
సాక్షి, హైదరాబాద్: బాత్‌రూంలో స్నానం చేస్తున్న యువతిని దొంగచాటుగా వీడియో తీస్తున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే....బంజారాహిల్స్ రోడ్ నంబరు2లోని శౌకత్‌నగర్‌లో నివసించే యూసఫ్ ఫారూక్ (19) మొబైల్ రిపేరర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఎదుటి ఇంట్లో యువతి (30) స్నానం చేస్తుండగా కిటికీ లోంచి సెల్‌ఫోన్‌లో ఆమెను వీడియో తీస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె గమనించింది. ఆందోళన చెందుతూ ఇంట్లోకి పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment