
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా తిరుగుతుండటం కలకలం రేపింది. మూడ్రోజుల క్రితం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ అదనపు డీజీపీ రవిగుప్తా నివాసాలపైన డ్రోన్ కెమెరా ఐదారుసార్లు తిరగడాన్ని సిబ్బంది గుర్తించారు. ఓ పోలీసు ఉన్నతాధికారి సతీమణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి, పక్కింట్లో ఉన్న ఓ యువకుడు ఈ డ్రోన్‌ను వినియోగించినట్లు తేల్చారు. కెమెరా ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డ్రోన్‌ను ఇళ్లపై ఎందుకు తిప్పారు? ఏయే ఫొటోలు తీశారు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment