
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు రేణుకా చౌదదరి ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment