Mahesh Kathi
-
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేష్ అరెస్ట్
-
అనుచిత వ్యాఖ్యలు.. కత్తి మహేష్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఐపీఎస్ సెక్షన్ 153(ఎ) కమ్యూనల్ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. (కత్తి మహేష్‌పై మరో కేసు) సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెడితే కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరికాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు తొలి అరెస్ట్ చేశారు. టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి ఉస్మానియా, కింగ్ కోఠి ఆసుపత్రులలో వైద్యపరీక్షలు నిర్వహించి రిమాండ్ కు తరలించారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో కత్తి మహేష్‌పై ఐపిసి సెక్షన్ 153(a) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. తన ట్విటర్లో రాముడు కరోనా ప్రియుడు అంటూ పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
కత్తి మహేష్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలు దేబ్బతీసేలా మాట్లాడరని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్లో ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఇవే ఆరోపణలతో అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు. కాగా, గతంలో కూడా కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. -
పరిపూర్ణానంద బహిష్కరణపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నగర బహిష్కరణ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్వామీజీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని స్వామీజీ నిరసిస్తూ చౌటుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు స్వామీజీని జూబ్లీహిల్స్‌లో బస చేసిన నివాసంలోనే నిర్బంధంలో ఉంచారు. మెజార్టీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారంటూ కత్తి మహేశ్‌ను అప్పటికే పోలీసులు నగర బహిష్కరణ చేశారు. అనంతరం స్వామీజీని కూడా నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కారణం చూపించి ఈ బహిష్కరణ చేశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర చర్యల నివారణ చట్టం కింద స్వామీజీని నగర బహిష్కరణ చేయడం అన్యాయమని, ఇతర జిల్లాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడం అన్యాయమని స్వామీజీ తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. స్వామీజీ నగర బహిష్కరణ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చారు. -
పోలీసుల అదుపులో కత్తి మహేశ్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్ ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ.. ఓ హిందూ దేవుడిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్య దైవాన్ని కత్తి మహేశ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారంటూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త కిరణ్ నందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్ 295(1), 505(2)ల కింద కేసు నమోదు చేసి కత్తి మహేశ్‌ను ఇంటి దగ్గర నుంచి అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆయనపై హైదరాబాద్ పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
కత్తి మహేష్‌పై ఫిర్యాదులు
సాక్షి, అమలాపురం: రామయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ కోరింది. ఓ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావుకు అందజేశారు. న్యూస్ ఛానల్ డిబేట్లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. ‘రామాయణం నాకొక కథ మాత్రమే. రాముడు దగుల్భాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అజాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధా కొండ తెలిపారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పైన, ఇలాంటి పనికి రాని చర్చలు పెట్టి మతాలు, కులాల, సామాజిక వర్గాలను రెచ్చ గొట్టేలా ప్రసారాలు చేసే ఆ టీవీ ఛానల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించి కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమజానికి ఎంత మాత్రం ప్రయోజనం లేని అలాంటి డిబేట్లను ఇప్పటికైనా నిలిపివేసి సమాజ హితమైన అంశాలను ప్రసారం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు ఆ టీవీ ఛానల్‌కు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్‌పై చర్యలు తీసుకునే వరకూ తమ ఫౌండేషన్ ద్వారా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులు బసవా సత్య సంతోష్, మహదేవ నాగేశ్వరరావు, జొన్నాడ దుర్గారావు, ఇవాని శర్మ, కొత్తపల్లి వంశీ, కొండేపూడి ప్రకాష్, బొక్కా నాని తదితరులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోనూ ఫిర్యాదు కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
పవన్‌పై ఆగని కత్తి ట్వీట్లు
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పదునైన ట్వీట్లతో రెచ్చిపోయారు. జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో ఆ పార్టీ తీరుపై, పవన్ కళ్యాణ్‌పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలంటే దేవుడితో చెప్పుకోండి అని జనసేన మీడియా ప్రతినిధి చెబుతుంటే..పవన్ మా దేవుడు అని జనసైనికులు చెబుతున్నారని సెటైర్లు వేశారు. ‘జనసైనికులూ.. మిమ్మల్ని వేరే పార్టీలకు అమ్మేస్తారు జాగ్రత్త’ అంటూ హితవు పలుకుతూ కత్తి మహేష్ ట్వీట్ చేశారు. సెటిల్మెంట్ భూమి మీద పార్టీ నిర్మాణాలు మొదలుపెట్టిన పవన్, అవినీతిరహిత రాజకీయాలు తీసుకొస్తానని మాట్లాడటం ప్రపంచంలో ఎనిమిదో వింతగా కత్తి అభివర్ణించారు. గతంలోనూ పవన్ టార్గెట్‌గా కత్తి చేసిన ట్వీట్లు పెనుదుమారం రేపాయి. పవన్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సుదీర్ఘంగా నెలకొన్న ఘర్షణ వాతావరణానికి ఇటీవల తాత్కాలికంగా తెరపడినా మళ్లీ కత్తి చేస్తున్న ట్వీట్లపై పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. రైతుల సమస్యల గురించి మాట్లాడాలి. టైం ఇవ్వండి. అంటే, దేవుడితో చెప్పుకోండి అనే జనసేన మీడియా ప్రతినిధి. పవన్ కళ్యాణ్ మా దేవుడు అని నమ్మే జనసైన్యం. జనసైనికులారా...ఇలాంటివాళ్ళు మిమ్మల్ని జమ సైనికులుగా చేసి వేరే పార్టీలకు లెక్కగట్టేస్తారు. జాగ్రత్త! pic.twitter.com/M9h1g5fGj0 — Kathi Mahesh (@kathimahesh) 14 March 2018 -
కత్తి ‘కవర్ డ్రైవ్’ పని చేయట్లేదు!
సాక్షి, సినిమా : సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. టచ్ చేసి చూడు చిత్రానికి రివ్యూ ఇచ్చి రవితేజ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. సినిమా చూసిన కాసేపటికే కత్తి మహేష్ తన వర్షెన్ రివ్యూను ఇచ్చేస్తూ.. సినిమాను టచ్ చేయకపోతేనే బెటర్ అని వ్యాఖ్యానించాడు. అంతే మాస్ రాజా ఫ్యాన్స్ కి ఇది చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ఉంది. కానీ, వేస్ట్ అని డిసైడ్ చేయటడానికి నువ్వెవరూ?’ అంటూ కత్తిపై విరుచుకుపడుతున్నారు. దీంతో కత్తి మరో ట్వీట్ చేశారు. ‘సినిమా నచ్చితే చూడమని రెకమండ్ చేసినట్టే. నచ్చకపోతే, చూడకపోతే బెటర్ అని కూడా చెప్తామ్! అందులో తప్పేముంది’ అని తెలిపారు. అయినా తన రివ్యూలో సినిమాను చూడటం.. చూడకపోవటం... అనే ఛాయిస్‌ను ప్రేక్షకుడికే వదిలేస్తానంటూ ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఏది ఏమైనా స్టార్ హీరోల విషయంలో కత్తి మహేష్ ముందు ట్వీట్లు చేయటం.. అవి వివాదాస్పదం అవుతుండటంతో... కేవలం తన అభిప్రాయమేనంటూ తేల్చేయటం ఫ్యాన్స్‌కు ఏ మాత్రం రుచించటం లేదు. మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యవహారం మాదిరే.. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్ని చర్చలకు దారితీస్తుందోనని సగటు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. -
‘చంద్రబాబుకు ప్రత్యామ్నాయం కాదనుకుంటున్నాడేమో’
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పై విమర్శల దాడిని తగ్గించిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరో సారి తనదైన శైలిలో స్పందించాడు. చలోరేచలో ప్రజాయాత్రలో భాగంగా పవన్‌కళ్యాణ్ అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం కాదని భావిస్తున్నాడేమోననే సందేహం వ్యక్తం చేస్తూ సుతిమెత్తంగా విమర్శించాడు. ‘చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాల్సిందే!’ అని ట్వీట్ చేశాడు. ఇక అంతకు ముందు జనసేనానిని ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం అంటూ వ్యాఖ్యానించారు. సమస్య ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉందని, ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, ఏదో ఒకటి చెయెచ్చని పలు సూచనలు చేశారు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చంటూ పవన్‌ను కత్తి మహేష్ అలర్ట్ చేశారు. గత నాలుగు నెలలుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడిచి దాడుల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. చివరకు గుడ్లతో దాడి అనంతరం జనసేన పార్టీ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో శాంతించిన కత్తి అభిమానులపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి మౌనం వహించిన కత్తి తాజాగా పవన్‌ను సుతిమెత్తంగా విమర్శిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన alternative గా ప్రాజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాలసిందే! — Kathi Mahesh (@kathimahesh) 29 January 2018 తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొిచ్చు. — Kathi Mahesh (@kathimahesh) 29 January 2018 -
డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు
సాక్షి, సినిమా : తాజాగా నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ట్విటర్ వేదికగా ఆమె ప్రశ్న సంధించింది. ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలీదుగానీ ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది. పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేస్తున్నావా? అంటూ పలువురు ఆమెపై మండిపడుతున్నారు. ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే ఈ ట్వీట్ ఎవరినీ ఉద్దేశించింది కాదని.. డబ్బు కోసం ఓ తండ్రి కూతురిని అమ్ముకుంటే.. ఆమె ఆవేదనను తాను ట్వీట్ చేశాను అంటూ పూనమ్ వివరణ ఇచ్చుకుంది. పవన్ ఫ్యాన్స్ వార్నింగ్... ‘డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు’ అంటూ నటి పూనమ్ చేసిన కామెంట్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని భావిస్తూ... ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. సినిమాల గురించి ట్వీట్లు వేసుకుంటే బాగుంటుంది. నాటకాలు చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరికొందరు పూనమ్ కూడా టీవీ చానల్స్ చర్చా కార్యాక్రమాలకు వెళ్లాలని కొందరు సెటైర్లు వేస్తున్నారు. Dabbul kosam maripoina siddantalu..me astitvam Enti ?avasarlu kosam maripoina nijayati ni gunam Enti ??? #justathought — Poonam Kaur Lal (@poonamkaurlal) 27 January 2018 -
‘కత్తి’ మరో మార్గంలో దూసుకుపోతోందా.?
కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కత్తి మహేష్‌కి సోషల్ మీడియా వేదికగా మాటలయుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కత్తిపై జరిగిన కోడిగుడ్ల దాడిపై చేసిన ఫిర్యాదు వెనక్కు తీసుకున్న అనంతరం పవన్ ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు దిగారు. దీంతో ఈ వివాదం తెరపడిందని అటు పవన్ ఫ్యాన్స్, ఇటు కత్తి మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. తాజాగా కత్తి మరో మార్గంలో దూసుకుపోతున్నట్లు ఆయన చేసిన ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. కత్తి మహేష్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఆయన చేసిన పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. మహేష్ కత్తి ఇప్పటివరకు కేవలం తన వ్యక్తిగత హక్కుల కోసం పోరాడారు. అయితే కత్తి ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడదామని తన ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు. ‘ప్రత్యేక హోదా మాత్రమే కాదు. అన్ని విభజన హామీల గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇలాగే ఆలస్యం చేస్తే, వాటికి చట్టబద్దత నశించే ప్రమాదం ఉంద’ని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి పవన్ అభిమాని ఒకరు ‘మేము పోరాడుతున్నాము, నువ్వు కూడా రా నీకు బాధ్యత లేదా, రాష్టాన్ని కాపాడుకునే హక్కు లేదా, నీ వ్యక్తిగత హక్కు కోసం పోరాడతావు, నీలో పోరాటపటిమ చాలా గొప్పది. మాతో రా.. జై జనసేన’ అని కామెంట్ చేశారు. దీనికి వెంటనే కత్తి స్పందించి ‘పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకుని వైజాగ్ వచ్చినవాళ్ళలో నేనూ ఉన్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని రిప్లై ఇచ్చారు. తనకు వచ్చిన కామెంట్లకు కత్తి తనదైన శైలిలో రిప్లే ఇచ్చారు. ప్రత్యేక హోదా మాత్రమే కాదు. అన్ని విభజన హామీల గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇలాగే ఆలస్యం చేస్తే,వాటికి చట్టబద్దత నశించే ప్రమాదం ఉంది. — Kathi Mahesh (@kathimahesh) January 21, 2018 -
వెనక్కి తగ్గిన కత్తి.. కేసు ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్ : తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారిపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి పోలీసులకు చేసిన ఫిర్యాదును కొద్ది గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. గురువారం ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబ్‌లో వెళ్తుండగా అతనిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కత్తి శుక్రవారం మాదపూర్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పవన్‌కల్యాణ్ అభిమానులే దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. కత్తిపై తామే దాడి చేశామని హైదరాబాద్‌లోని జగద్గీరిగుట్టకు చెందిన సతీష్, నాని అనే ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. అనంతరం ఓ టీవీ చానెల్ డిబెట్లో కత్తికి ఈ యువకుల మధ్య సయోధ్య కుదరడంతో ఆయన కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్ కత్తి ట్విటర్లో తెలిపారు. ‘నేనున్నది పరిపక్వత లేని పీకే పేద అభిమానులను శిక్షించడం కోసం కాదు. పీకే, జనసేన ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఒక తప్పుదోవ పట్టిన దళితుడు. నేను వారిని శిక్షించటానికి కాకుండా వారిని సంస్కరించుటకు నైతిక బాధ్యత వహిస్తాను. నాపై దాడిని ఖండించడం, క్షమాపణలు చెప్పడం పీకేకే వదిలేస్తున్నాను. అని ట్వీట్ చేశారు. I am not for punishing poor, ameture and dorectionless PK fans who attacked.PK and Janasena came up with directives now. One is a misguided Dalit.I have a moral responsibility to reform them rather than punish.Condemning attack on me and apologising is left to PK's consciousness. — Kathi Mahesh (@kathimahesh) 19 January 2018 కొద్దిరోజులుగా పవన్ అభిమానులకు కత్తికి సోషల్ మీడియా వేదికగా మాటలయుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన అనంతరం దాడి చేసిన వారితో కత్తి సెల్ఫీలు దిగారు. దీంతో ఈ వివాదం తెరపడిందని అటు పవన్ ఫ్యాన్స్, ఇటు కత్తి మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులతో కత్తి మహేశ్ సెల్ఫీ( దాడి చేసిన నాని, సతీష్ ఎడమ నుంచి ) -
అజ్ఞాతంలోకి మరో సినిమా : కత్తి మహేశ్
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో, భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదలై అభిమానులను నిరాశ పరచడంతో, అందరి చూపు ఇప్పుడు జైసింహాపైనే ఉంది. అయితే 80ల కథకి, 90ల కథనంతో 'జై సింహా' ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ట్విటర్‌లోపోస్ట్ చేశారు. 'గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా 'జై సింహ'. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!' అంటూ పేర్కొన్నారు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జై సింహా'లో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. రిస్క్ చేసి చూస్తే మీ ఇష్టం అంటూ అజ్ఞాతవాసి చిత్రానికి కత్తి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. -
అజ్ఞాతవాసిపై వర్మ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించాడు. పవన్ కెరీర్లోనే అత్యంత డిజాస్టర్ చిత్రమైన ‘పులి’ ని చూసినట్లుందని పరోక్షంగా సెటైర్లు వేశాడు. అంతేకాకుండా సినీ విమర్శకుడు మహేశ్ కత్తి రివ్యూ బాగుందంటూ కితాబిచ్చాడు. ‘నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. I Just saw PULI — Ram Gopal Varma (@RGVzoomin) 10 January 2018 I never saw a PULI who is so tooth less and so claw less and I am simply stunned at how it’s stripes keeps changing and the the most shocking is instead of jumping this PULI just crawls — Ram Gopal Varma (@RGVzoomin) 10 January 2018 పవన్ కన్నా కత్తి చాలా అందగాడు.! సినీ విమర్శకుడు మహేశ్ కత్తి రివ్యూపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఇప్పుడే కత్తి రివ్యూ వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ కన్నా కత్తి చాలా అందంగా కనిపించాడు’అని ట్వీట్ చేశాడు. దీనికి మహేశ్ కత్తి థ్యాంక్స్ చెప్పగా.. జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆది మాత్రం ‘అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది విరిద్దర్నీ చూస్తే.....!!!!!’ అని కామెంట్ చేశాడు. కొద్దిరోజులుగా మహేశ్ కత్తి, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ కత్తిని వర్మ పొగడటం పవన్ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో వర్మ ట్వీట్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
రిస్క్ చేసి చూస్తే మీ ఇష్టం : మహేశ్ కత్తి
సాక్షి, హైదరాబాద్ : భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా బుధవారం విడుదలైంది. తొలిఆట నుంచే సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో పవన్ సినిమాపై క్రిటిక్ మహేశ్ కత్తి.. ఏం రివ్యూ ఇస్తారనేదానిపై ఆసక్తినెలకొంది. ఆమేరకు కత్తి రివ్యూ రాసిన వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. కత్తి ఏమన్నారంటే..: ‘‘ సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో)’’ సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో). — Kathi Mahesh (@kathimahesh) January 10, 2018 సాధారణంగా సాధ్యమైనన్ని ఎక్కువ కోణాల్లో సినిమాలను విశ్లేషించే కత్తి మహేశ్.. ‘అజ్ఞాతవాసి’ విషయంలో మాత్రం రెండుముక్కల్లో పనికానిచ్చేశారు. ఇది ఓ ఫ్రెంచ్ సినిమాకు కాపీ అనే విషయంలోనూ గతంలో మహేశ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సలే.. ‘అజ్ఞాతవాసి’ని చూసి.. ‘నా సినిమాను పోలి ఉంద’ని ట్వీట్ చేయడం గమనార్హం. Screening at #LeBrady tonight. Great atmosphere thanks to the audience. I could‘ve loved the movie but unfortunately the plot was too familiar. #LargoWinch #Agnyaathavaasi pic.twitter.com/RwFWAyeUPz — Jérôme Salle (@Jerome_Salle) 9 January 2018 -
‘అజ్ఞాతవాసి’ గురించి మహేశ్ కత్తి చెప్పిందే నిజమైందా?
సాక్షి, హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి ఫిలిం క్రిటిక్ మహేశ్ కత్తి చెప్పింది చెప్పినట్లే జరిగిందా? ‘త్రివిక్రమ్ కాపీ దెబ్బకి ప్రొడక్షన్ హౌస్ బలైపోయింద’న్న కత్తి వ్యాఖ్యలు మరోసారి నిజమయ్యాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైన ‘అజ్ఞాతవాసి’... ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ కు ఇన్సిపిరేషన్ కాదు.. మక్కీకి మక్కీ కాపీనే అనే అభిప్రాయం వెల్లడైంది. ఏకంగా ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సలే.. ‘అజ్ఞాతవాసి’ షో చూశాక ‘కాపీ’ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయా దేశాల కాపీరైట్ చట్టాలను అనుసరించి జెరోమ్.. ‘అజ్ఞాతవాసి’ దర్శకనిర్మాతలపై కేసు వేస్తారా, లేదా తెలియాల్సిఉంది. ‘అజ్ఞాతవాసి’పై ఇటీవలే పోస్టు పెట్టిన మహేశ్ కత్తి.. అందులో.. ‘‘త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’’ అని రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ సినిమా ఫ్రెంచ్ సినిమాను పోలి ఉంటుందనే అభిప్రాయం వెల్లడైనప్పటికీ.. దర్శకనిర్మాతలు స్పందిచలేదు. ఇప్పుడది కాపీనే అని రూఢీఅయిన దరిమిలా వివరణ ఇస్తారో, లేదో వేచిచూడాలి! ‘లార్గో వించ్’ డైరెక్టర్ జెరోమ్ సలే ట్వీట్.. Screening at #LeBrady tonight. Great atmosphere thanks to the audience. I could‘ve loved the movie but unfortunately the plot was too familiar. #LargoWinch #Agnyaathavaasi pic.twitter.com/RwFWAyeUPz — Jérôme Salle (@Jerome_Salle) 9 January 2018 -
పవన్ గారూ హెల్ప్ మీ : పూనం కౌర్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లోనేకాక రాజకీయంగానూ దుమారం రేపుతోన్న ‘మహేశ్ కత్తి- పవన్ ఫ్యాన్స్’ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో అనుబంధం నేపథ్యంగా మహేశ్ కత్తి సంధించిన ప్రశ్నలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. వివాదం నుంచి తనను బయటపడేయాల్సిందిగా పవన్‌ను సహాయం కోరారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం పూనమ్ తన అధికారిక ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్లను డిలిట్ చేసేశారు. అయితే ఆ వ్యవధిలోనే పూనమ్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. స్క్రీన్ షాట్ల రూపంలోని ట్వీట్లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పవన్.. హెల్ప్ మీ : ‘‘పవన్ కల్యాణ్ గారూ.. ఈ విపత్కర పరిస్థితితో నాకు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎందుకంటే ఇది నా కుటుంబానికి, కెరీర్‌కు, మరీ ముఖ్యంగా నా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. రహస్య అజెండాతో పనిచేస్తోన్న ఎవరో కొందరికి నేను పొలిటికల్ టార్గెట్ కాదల్చుకోలేదు. ఇదే విషయమై మిమ్మల్ని స్వయంగా కలిసి, మాట్లాడాలనుకుంటున్నాను’’ అని పూనమ్ ట్వీట్లలో రాసుకొచ్చారు. పవన్‌ను ఉద్దేశించిన ట్వీట్లను నిమిషాల వ్యవధిలోనే డిలిట్ చేసేయడం గమనార్హం. పూనమ్ కౌర్ ట్వీట్స్(డెస్క్‌టాప్ స్క్రీన్ షాట్) కత్తి ప్రశ్నలు : ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కత్తి మహేశ్ విలేకరులతో మాట్లాడుతూ.. వివాదాల విషయంలో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, పవన్ అభిమానులే ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన వెనక ఏ రాజకీయ పార్టీ, మీడియా లేదని, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాననే ఆరోపణలు అవాస్తవమన్నారు. నటి పూనమ్‌కౌర్ చేసిన వ్యాఖ్యలకు తాను ఆరు ప్రశ్నలు సంధిస్తున్నానన్నారు. పూనమ్‌కౌర్‌కు కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలివే.. 1. చేనేత బ్రాండ్ అంబాసిడర్ హోదా పూనమ్‌కౌర్‌కు ఎలా లభించింది? 2. తిరుమలలో పవన్ గోత్రం పేరుతో పూజ చేసింది నిజం కాదా? 3. పవన్ మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసింది నిజం కాదా? ఆస్పత్రి బిల్లు ఎవరు కట్టారు? 4. పూనమ్ తల్లిని కలిసిన పవన్ చెవిలో ఏం చెప్పాడు? ఏం ప్రామిస్ చేశారు? 5. దర్శకుడు త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం? 6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగ్‌తో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? -
15న ఏం జరగబోతోంది?
టాలీవుడ్ విశ్లేషకుడు మహేష్ కత్తి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ఆయన భావిస్తున్న ఆయన ఈ మేరకు తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ‘‘ మౌనం ఎప్పటికీ మోసం చేయదు. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’’ అని కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? లేదా వెంకట్ ద్వారా ఏదైనా సందేశం పంపించనున్నారా? అసలు ఆ రోజున ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పడితే అంత మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. “SILENCE IS A TRUE FRIEND WHO NEVER BETRAYS”.... I request everyone to maintain Silence till 15th January.. I request even Mahesh Kathi to maintain silence.. going to any media house or using any platform to speak against fans or PK will spoil the attempt to bring peace 🙏 — kona venkat (@konavenkat99) 7 January 2018 పూనమ్ కూల్ రియాక్షన్ ఇక తనపై మహేష్ కత్తి చేసిన విమర్శలపై నటి పూనమ్ కౌర్ నేరుగా స్పందించలేదు. కాకపోతే ట్విట్టర్లో మహేష్‌పై అనుచిత ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ఆమె రీ ట్వీట్‌తో సున్నితంగా మందలించారు. Who ever this is you are not going to degrade any ones mother ! I sincerely request ! Plz https://t.co/apmWDhSeu0 — Poonam Kaur Lal (@poonamkaurlal) January 7, 2018 -
మహేశ్ కత్తిపై మళ్లీ హైపర్ ఆది పంచులు!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ విమర్శకుడు మహేశ్ కత్తి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య వివాదం ఇప్పుడు ఉద్రిక్తతలు రేపుతోంది. తనపై పవన్ కల్యాణ్ అభిమానులు వ్యక్తిగత దూషణలు, దాడులకు దిగుతుండటంతో మహేశ్ కత్తి తాజాగా బహిరంగ సవాళ్లకు దిగారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు. పూనం కౌర్ విషయంలోనూ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు అక్కడికి వచ్చి మహేశ్ కత్తిని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది ఇలా ఉండగా మహేశ్ కత్తి యథారీతిలో పవన్ ఫ్యాన్స్ తీరుపై తన ప్రతి విమర్శలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది తాజాగా ట్విట్టర్లో కత్తి లక్ష్యంగా విమర్శల దాడికి దిగారు. మహేశ్ కత్తి ఓ సైకో అంటూ విమర్శించారు. ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైపర్ ఆది ఏమన్నారంటే.. ’అనవసరమైన వాళ్లకి అర్హత లేని వాళ్ళకి అనుచితంగా స్టార్ చైర్ వేసి కూర్చోపెట్టకండి. అతను ఒక సైకో. అతనికి కావాల్సింది డబ్బు.. విలువలూ ప్రేమలూ కాదు. ఏ అనుబంధాలు లేని వాడికి ఇవ్వన్నీ అర్థంకావు. అనవసరమైన ఎక్సైట్మెంట్తో, క్యూరియాసిటీతో ఇది వరకే ఒకరిని అందలం ఎక్కించారు. ఇదంతా ఆపేయండి’ అని హైపర్ ఆది ట్వీట్ చేశారు. ’ఫ్యాన్స్ అందరికి ఒక విన్నపం. కత్తి మహేశ్‌ను ప్రతి ఒక్కరూ అన్‌ఫ్రెండ్ చేసి బ్లాక్ చేయండి. అతన్ని ఏకాకిని చేయండి. అతనో మానసిక రోగి. అతనికి ఏ ఫ్యాన్ కూడా స్పందించకూడదని కోరుకుంటున్నా. వాడి ట్వీట్ కింద ఏ ఒక్కరూ దయచేసి రీట్వీట్లు పెట్టకండి’ అని మరో ట్వీట్లో అన్నారు. ‘మరి వేణు అన్న లైవ్ లో చెప్పాడు కదా.. మైండ్ దొబ్బినోళ్ళతో పవన్ ఫ్యాన్స్ మాట్లాడొద్దని.. అదే ఫాలో అవ్వండి. మహేశ్ కత్తికి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకుంటా.. ఓరే క్యూట్ బ్యాయ్ అప్పుడే అయిపోయిందనుకోకు. ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలామంది వస్తారు. నేను ట్విట్టర్లోకి వచ్చిన రోజే చెప్పా.. నువ్వు ఇంకా ఫినిష్ అని’ అని ఆది రాసుకొచ్చారు. -
మహేశ్ ప్రెస్‌మీట్‌కు పవన్ ఫ్యాన్స్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి, పవన్‌కళ్యాణ్ అభిమానుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ మరింత వేడెక్కింది. తనతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్, పూనం కౌర్, అభిమానులు ఎవరైనా ప్రెస్ క్లబ్‌కు రావాలని ఆయన సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే మహేశ్ కత్తి ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. పవన్ అభిమానులు సైతం రావడంతో ఇక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పవన్ అభిమానులను ప్రెస్‌క్లబ్‌లో అనుమతించకుండా అడ్డుకున్నారు. తన సవాల్‌ను ఎవరూ స్వీకరించకపోవడంతో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు ప్రశ్నలు సంధించారు. నా తల్లి, భార్యను తిడితే ఊరుకోవాలా..? రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. పవన్ లేదా పూనం కౌర్ ను చర్చించేందుకు రమ్మని ఆహ్వానం పంపించానని, కానీ వారు రాలేదని అన్నాడు. తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆరోపించారు. రేణుదేశాయ్ విషయంలో ఏం చేయని పవన్.. రేణుదేశాయ్ తన రెండో వివాహం గురించి ఒక్క మాట ప్రస్తావిస్తే, పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని గుర్తు చేసిన కత్తి.. కనీసం ఆ వ్యాఖ్యలను సైతం పవన్ ఖండించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్.. తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. తాను ఓ మామూలు మనిషినని, తనపై అభిమానులు చేస్తున్న విమర్శలను, దాడిని, ఒక్క మాట చెప్పి పవన్ అడ్డుకోలేక పోతున్నారని ఆరోపించారు. తాను ఎన్నడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, వాటికి సమాధానం చెప్పలేని ఆయన, రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. తన ప్రాణాలకు అపాయం ఉందని, దీంతోనే ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తే, తనతో చర్చించేందుకు ఎవరూ రాలేదని ఆయన వాపోయారు. పూనం కౌర్‌కు ప్రశ్నల వర్షం.. ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎలా వచ్చిందన్న కత్తి.. పవన్ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే మిమ్మల్ని కాపాడిందేవరు? మీ ఆసుపత్రి బిల్ కట్టిందేవరని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా, లేదా? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం? ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నలకు పూనం కౌర్ సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. -
పూనమ్ కౌర్‌కు కత్తి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్‌పై కత్తిగట్టిన హీరోయిన్ పూనమ్ కౌర్‌కు మహేష్ కత్తి కౌంటర్ ఇచ్చారు. తనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ పూనం తీరును ఆయన ఎండగట్టారు. పవన్ ప్రాపకంతో ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి సంపాదించి ఆయన మెప్పు కోసం తనపై ప్రేలాపనలు చేస్తున్నావని మండిపడ్డారు. పూనమ్‌పై కత్తి ఎలా చెలరేగారంటే...‘పవన్ కళ్యాణ్ రికమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను "ఫ్యాట్సు" అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది నా సంస్కారం కాదు. అడుక్కుని సంపాదించుకున్న పదవి మీద బ్రతుకుతున్న నువ్వా నాకు భిక్ష వేసేది? మాటలు జాగ్రత్తగా రాని. నేను నోరు తెరిస్తే నువ్వు, నీ పవన్ కళ్యాణ్ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
అల్లు అరవింద్‌పై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి సంచలన ఆరోపణలు చేశారు. గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచే తనపై వికృత ప్రచారం సాగుతున్నదని, పవన్ అభిమానులకు తన ఫోన్ నంబర్ షేర్ అయింది కూడా అక్కడి నుంచేనని తెలిపారు. శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో వరుస పోస్టులు చేసిన మహేశ్.. మరోమారు పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న కొందరు పీకే ఫ్యాన్స్ ఫొటోలను, దూషణల పర్వం స్క్రీన్షాట్లను సైతం పొందుపర్చారు. గీతా ఆర్ట్స్ ఆఫీసు కేంద్రంగా.. : ‘‘నన్ను పందితో పోల్చుతూ ఇటీవల పుట్టుకొచ్చిన ఫేస్బుక్ పేజీల్లో అధికభాగం గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే క్రియేట్ అయ్యాయని తెలిసింది. ఈ విషయంలో ఆ ఆఫీసు అధినేత అల్లు అరవింద్ తక్షణమే చర్యలు తీసుకొని, వికృత ప్రచారాన్ని ఆపేయాలి. తిట్టమని కోరుతూ పవన్ అభిమానులకు నా ఫోన్ నంబర్ షేర్ అయింది కూడా ఈ ఆఫీసు నుంచే! నిజానికి అల్లు అరవింద్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. వికృతపర్వాల సంగతి ఆయనకు తెలిసి ఉంటే గనుక అలాంటి శునకానందానికి దూరంగా ఉండాలని కోరుతున్నా’’ అని కత్తి మహేశ్ రాసుకొచ్చారు. వాళ్లను చూస్తే జాలేస్తుంది : సోషల్ మీడియాలో పవన్ అభిమానుల నుంచి దారుణమైన తిట్లు ఎదుర్కొంటున్నానన్న మహేశ్.. వాటి తాలూకా ఒకటి రెండు స్క్రీన్ షాట్లను పొందుపర్చారు. ‘‘ఇంత నీచంగా తిడుతుంటే పీకే ఫ్యాన్స్‌పై కేసు ఎందుకు పెట్టవు? అని నా స్నేహితులు అడుగుతుంటారు. వాస్తవం ఏంటంటే.. ఆ కామెంట్లు చేసేవాళ్లలో అత్యధికులు మైనర్లే! పిల్లల మీద కేసులు పెట్టడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఇన్‌ఫ్యాక్ట్ వాళ్లను చూస్తే జాలేస్తుంద’’ని తెలిపారు. పీకే ఎయిడ్స్ కంటే ప్రమాదకారి : ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మహేశ్ ఘాటువ్యాఖ్యలు చేశారు. ‘‘పీకే ఒక వైరస్. హెచ్ఐవీ కంటే ప్రమాదకారిలా యువతరాలను బలితీసుకుంటున్నాడు. ఆయనను అనుసరిస్తూ హేతుబద్ధమైన ప్రవర్తన, సామాజిక బాధ్యతలను మర్చిపోతున్నారు. ఈ రుగ్మతకు చట్టబద్ధమైన పరిష్కారం కంటే సామాజిక చికిత్స అవసరం’’ అని కత్తి మహేశ్ అన్నారు. కాగా, కత్తి వ్యాఖ్యలపై అల్లు కుటుంబంకానీ, గీతా ఆర్ట్స్ సంస్థగానీ ఇంకా ప్రతిస్పందించలేదు. ఇవి మహేశ్ పోస్ట్ చేసిన సంభాషణలు(అసభ్యకరమైన పదజాలాన్ని బ్లర్ చేశాం) -
ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా! : కత్తి
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి.. ‘అజ్ఞాతవాసి’ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలయినపుడు అది ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని, 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైలర్‌లా ఉందని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘ త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’ అని పోస్ట్ పెట్టారు. పవన్ అభిమానులకు కత్తి హెచ్చరిక! గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ‘మీరు తిట్టే ప్రతి బూతు. కూసే ప్రతికూతా. చేసే ప్రతి కాల్. వచ్చే ప్రతి బెదిరింపు ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఘోరీ కట్టడానికి వాడతాను. గుర్తుపెట్టుకోండి.’ అని తాజాగా తన ఫేస్బుక్ వేదికగా కత్తి కామెంట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదల కానుంది. -
విషస్ చెప్పడానికా? ప్రీమియర్ల పర్మిషన్ కా?
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడంపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తనదైన శైలిలో స్పందించారు. వరుస పోస్టులతో విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ‘ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణాలో 24 గంటల పవర్ ఎలా వస్తోందో తెలుసుకున్న పవర్ స్టార్...అబ్బా!!! పవర్ సర్ప్లస్ ఉంటే వస్తుంది. లేదా వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటే వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టులో భాగం అయితే ఉంటుంది. దీనికి ఒక పాలసీ స్టడీ. సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ !’ అని సెటైర్ వేశారు. "తెలంగాణాలో నా బలం నాకుంది" - పవన్ కళ్యాణ్ నిజమే నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50% ఉంటుంది. ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్ లో ప్రీమియర్ల పెడితే టికెట్టుకి 3,000 నుంచీ 5,000 లాగొచ్చు. అంత బలం ఉంది. ఆ బలానికి బలగం తోడు అవ్వాలంటే, కె.సి.ఆర్ అనుగ్రహం కావాలి. భేష్!!! అని మహేశ్ కత్తి ఆరోపించారు. అవసరం, కాలం రాజకీయనాయకులను ఎంతటికైనా మారుస్తుందనడానికి కేసీఆర్-పవన్ భేటీ నిదర్శనమని దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ చంద్రబాబును ఎలా నమ్మేది?
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేష్ కత్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మరోసారి అక్షరాల తుటాలు పేల్చారు. ఆంగ్ల సంవత్సరాది జరుపుకోకూడదని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఏకీపడేశారు. ‘‘న్యూ ఇయర్ జరుపుకోకూడదని ఆర్డర్ జారీ చేస్తారు. తాను మాత్రం వేదపండితుల ఆశీర్వచనాలతో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఎలా నమ్మేది ఈ నాయకుడిని? అంటూ ఫేస్బుక్లో కాసేపటి క్రితం మహేష్ కత్తి ఫోటోతో కూడిన ఓ సందేశం ఉంచారు. పవన్‌కు బాధ్యత నేర్పే ప్రయత్నం చేస్తున్నా... ఇక నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా మరోసారి ఆయన పోస్టు చేశారు. పవన్ లాంటి రాజకీయ జోకర్‌ను బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నిస్తున్నా అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్నే ఆయన ఫేస్బుక్లో ఉంచారు. పవన్ కళ్యాణ్ పిచ్చి సేన బూతుల్ని ఖండించే ధైర్యం లేని వాళ్ళు, నాకు నీతులు చెప్పడంలో మట్టుకు ముందు ఉంటారని. తన వైఖరి చిరాకుని కలిగిస్తే బ్లాక్ చెస్తే సరిపోతుందని అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అనే ఒక బాధ్యతారహిత వ్యక్తి, నటుడు, సోకాల్డ్ నాయకుడు... తనపై వస్తున్న బెదిరింపులపై ఇంతవరకు ఒక ఖండన కూడా చేయలేదని.. అలాంటి మనిషికి బాధ్యత నేర్పే ప్రయత్నం తాను చేస్తున్నానని మహేష్ చెప్పారు. తనతో ఉన్నవాళ్లు ఉంటారని. పోయేవాళ్ళు దయచేసి వెళ్లిపొవాలని మహేష్ సూచించారు. ‘‘నా ఫేస్ బుక్ వాల్ నుంచి. నా జీవితం నుంచీ. సింపుల్. ఇదే నా కొత్త సంవత్సరపు నిర్ణయం. నా ఆత్మగౌరవాన్ని మించింది ఏదీ లేదు. నా ప్రాణంతో సహా!’’ అంటూ ఆయన సందేశం ఉంచారు. -
‘పార్టీ పెట్టి ఇంట్లో కూర్చుంటే పిరికిపంద అంటారు’
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన మీద తనదైన శైలిలో కామెంట్ చేశారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మహేశ్ కత్తి పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ ‘‘పార్టీ పెట్టి పోటీ చెయ్యకుండా ఇంట్లో కూర్చుంటే ‘పిరికిపంద’ అంటారు. హీరో రజనీ కాంత్, అరే... మా స్టేట్‌లో పవన్ కళ్యాణ్ అంటామే!!!’ ’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
జిగ్నేష్ మేవానీపై ‘కత్తి’ దూశాడు!
సాక్షి, హైదరాబాద్ : వారువీరనే తేడాలేకుండా వరుసగా పోస్టులు పెడుతూ వివాదాలకు కారకుడవుతోన్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి గర్జించారు. దళిత ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూనే గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో కలిసి కూర్చున్న జిగ్నేష్ ఫొటోపై తనదైన శైలిలో వ్యాఖ్యలు రాశారు మహేశ్. ‘లీడర్ అంటే దేవుడు. ఎవరో నాయకులకు ఊడిగం చెయ్యాలనేవి దళిత రాజకీయ పోకడలుకాబోవు. దళితులు ఆత్మగౌరవ పోరాటాలు చేసేది సమానత్వం కోసమేకానీ.. గెలిచి (నాయకుడి) పక్కన కూర్చుని చర్చించడానికి కాదు. ‘జీ హుజూర్..’ అని జైకొట్టడానికి కానేకాదు’ అని కత్తి మహేశ్ వ్యాఖ్యానించారు. ఉనా(గుజరాత్) దళిత ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన యువనాయకుడిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జిగ్నేష్ మేవాని.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం విదితమే. -
చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది
-
ఆశయాలు సరే.. ఆచరణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిద్ధాంతాలకు కత్తి మహేష్ తనదైన శైలిలో కామెంట్ చేశారు. జనసేన సిద్ధాంతాలు మనం ప్రతి రోజు స్కూల్లో చెప్పే ప్రతిజ్ఞలాగా ఉన్నాయన్నారు. ‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులుని కాపాడే సమాజం, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, ఇవి దేశపటిష్టతకు మూలాలు’ ఇవే జనసేన సిద్ధాంతాలు అని నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనికి కత్తి మహేష్ ‘‘మనం స్కూల్ లో ప్రతిరోజు చెప్పిన ప్రతిజ్ఞ లాగా లేదూ! ఆశయాలు సరే...ఆచరణ ఎలా?’. ‘ప్రపంచ శాంతిని కోరడాలు, సర్వమత సామరస్యం కావాలి అనడాలు, కులమత భేదాలు సమసి పోవాలి అనే నినాదాలు, భాష సంస్కృతి వర్ధిల్లాలి అని ఆకాంక్షించడాలు, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ తత్వం అని చాటడాలు’. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదే. మరి జనసేన కొత్తగా చెప్పింది ఏమిటి? బీజేపీ, తెలుగుదేశంతో కలిపి ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎలా సాధిస్తాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే...మీ తల వెయ్యి ముక్కలు అవుతుంది!!!’ అని కామెంట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. -
కత్తి మహేశ్ చూపు.. చంద్రబాబు వైపు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన చూపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైపు మళ్ళింది. దేవాలయాల్లో జనవరి ఒకటిన ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మనకు నూతన సంవత్సరం జనవరిలో కాదు, ఉగాది పర్వాదిన ఆరంభం అవుతుందని పేర్కొంది. ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై మహేశ్ కత్తి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆయన స్పందించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు !’ అని మహేశ్ కత్తి పోస్టు చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. కత్తి మహేశ్ చూపు.. చంద్రబాబు వైపు -
పవన్‌కి సినిమాల మీద క్లారిటీ పోయిందా?
పవన్ కళ్యాణ్ పై కత్తి మహేశ్ మరోసారి గురిపెట్టారు. పవన్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో విడుదల తర్వాత కత్తి మహేశ్ మరోసారి తనదైన రీతిలో సోషల్ మీడియాలో పవన్‌పై విరుచుకుపడ్డారు. ‘పాలిటిక్స్ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ కూడా పోయినట్లు ఉందే.. ఆడియో ఫంక్షన్ అయిపోయింది. సినిమా బాగా అమ్ముడుపోయింది. రిలీజ్‌కి ఇంకా నెల టైముంది. ఇకనైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడదామా..! కనీసం నెలైనా!!!’ అని మహేశ్ కత్తి తన ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఇప్పటివరకు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన మహేష్ కత్తి తాజాగా `అజ్ఞాతవాసి` సినిమా గురించి కూడా విమర్శలు ఎక్కుపెట్టాడు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. -
ఒక్క పర్యటన.. రెండు లాభాలు.!
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి విమర్శలు గుప్పించాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్‌పై ప్రశ్నల వర్షానికి స్వల్ప విరామం ప్రకటించి.. అంతా అభిమానుల చేతుల్లోని ఉందని హెచ్చరించిన మహేశ్ కత్తి.. తన విమర్శల పర్వాన్ని మళ్లీ ప్రారంభించాడు. సోమవారం ‘ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?, అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’అంటూ ‘అజ్ఞాతవాసి’ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు విడిచిన ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన అటు చంద్రబాబుకు, ఇటు పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు కలిసొచ్చిందన్నాడు. ‘స్వామికార్యం స్వకార్యం అంటే జనాలు ఫీల్ అయ్యారుగాని, టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ పాస్‌ల కోసం కొట్టుకుంటున్న విధానం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ పర్యటన అటు చంద్రబాబుకు ఇటు కళ్యాణ్ బాబుకు ఇద్దరికీ వర్కౌట్ అయినట్లేగా! ఒకే దెబ్బకి రెండు పిట్టలు. రాజకీయానికి రాజకీయం. సినిమాకి సినిమా. కొన్ని కోట్ల ప్రమోషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతేను!’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కొద్దిరోజులుగా పవన్ అభిమానులకు మహేశ్ కత్తికి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేశ్ కత్తి మరోసారి ఫైర్ అవ్వడానికి పవన్ అభిమానులే కారణమణని ఆయన ఫాలోవర్స్ భావిస్తున్నారు. -
పవన్ అజ్ఞానవాసి: కత్తి మహేష్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు మహేశ్ కత్తి.. జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఇప్పటివరకు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసిన మహేష్ కత్తి తాజాగా `అజ్ఞాతవాసి` గురించి విమర్శలు చేశారు. ‘ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?’ , ‘అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన టీజర్‌ను బేస్ చేసుకుని ‘అజ్ఞానవాసి’ పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు. `అజ్ఞాతవాసి` టీజర్ ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వచ్చేలా ఉందని మరో పోస్ట్ పెట్టారు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైలర్‌ను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసి, `ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి` అని పోస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. -
అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని!.. వైరల్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అధికారిక సమావేశాలకు వెళ్లిన తాను ప్రాణాలతో బయటపడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ఓ మహిళా కార్యకర్త తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై సినీ విమర్శకుడు, నటుడు మహేశ్ కత్తి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ తన ఫేస్బుక్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కల్యాణ్.. మీలాంటి సామాన్య మహిళలకు రక్షణ కల్పిస్తారని ఎలా అనుకున్నారంటూ జనసేన అధిసేన అధినేత తీరును మరోసారి తప్పుపట్టారు. 'ఇద్దరు పిల్లల తల్లి. ఒక దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ లోకి వచ్చే మహిళలకు రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు తల్లీ మీరు? పవన్ కళ్యాణ్ పిచ్చి సేనకు దక్కిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణ భయాలే. మహిళల్లారా... తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి' అంటూ మహేశ్ కత్తి పిలుపునిచ్చారు. జనసేనలో మహిళలకు రక్షణ లేదు! ఆ వీడియోలో ఏముందంటే.. నాపేరు విజయలక్ష్మి. పవన్ కల్యాణ్ ఒంగోలు సభకు వెళ్లాను. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. సమస్యను జనసేన అధికార ప్రతినిధులకు చెబితే.. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారంటూ మహిళను ప్రశ్నించడం బాధాకరం. మహిళల ప్రాణాలకు పవన్ సభలో రక్షణ లేదు. మేం ప్రాణాలు కోల్పోతే పవన్‌కు ఏ నష్టం లేదు. నష్టపోయేది మా కుటుంబాలే. మహిళలకు జనసేన పార్టీ నేతలే విలువివ్వకపోవడం దురదృష్టకరం. పవన్ కల్యాణ్ ఎక్కడో ఏసీ కార్లలో తిరుగుతారు. మాలాంటి మహిళా కార్యకర్తల బాధలు పవన్ కల్యాణ్‌కు ఏం తెలుస్తాయంటూ' భయానక పరిస్థితిని జనసేన మహిళా కార్యకర్త వీడియో ద్వారా వెల్లడించగా.. ఆ వీడియోను మహేశ్ కత్తి తన ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. మహిళా కార్యకర్తల బాధలు పవన్ కల్యాణ్‌కు ఏం తెలుస్తాయి -
ఇక అంతా అభిమానుల చేతులోనే
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను వరుస ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్వల్ప విరామం ప్రకటించారు. ఇది అభిమానుల ప్రవర్తనపై మాత్రమే ఆధారపడి ఉంటుందని, తనకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరోకోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఫేస్బుక్ ఓ పోస్టు పెట్టాడు. ‘పవన్ కళ్యాణ్‌ను బాగా ఎండగట్టాను. నా వాదాన్ని బిగ్గరగా, చాలా తేటగా వినిపించాను. ఆయనపై వేసే ప్రశ్నల జైత్ర యాత్రకు స్వల్ప విరామం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ పవన్ అభిమానులు మళ్లీ రెచ్చగొడితే మాత్రం ఊరుకోను సుమా..! మళ్లీ రావాలా వద్దా అనేది ఆయన అభిమానుల చేతుల్లోనే ఉంది. నేను అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాదని కూడా తెలుసు. కానీ నా ప్రశ్నలు అనేక మందిని పునరాలోచనలో పడేశాయి. నాకు కావల్సింది కూడా అదే. నేను ఇప్పుడు వేరే మూడ్‌లోకి వెళ్తున్నాను. నాకు భంగం కలిగిస్తే మాత్రం తప్పకుండా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త!’ అని పవన్ అభిమానులను హెచ్చరించాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ప్రారంభమైన మహేశ్ కత్తి ప్రశ్నల వర్షం శనివారం నాటి పవన్ ఒంగోలు సభ వరకు కొనసాగింది. పవన్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కత్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వార్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. -
జనసేనలో మహిళలకు రక్షణ లేదు!
-
రాజాసింగ్, పవన్ కళ్యాణ్‌లపై మహేశ్ కత్తి ఫైర్
సాక్షి, హైదరాబాద్: సినీ విమర్శకుడు మహేశ్ కత్తిపై కేసు నమోదు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహేశ్ కత్తి తనదైన శైలిలో స్పందించారు. ‘చట్టం తెలియని ఒక ఎమ్మెల్యే నా మీద ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎవరు కంగారు పడకండి. ఆ ఫిర్యాదు చెల్లదు. అది కేసు అసలే కాదు. నాకు చట్టాల గురించి బాగా తెలుసని పోస్ట్ చేశాడు’. అంతకు ముందు చీప్ పబ్లిసిటీ కోసం మహేశ్ కత్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నరహంతకుడితో పోల్చాడని వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ ట్వీట్ చేశారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించే క్రమంలో మహేశ్ కత్తి మోదీని నరహంతకుడితో పోల్చిన విషయం తెలిసిందే. ఏమాత్రం తగ్గని కత్తి.. ఇప్పటి వరకు కేవలం పవన్ కళ్యాణే టార్గెట్ చేసిన మహేష్ కత్తి తాజా పోస్టులో మోదీ వ్యాఖ్యలపై విమర్శనస్త్రాలు విడిచారు. మణిశంకర్ అయ్యర్ అన్నాడు. మోదీ రుజువు చేసుకున్నాడు. మణిది బాధ్యత లేని వాగుడు. మోదీది బాధ్యత మరిచిన సణుగుడు. అంతే! అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒంగోలు పర్యటనను విడిచి పెట్టిన మహేశ్ కత్తి ప్రశ్నించే నాయకుడికి మరో ప్రశ్నవేసాడు. బాబును రాజీనామ చేయమను పవన్ కళ్యాణ్ ‘నిజమే...ఎక్కడో రైలు దుర్ఘటన జరిగితే లాల్ బహుదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రాజీనామ చెయ్యాలో. ఒకసారైనా రిజైన్ చెయ్యమని కోరకూడదా పవన్ కళ్యాణ్!’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ అభిమానులు మహేశ్ కత్తిని బద్ద శత్రువుగా చూస్తుండగా.. తాజాగా రాజాసింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ కార్యకర్తలు సైతం ఆయనకు వ్యతిరేకంగా మారనున్నారు. Best way to be in news is to target @narendramodi ji for a cheap publicity. Focus on being a film critic for your livelihood Request @hydcitypolice to register case against him immediately as he called Modiji a Murderer — Raja Singh BJP MLA (@TigerRajaSingh) 8 December 2017 -
పవన్‌పై మరోసారి ‘కత్తి’ దూసాడు
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కళ్యాణ్‌పై సినీవిమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గురువారం రాజమండ్రిలో జనసేన కార్యకర్తల సమావేశంలో తన చుట్టూ ఒక కులమే.. ఉందని తనకు ఓ కులానికి పరిమితం చేస్తే అందరి కుల లెక్కలు బయటపెడతానన్న పవన్ వ్యాఖ్యలపై ‘కత్తి’ సెటైరిక్‌గా విమర్శించారు. ‘తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో వచ్చిన ఈ విశ్వమానవుడు, మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అంతేగాకుండా.. మోదీతో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రాన మోదీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్’ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇక అంతకు ముందు చిరంజీవి సామాజిక న్యాయమంటూ మోసం చేశాడు. ఇప్పుడు నువ్వొచ్చావ్.. అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం. అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకో... రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాలని సూచిస్తూ.. మహేశ్ కత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రజాక్షేత్రంలో ఉంటా అని పవన్ వచ్చిన సమయంలో మహేశ్ కత్తి ఎంత మాత్రం వెనక్కు తగ్గకుండా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. -
హైపర్ ఆదిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై మానవ హక్కుల సంఘానికి (హెచ్ఆర్సీ) ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ ఆశ్రమ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్లో తమపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు కూడా ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని, తన మద్దతు అనాథలకే అని పోస్ట్ చేశాడు. అయితే గురువారం ప్రసారమై ఆది స్కిట్లో ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
స్వాతికి కత్తి మహేష్ లవ్ లెటర్
ఎప్పుడు వివాదాలు, డిబేట్లతో వార్తల్లో ఉండే మహేష్ కత్తి ఈసారి కొత్త అంశంతో నెటిజన్ల ముందుకు వచ్చాడు. హీరోయిన్ కలర్స్ స్వాతికి ప్రేమలేఖ రాశాడు. అంతేకాదు ఇది రెండో ప్రేమలేఖ అంట. తాజాగా స్వాతి నటించిన లండన్ బాబులు సినిమా చూసిన మహేష్ స్వాతి నటనకు ఫిదా అయ్యాడట. ఇంకా స్వాతికి ఏం రాశాడో ఆయన మాటల్లోనే.. 'డియర్ స్వాతి, ఆ మధ్యనేను రాసిన ప్రేమ లేఖ ఇంకా పచ్చిగానే నా మనసులో ఉంది. నీ ప్రతిభకు తగని పాత్రలో నువ్వు కనిపించి కష్టపెట్టిన నా మనసు గాయం మొన్నటివరకు తాజాగానే ఉండేది. కానీ..."లండన్ బాబులు" చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, విరిసీ విరియని నవ్వుతో, వంకించిన మెడతో, పదానికి పదానికి మధ్య పాజ్ తో నటించగల ప్రతిభని మళ్ళీ చూసాను. సూర్యకాంతంతో ప్రేమలో పడ్డాను. స్వాతి... నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను. మొదట జాలిపడి. తరువాత అభిమానించి సహాయం చేసిన గాంధీ మాటలు రావని చెప్పి మోసం చేశాడని తెలిసిన క్షణంలో... మోసపోయాననే కోపం, అతని నిస్సహాయత మీద జాలి, మూగవాడు కాదనే ఆనందం ఇన్ని భావాల్ని ఒక్క క్షణంలో పలికించగల నటుల్ని వెళ్ల మీద లెక్క పెట్టగలం. ఆ వెళ్లలో మొదట పలికే పేరు ఇప్పుడు నీది. క్లైమాక్స్ లో గాంధీ పెళ్లి చేసుకుందామా అన్నప్పుడు... ప్రేమో కాదో తెలియని సందిగ్దత, అవధులు లేని అభిమానపు వెల్లువ, ఎక్కడో కాదనాలనే ఆత్మాభిమానం, ఎందుకు వద్దనాలి అనే తీవ్రమైన ప్రేమ. అనుమానం. ఆనందం. సహజమైన సిగ్గు. బిడియాన్ని పక్కకు నెట్టే ఆలోచన. నాకు కావలసింది నాకు తెలుసు అనే ధీమా. నిన్ను నేను నమ్ముతాను అనే భరోసా. ఇన్ని భావాల్ని ఒక్క విరిసివిరియని స్మైల్ లో చెప్పావు చూడు.. హ్యాట్సాఫ్! అందుకే ఆగలేక. మనసు ఆపుకోలేక.. రాసాను ఈ లేఖ. అందుకో ఈ ప్రేమ లేఖ' అంటూ ముగించాడు. -
వర్మకు మహేశ్ కత్తి మద్దతు
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డుల ఎంపికపై సెటైరిక్‌గా స్పందించడంతో ఆగ్రహానికి గురైన అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు బూతు పురాణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సినీ విమర్శకుడు మహేష్ కత్తి మద్దతు తెలిపారు. ‘ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కుల భూయిష్టమైన భావజాలం కలిగినవాళ్ళు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా అనే ఒక విజ్ఞత కలిగిన ప్రశ్న ఆర్జీవీది. దీనికి సమాధానం ఉందా!?! అని కత్తి మహేశ్ శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నేంటంటే..? ‘ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది.....అలాగే నేను నంది అవార్డులు ఇచ్చిన వైనంపై స్పందించాను. అని దీనికి అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు తనపై బూతు పదజాలంతో ఘాటుగా స్పందించారు. నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు....... కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు.......... అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి. అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. -
వెధవలు అయ్యేది మీరే.. పీకే ఫ్యాన్స్‌కు కత్తి కౌంటర్
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులకు, సినీ విమర్శకుడు మహేశ్ కత్తికి మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య పవన్ కల్యాణ్‌పై మహేశ్ కత్తి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం.. దీంతో పీకే ఫ్యాన్స్ ఆయనపై నిప్పులు చెరుగుతూ దూషణలకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ కత్తి మరోసారి పవన్ అభిమానులకు చురకలంటించారు. మేం మేం బాగానే ఉంటాం.. మధ్యలో ఫ్యాన్సే వెధవలు అవుతారంటూ.. హైపర్ ఆదితో ఫొటో దిగి కామెంట్ పెట్టారు. జబర్దస్త్‌లో భాగంగా ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ అనేది ముందు పొట్ట, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’ అంటూ పరోక్షంగా ఇటీవల హైపర్ ఆది మహేశ్ కత్తిపై పంచులు విసిరిన సంగతి తెలిసిందే. ఈ పంచ్ డైలాగులు తనను విమర్శించేలా ఉన్నాయని కత్తి మహేష్ మండిపడ్డారు. ’అవును నాకు పొట్ట ఉంది. బట్ట ఉంది. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా.? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు... నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నేను లావుగా ఉన్నానని ఫీల్ అయ్యేంత చీప్ మెంటాలిటీ నాది కాదు’ అంటూ మహేశ్ కత్తి ఘాటుగా రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆదితో సరదాగా దిగిన ఫొటోను పోస్టుచేసిన మహేశ్ కత్తి.. తమ మధ్య ఉన్నవి సిద్ధాంతపరమైన విభేదాలే కాని, వ్యక్తిగత వైరాలు కాదని, పవన్ కల్యాణ్‌తో కూడా తాను నవ్వుతూ ఫొటో దిగినా దిగవచ్చునని, ఈ విషయంలో ఫ్యాన్స్ మేలుకోవాలని మహేశ్ కత్తి సూచించారు. ’కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్ధాంతాలకు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్ ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే!’ అని ఆయన తాజాగా ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఈ కామెంట్‌పై పీకే ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
టీజర్ చూసి షాకయ్యా – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘ఏడాది క్రితం కార్తీక్, సుజన్ సినిమా తీద్దామని మా ఆఫీసుకి వచ్చారు. వీళ్లు ఏం తీస్తారులే అనుకున్నాను. సడన్‌గా వచ్చి సినిమా కంప్లీట్ అయ్యిందని చెప్పి కొన్ని సీన్స్‌తోపాటు, టీజర్ చూపించారు. చూడగానే షాక్ అయ్యాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కార్తీక్ మేడికొండ కార్తీక్ దర్శకత్వంలో కిరణ్, హర్షద కులకర్ణి, మహేశ్ కత్తి, గాయత్రి గుప్తా ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ధృవ ప్రొడక్షన్ బ్యానర్‌పై సుజన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘‘టైటిల్ గమ్మత్తుగా ఉంది. కొత్త తరహా సబ్జెక్ట్ ఇది. కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది’’ అన్నారు భరద్వాజ. ‘‘కార్తీక్‌కి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్ ఉంది. సుజన్ నిర్మాతగా సక్సెస్ అవ్వాలి ’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘నా మీద నమ్మకంతో కథ వినకుండా సినిమా తీయడానికి ముందుకొచ్చిన సుజన్‌కి థ్యాంక్స్. టీజర్‌తో పాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. జీవీ మంచి పాటలిచ్చారు’’ అన్నారు కార్తీక్. ‘‘డిఫరెంట్ జోనర్లో రియలిస్టిక్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడంలో సక్సెస్ అవుతామన్న నమ్మకం ఉంది’’ అన్నారు సుజన్. -
పవన్ కల్యాణ్ అభిమానులు ఇంకా వేధిస్తున్నారు!
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహేశ్ కత్తి మధ్య తలెత్తిన వివాదం ఇంకా సద్దుమణిగినట్టు కనిపించడం లేదు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులు తనను వేధిస్తున్నారని, అసభ్యంగా కామెంట్లు, మెసేజ్‌లు పెట్టడమే కాకుండా.. బెదిరింపులకు దిగుతూ ఫోన్‌కాల్స్ చేస్తున్నారని తాజాగా మహేశ్ కత్తి ఫేస్బుక్లో వెల్లడించారు. తనను బెదిరించిన పీకే అభిమానుల ఫోన్‌నంబర్లను, అసభ్యమైన కామెంట్లను ఆయన ఫేస్బుక్లో పోస్టుచేశారు. పవన్ అభిమానుల పేరిట ఎవరైనా తనకు కాల్ చేసి బెదిరించినా.. దూషించినా.. వారి వివరాలు, ఫోన్‌నెంబర్, వాయిస్ రికార్డింగ్‌తో సహా సోషల్ మీడియాలో వెల్లడిస్తానని, ఇది హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ నటన, సినిమాల గురించి క్రిటిక్ మహేశ్ కత్తి కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన అభిమానులు మహేశ్ కత్తిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మహేశ్ కత్తిని విమర్శిస్తూ, దూషిస్తూ, బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టడం, ఫోన్‌కాల్స్ చేయడం వంటి దుందుడుకు చర్యలకు దిగారు. దీనికి మహేశ్ కత్తి దీటుగా స్పందించారు. తనకు వచ్చిన బెదిరింపులపై ప్రజాస్వామిక పంథాలో ఆయన ఘాటుగా బదులిచ్చారు. దీంతో పవన్ అభిమాన సంఘాల నేతలు, మహేశ్ కత్తితో మాట్లాడి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చూసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పవన్ అభిమానుల ఆగడాలు ఆగడం లేదని, తాజాగా ఇప్పుడు కూడా తనకు బెదిరింపులు వస్తున్నాయని మహేశ్ కత్తి తాజాగా వెల్లడించారు. ఫొటో: మహేశ్ కత్తి (ఫేస్బుక్) -
అందుకే బిగ్‌బాస్‌కు ఎంపిక చేశారు
-
అందుకే బిగ్‌బాస్‌కు ఎంపిక చేశారు : కత్తి మహేష్
సినీ విమర్శకుడు, దర్శకుడిగా.. కొద్ది మందికి మాత్రమే తెలిసిన కత్తి మహేష్, బిగ్ బాస్ లాంటి ప్రస్టీజియస్ షోలో కంటెస్టెంట్ ఎలా అయ్యారు.? బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు..? బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కత్తి మహేష్ ను ఎంపిక చేయటం పై నిర్వహకులు చెప్పిన కారణం ఏంటి..? -
చురకత్తులు
-
బిగ్‌బాస్: క్రిటిక్‌గా వెళ్లి సెలబ్రిటీగా వచ్చాను!
బిగ్‌బాస్ నుంచి మహేశ్ కత్తి ఔట్.. నేడు మరొకరు కూడా.. ఆసక్తిగా సాగుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో శనివారం ఎపిసోడ్లో పలు ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఈ షో నుంచి సినీ విమర్శకుడు మహేశ్ కత్తిని ఎలిమినేట్ చేస్తున్నట్టు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. ఇక, హౌజ్ కొత్త కెప్టెన్ ఎన్నికైన శివబాలాజీ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి తప్పించుకోగా.. ఇప్పటికే మిగతా సభ్యులైన హరితేజ, కల్పన, దీక్షాపంత్లపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ముగ్గురిలో మరొకరిని కూడా ఎలిమినేట్ చేయబోతున్నట్టు ప్రకటించి ట్విస్టు ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ వారం ఎలిమినేట్ అయ్యే మరో కంటెస్టెంట్ ఎవరనేది ఆదివారం ఎపిసోడ్లో తెలియనుంది. అంతేకాదు మరో సెలబ్రిటీ కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి రాబోతున్నట్టు టీజర్ వదిలి ఆసక్తిని పెంచారు షో నిర్వాహకులు. హౌజ్‌లోకి రాబోతున్న కొత్త సెలబ్రిటీ ఎవరో నేడు తెలియనుంది. ఇక త్వరలోనే తన బిగ్‌బాస్ అనుభవాలను పంచుకోనున్నట్టు ఫేస్బుక్లో ఫిలీం క్రిటిక్ మహేశ్ కత్తి వెల్లడించారు. 'జీవించదగ్గ కాల్పనిక వాస్తవం-బిగ్ బాస్. నేను బయటికి వచ్చాను. చాలా అనుభవంతో. చాలా ఆలోచనలతో. త్వరలో పంచుకుంటాను. "వాస్తవానికి నిజానికీ మధ్య...50 లక్షలాట"' అంటూ ఆయన కామెంట్ పెట్టారు. ఫిలిం క్రిటిక్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ప్రవేశించిన తాను సెలబ్రిటీగా బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నదని, ఎయిర్‌పోర్టు వద్ద ఎంతోమంది సెల్ఫీలు కావాలంటూ తనను కోరారని, ఇది తనకు ఎప్పుడూ జరగలేదని మహేశ్ కత్తి ఫేస్బుక్లో తెలిపారు. -
'పెసరట్టు' టీంతో సాక్షి చిట్‌చాట్
-
బ్రేక్‌ఫాస్ట్ షో : 2014 మేటి సినిమాలు - విశ్లేషణ!