
(ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : లోక కల్యాణార్థం, సకల సౌభాగ్యాలు కాంక్షిస్తూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన చండీ మహాయాగంలో ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
ఆస్పత్రి ఆవరణలోని విజయగణపతి స్వామి ఆలయంలో ఈ నెల17వ తేదీన ప్రారంభమైన చండీయాగం శనివారంతో ముగిసింది. ఇందులో భాగంగా బాలకృష్ణ పాల్గొని మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి చండీ రుద్రహోమం, చంద్రమౌళీశ్వరస్వామికి అభిషేకం జరిగాయి. మహాపూర్ణాహుతి అనంతరం బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.