సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్ ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ.. ఓ హిందూ దేవుడిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
దీంతో తమ ఆరాధ్య దైవాన్ని కత్తి మహేశ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారంటూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త కిరణ్ నందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్ 295(1), 505(2)ల కింద కేసు నమోదు చేసి కత్తి మహేశ్‌ను ఇంటి దగ్గర నుంచి అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆయనపై హైదరాబాద్ పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment