట కోటలోని కోడెల నివాసం నుంచి స్వర్గపురి వరకు సాగిన కోడెల అంతిమయాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, లోకేష్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కోడెల భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం కోటలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చంద్రబాబు వచ్చి నివాళులర్పించి అంతియాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శామ్యూల్ కోడెల కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు నిరాకరించారు. కోడెల చితికి శాస్త్రోక్తంగా ఆయన కుమారుడు శివరామకృష్ణ నిప్పంటించి అంతిమ సంస్కారం నిర్వహించారు. కోడెల అంతిమయాత్రలో ప్రతిపక్షనేత చంద్రబాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత.. కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అంతిమయాత్ర సాగనీయకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం మీదుగా తీసుకెళ్లాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు అడ్డు చెప్పారు. అంతిమయాత్ర మల్లమ్మసెంటర్కు చేరిన అనంతరం తిరిగి ఉచ్చయ్య,పెంటయ్య వీధి గుండా స్వర్గపురికి వెళ్లాల్సి ఉంది. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి , డీఎస్పీ వీరారెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని ముందస్తు రూట్ మ్యాప్ ప్రకారం వాహనాన్ని మళ్లించారు. సంబంధిత కథనాలు.. ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
పోస్ట్‌మార్టం నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్ రావు
-
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
-
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అర్ధంతర మృతి.. ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలు కథనాలు, వదంతులతో అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారా? లేక మరేదైనా కారణముందా?.. ప్రస్తుతం అందరినీ తొలస్తున్న ప్రశ్నలివే. కోడెల శివప్రసాదరావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. లేదు, డాక్టర్ అయిన కోడెల ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకొని.. ఆత్మహత్య చేసుకున్నారని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. అసలు ఆదివారం రాత్రి కోడెల ఇంట్లో ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. రెండ్రోజుల కిందటే కోడెల హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చారని సన్నిహితులు చెప్తున్నారు. కొడుకు శివరాం పిలువడం వల్లే ఆయన హైదరాబాద్ వచ్చారని అంటున్నారు. కోడెలకు, ఆయన తనయుడికి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ప్రచారమూ సాగుతోంది. అయితే ఆయన కుమారుడు శివరాం విదేశీ పర్యటనలో ఉన్నారని, రేపు ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. కోడెల పిరికివారు కాదు.. రెండు రోజులుగా కోడెలకు-ఆయన కొడుకుకు మధ్య గొడవ జరిగిందని, తండ్రి కోడెలపై కొడుకు చేయి చేసుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కోడెల ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని చెప్తున్నారు. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం కోడెలది ఆత్మహత్య కాకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుడు, వృత్తిరీత్యా వైద్యుడు అయిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు అంటున్నారు. కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు! కోడెల ఆకస్మిక మృతి వ్యవహారంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారా? అన్నది ఒక ప్రశ్న కాగా.. ఆదివారం రాత్రి కోడెలను బసవతారకం ఆస్పత్రిలో చేర్పించిందెవరు? అనేది మరో ప్రశ్న. అంతేకాకుండా కోడెల కోడుకు బసవతారకం ఆస్పత్రికి రాలేదని తెలుస్తోంది. తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నా కొడుకు ఎందుకు రాలేదు? ప్రస్తుతం కోడెల కొడుకు ఎక్కడ ఉన్నాడు? తండ్రి మృతి విషయం అతనికి తెలుసా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోడెలను అత్యవసరంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి సమీపంలో ఉంది. అయినా నిమ్స్ ఆస్పత్రిలో కాకుండా బసవతారకం ఆస్పత్రికి ఆయనను ఎందుకు తరలించారో తెలియాల్సి ఉంది. మొత్తానికి కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో మృతి చెందారా? అన్నది పోస్టుమార్టం నివేదికతో వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. అయితే పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది. -
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కోడెల అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం 11.15 గంటలకు ఆయనను డ్రైవర్, గన్‌మెన్ బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు చికిత్స పొందుతూ కోడెల మృతి చెందారు. కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది ఆత్మహత్యనా? అనారోగ్యం కారణంగా మృతిచెందారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. చదవండి: సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
మాజీ స్పీకర్ కోడెల మృతి
-
కోడెల శివప్రసాదరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. ఆయన 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్ విజయలక్ష్మీ ఉన్నారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం గమనార్హం. కొడుకు శివరాంతో గొడవ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారనే కథనాలు వెలువడుతున్నాయి. వృత్తిరిత్యా డాక్టర్ అయిన కోడెల 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోడెల.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. కోడెల ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, ఎన్టీఆర్ హయాంలో కేబినెట్ మంత్రిగా, హోంమంత్రిగా సేవలందించారు. కోడెల అనుమానాస్పద మృతి కారణంగా గుంటూరు జిల్లా నరసారావుపేట డివిజన్లో 144 సెక్షన్ విధించారు. ముందుజాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి : సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!) కేసీఆర్ సంతాపం.. కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు. ఉపరాష్ట్రపతి విచారం.. కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’అని ట్విటర్లో పేర్కొన్నారు. -
బసవతారకం కిట్ల పంపిణీ పై హైకోర్టు సీరియస్
-
భారతీయులకు ఇమ్యునోథెరపీతో మేలు
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌కు ఎన్నో కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా.. భారతీయ రోగుల విషయంలో ఇమ్యునోథెరపీ (రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి కేన్సర్ కణాలను నాశనం చేసేలా చేయడం) ఎక్కువ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ కేన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యాధి బాగా ముదిరినా ఇమ్యునోథెరపీ ద్వారా పరిస్థితిని చక్కదిద్దే అవకాశముందని చెప్పారు. కేన్సర్‌కు ఒకప్పుడు రేడియేషన్ లేదా కీమోథెరపీ, శస్త్రచికిత్సల ద్వారా చికిత్స చేసేవారని పేర్కొన్నారు. ఐదారేళ్లుగా అమెరికాతో పాటు యూరప్‌లోనూ అందుబాటులో ఉన్న ఇమ్యునోథెరపీకి రేడియేషన్‌ను జోడించడం ద్వారా కొన్ని రకాల కేన్సర్లను దీర్ఘకాలం పాటు రాకుండా చేయొచ్చని వివరించారు. కణితులున్న చోటే రేడియోధార్మికతను అందించడం ద్వారా చేసే బ్రాకియాథెరపీలోనూ కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పుడు బసవతారకం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి వచ్చిందని, ఆరోగ్యకరమైన అవయవాలకు ఇబ్బంది కలగకుండానే మెరుగైన చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ చికిత్సను మరిన్ని ఎక్కువ రకాల కేన్సర్ల చికిత్సకు వాడేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బ్రెజిల్ వైద్య సమాఖ్యతో భాగస్వామ్యం కేన్సర్ రోగులకు మరిన్ని ఎక్కువ చికిత్స పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు బ్రెజిల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అసోసియేషన్‌తో కలసి పనిచేయనున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ టి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. హైపెక్ కీమో చికిత్స ద్వారా వివిధ చికిత్సల తర్వాత శరీరంలో మిగిలి ఉండే అతిసూక్ష్మమైన కణితులు, కేన్సర్ కణాలను తొలగించవచ్చన్నారు. ఇమ్యునోథెరపీ వల్ల వచ్చే దుష్పరిణామాల నియం త్రణకు అవసరమైన సాంకేతికత కూడా అందుబాటులో ఉందని చెప్పారు. -
చండీ మహాయాగంలో పాల్గొన్న బాలకృష్ణ
హైదరాబాద్ : లోక కల్యాణార్థం, సకల సౌభాగ్యాలు కాంక్షిస్తూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన చండీ మహాయాగంలో ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణలోని విజయగణపతి స్వామి ఆలయంలో ఈ నెల17వ తేదీన ప్రారంభమైన చండీయాగం శనివారంతో ముగిసింది. ఇందులో భాగంగా బాలకృష్ణ పాల్గొని మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి చండీ రుద్రహోమం, చంద్రమౌళీశ్వరస్వామికి అభిషేకం జరిగాయి. మహాపూర్ణాహుతి అనంతరం బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. -
కొత్త ప్రయోగంతో తీరని కష్టాలు..
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం. బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12లోని అగ్రసేన్ చౌక్‌లో కళింగ చౌరస్తాలో ట్రాఫిక్ జాం అవుతోందంటూ చేపట్టిన ప్రయోగం వాహనదారులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. అగ్రసేన్ చౌరస్తాలోని రోడ్‌నంబర్-12 వైపు రోడ్డును బారికేడ్లతో మూసివేయటంతో వాహన చోదకులు కిలోమీటర్ దూరంలో ఉన్న బసవతారకం ఆస్పత్రి చౌరస్తా వరకు వెళ్లి యూటర్న్ చేసుకొని టీఆర్ఎస్ భవన్ మీదుగా రోడ్ నంబర్-12 వైపు వెళ్తున్నారు. అందుకు పావుగంట సమయం పడుతోంది. ఎప్పటిలాగే వాహనాలు అగ్రసేన్చౌక్ నుంచి బసవతారకం ఆస్పత్రి వరకు నిలిచిపోతున్నాయి. ఎందుకంటే బసవతారకం చౌరస్తాలో పీవీ నర్సింహారావు విగ్రహం ఉన్న ఐలాండ్ చాలా పెద్దది. దీని చుట్టూ పెద్ద వాహనాలు తిరగటానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ఇంకోవైపు గణేష్ టెంపుల్, ఐలాండ్‌తో పాటు సెంట్రల్మీడియన్ కూడా ఉండటం వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంది. ఎటు చూసినా ఇక్కడ వాహనాలు మళ్లడం కష్టం కావటంతో సహజంగానే వెనుక వస్తున్న వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకు పోతున్నాయి. అగ్రసేన్ చౌక్‌లో నలుగురు ట్రాఫిక్ పోలీసులను విధుల్లో ఉంచితే ఇక్కడ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. అయితే చలానాలు రాయడానికి మాత్రమే పోలీసులను వినియోగిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు వాహనదారుల నియంత్రణ ఏమాత్రం పట్టడం లేదు. ఇప్పటికైనా ట్రాఫిక్ ఉన్నతాధికారులు కలుగజేసుకుని అగ్రసేన్ చౌక్, బసవతారకం చౌరస్తాల్లో ఐలాండ్ల నిడివిని, సెంట్రల్ మీడియన్లను కుదించాలి. అప్పుడే ఇక్కడ వన్‌వే ప్రయోజనకరంగా ఉంటుందని వాహనదారులు అంటున్నారు. -
బసవతారకం ఆస్పత్రికి రూ.5.72 కోట్లు మాఫీ
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, ఏపీ టీడీపీ ముఖ్యనేత నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అంతర్భాగంగా నిర్మించిన ఓ అక్రమ భవనం క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన రూ.5.72 కోట్లకు మినహాయింపు ఇచ్చింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేన్సర్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామన్న ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తిని ‘ప్రత్యేక కేసు’ కింద పరిగణిస్తూ ఈ మినహాయింపు ఇస్తూ... పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్, అమెరికాకు చెందిన ఇండో-అమెరికన్ కేన్సర్ ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలోని ఈ ఆస్పత్రి లాభాపేక్ష లేని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌గా హైదరాబాద్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 కార్యాలయంలో నమోదైంది. భవనాల క్రమబద్ధీకరణ కోసం 2008లో నాటి ప్రభుత్వం బీపీఎస్‌ను ప్రవేశపెట్టగా... ఈ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన ఓ అనధికార కట్టడాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు చెల్లించిన రూ.లక్ష పోగా రూ.5.72 కోట్లను క్రమబద్ధీకరణ కోసం చెల్లించాలని అప్పట్లో జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరింది. అయితే ఈ చార్జీలను మినహాయించాలని ఆస్పత్రి యాజమాన్యం 2011 అక్టోబర్ 12న ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ సీఎం కేసీఆర్‌ను కలసి చార్జీలను మినహాయించాలని, పెండింగ్ బీపీఎస్ దరఖాస్తును పరిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నేతృత్వంలోని అధ్యయన కమిటీ ఆస్పత్రిని సందర్శిం చి... అక్కడి వైద్యసేవలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా క్రమబద్ధీకరణ చార్జీలను ప్రభుత్వం మినహాయించింది.