టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను చంపేస్తానంటూ బెదిరించిన 17 ఏళ్ల నెల్లూరు యువకుడిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని హైదరాబాద్కు తరలించారు. గతంలో అతడు మంత్రి ఆనం రామనారాణ రెడ్డిని బెదిరించినట్టు సమాచారం. ఫోన్ చేసి అమ్మాయిలను వేధిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
కేసీఆర్ను చంపేస్తామంటూ టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్కు కొద్ది రోజుల క్రితం ఒక బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఎర్ర స్కెచ్ పెన్నుతో రాసిన ఈ లేఖలో కేసీఆర్ను కాల్చి చంపేస్తామంటూ హెచ్చరించారు. ‘కేసీఆర్.. యూ విల్ బి షాట్‌డెడ్ విత్ ఇన్ 10 డేస్ ( కేసీఆర్.. పది రోజుల్లో నిన్ను కాల్చి చంపుతాం) అని ఎరుపు రంగు స్కెచ్‌పెన్‌తో రాశారు. ఆ లేఖ ప్రతులను మీడియాకు కూడా టీఆర్ఎస్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్కు ప్రాణహాని ఉందంటూ టీఆర్ఎస్ నేతలు గవర్నర్ నరసింహన్, డీజీపీ దినేష్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు బెదిరింపు లేఖ రాసిన యువకున్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
కేసీఆర్ను బెదిరించిన యువకుడి అరెస్ట్
Published Fri, Aug 30 2013 12:20 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement